డైలీ సీరియల్

యమహాపురి -41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకర్ కళ్లు మెరిశాయి. సుందరం కళ్లు మెరిశాయి. ఏం చెబుతాడోనని ఇద్దరి ముఖాల్లోనూ ఆత్రుత.
‘‘నాది నరకపురి సార్!’’ అన్నాడు అప్పూ.
‘‘వ్వాట్!’’ అన్నాడు శ్రీకర్. ఇక్కడ నరకపురి ప్రసక్తి వస్తుందని అతడూహించలేదు.
‘‘ఔను సార్! నాది నరకపురి. నరకపురి వాళ్లకి ఎక్కడైనా జీతాలెక్కువ’’ అన్నాడు అప్పూ.
‘‘ఎందుకు?’’
‘‘అది ఇచ్చేవాళ్లని అడగాలి సార్- నాకేం తెలుస్తుంది?’’ అన్నాడు అప్పూ.
‘‘ఈ ఊళ్ళో నరకపురి వాళ్ళు ఎంతమందున్నారు?’’ అన్నాడు శ్రీకర్ మాట మార్చుతూ.
‘‘నాకు తెలియదు సార్! మా ఊరివాళ్ళు ఊరు దాటి వచ్చినపుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోరాదని నియమం’’ అన్నాడు అప్పూ.
‘‘నాకు మీ ఊరి వివరాలు కావాలి. చెప్పగలవా?’’ అన్నాడు శ్రీకర్.
అప్పూ వెంటనే, ‘‘సారీ సార్! మా ఊరి వివరాలు మా ఊరెళ్లి తెలుసుకోవాల్సిందే’’ అన్నాడు.
శ్రీకర్ అతడి ముఖంలోకి తీక్షణంగా చూశాడు. అప్పూ చలించలేదు.
క్షణమాగి, ‘‘నువ్వు మీ ఊరి వివరాలు చెప్పొద్దు. ఇంతవరకూ టిఫిన్ సెంటర్లో నువ్వేం చేశావో చెప్పొద్దు. నిన్నిప్పుడే విడిచిపెడతాను- ఒకే ఒక్క షరతుమీద’’ అన్నాడు శ్రీకర్.
‘‘చెప్పండి సార్! నావల్లనైతే ఒప్పుకుంటాను’’.
‘‘ఈ రోజునుంచీ నీ యజమాని ఏం చేస్తున్నాడో కనిపెట్టి నాకు చెప్పాలి’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఆయతో మీకేం పని సార్!’’ అన్నాడు అప్పూ.
‘‘యథారాజా తథా ప్రజా! నీ యజమాని మంచివాడైతే నువ్వూ మంచివాడివేనని నాకు రూఢి ఔతుంది’’
అప్పూ డీలాపడి, ‘‘ఇది నావల్ల కాదు సార్! నన్ను మీరు లాకప్‌లోనే ఉంచెయ్యండి’’ అన్నాడు.
‘‘ఏం? నీ యజమాని మంచివాడు కాదని నీకు అనుమానమా?’’
‘‘కాదు. నేను నరకపురి పౌరుణ్ణి సార్! యజమానిపై నిఘా వెయ్యడం- మాకు నిషిద్ధం’’ అన్నాడు అప్పూ.
‘‘వెరీ గుడ్!’’ అన్నాడు శ్రీకర్. ‘‘నిన్ను టెస్ట్ చేశానంతే కానీ- నా షరతు ఇదికాదు. నీ పేరు పోలీసు రికార్డులోకి రాకుండా నేను చూస్తాను. ఇక్కడేం జరిగిందో నువ్వు ఎవరికీ చెప్పకూడదు. అదీ నా షరతు’’
అప్పూ తేలికగా నిట్టూర్చి, ‘‘్థంక్యూ సార్!’’ అన్నాడు.
‘‘సుందరం- ఇతగాణ్ణి పంపించేసి ఒకసారి నా గదిలోకి రా’’ అన్నాడు శ్రీకర్.
ఇద్దరూ శ్రీకర్ రూంకి వెడుతుంటే పెంచల్రావొచ్చి- శ్రీకర్‌కి ఓ కాగితం అందించాడు.
శ్రీకర్‌కి అర్థమైంది. ‘‘కాగితంమీద పెట్టినప్పుడు చెప్పే విషయంమీద కొంత క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీతో నువ్వే చెబుతావో వినాలనుంది. కాగితం నా దగ్గరుంచుకుంటానులే, నరకపురి వివరాలు నీ నోటనే వినాలనుంది’’ అంటూ అతణ్ణి తన గదిలోకి తీసుకెళ్లాడు. మరి కాసేపట్లో సుందరం కూడా ఆ గదిలోకొచ్చాడు.
***
పెంచల్రావు నరకపురి వెళ్లలేదు. ఆ ఊరివాళ్లని కలవలేదు. కానీ ఆ నోటా ఈ నోటా ఆ ఊరి గురించి చాలా విన్నాడు.
నరకపురి ఒక మిస్టరీ. ఎవరైనా ఆ ఊరెళ్లాలన్నా, ఆ ఊర్నించి రావాలన్నా- ఆ ఊళ్ళో బంధువులో, మిత్రులో వుండాలి. లేదా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అదెలా లభిస్తుందో తెలియదు.
ఆ ఊరికి మకుటం లేని మహారాజు యమ. గ్రామస్తులాయనకు పూర్తిగా విధేయులు. ఎంతలా అంటే- ఆయన చెబితే వాళ్లు కళ్లు మూసుకుని అగ్ని గుండంలోకి దూకేస్తారు.
ఆ విధేయత వారికి ఎనలేని మేలు చేస్తున్నదని- బయటివారిలో కొందరనుకుంటారు. అలాంటి అదృష్టం తమకు పట్టలేదన్న బాధతో- వారు నరకపురి పౌరుల అదృష్టానికి అసూయపడతారు. కొందరు మాత్రం నరకపురి పౌరుల దౌర్భాగ్యం పగవారికి కూడా వద్దని జాలిపడతారు.
ప్రపంచానికైతే అతి పెద్దదైన మన ప్రజాస్వామ్యంలో నరకపురిని హిట్లర్‌లా శాసిస్తున్నాడని యమ గురించి చెప్పుకునేవారున్నారు. కానీ ఇంతవరకూ ఏ రాజకీయ నాయకుడూ ఆయన జోలికి వెళ్లలేదు. మన మీడియా కూడా నరకపురిలో నియంతృత్వాన్ని ప్రస్తావించదు.
నరకపురి జనాభా పాతికవేలు. ఊళ్లోని ఓటర్లు పదివేలకిపైగా ఉన్నారు. మొత్తం ఓట్లన్నీ యమ ఎవరికి చెబితే వాళ్లకి పడతాయి. రాజకీయ నాయకులు ఆయన జోలికి వెళ్లకపోవడానికి కారణం అదేనని కొందరంటారు.
ఎన్నికల సమయంలో యమ ఏ పార్టీని సమర్థిస్తాడో ముందే అందరికీ తెలుస్తుంది. కానీ ఆయన మద్దతు దొరకని రాజకీయ పక్షాలు కూడా ఆయనపై కత్తులు నూరవు. అందుకు కారణం తెలియదు.
పోలీసులు ఆ ఊరివైపు కనె్నత్తి చూడరు. అందుకు పైనుంచి ఆర్డర్లున్నాయంటారు.
‘‘ఆ ఊరికి కరెంటు, వంటగ్యాసు, టెలిఫోను, ఇంటర్నెట్ వగైరా సౌకర్యాలున్నాయి. మోటారు వాహనాలు తిరగడానికి అనువైనవి చక్కని బాటలున్నాయి. అన్నీ అనుభవించడానికి తగిన ఏర్పాట్లు యమ ఇంట్లో ఉన్నాయి. కానీ గ్రామస్థులకి మాత్రం అన్నీ నిషిద్ధం. కరెంటు సంగతి అటుంచి వాళ్లు కనీసం వంట గ్యాసు కూడా వాడుకోరాదట. ఎవరేమన్నా- నాకు మటుక్కు అదో దిక్కుమాలిన ఊరనిపిస్తుంది’’ అన్నాడు పెంచల్రావు.
శ్రీకర్ అతడు చెప్పినదంతా శ్రద్ధగా విని, ‘‘మనం అంగారక గ్రహానికి మనుషుల్ని పంపించి అక్కడి విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మన పక్క ఊరి గురించి సరిగ్గా తెలియదు’’ అని నిట్టూర్చాడు.
‘‘అందుకే మన పెద్దలంటారు- ఎంతటి జ్ఞానికైనా కూడా మిడిసిపాటు తగదని!’’ అన్నాడు పెంచల్రావు.
‘‘జ్ఞానికెప్పుడూ మిడిసిపాటుండదు. మిడిసిపాటున్నవాడు జ్ఞాని అనిపించుకోడు. అది సరే కానీ, నరకపురి గురించి నీకు అదనంగా ఏ సమాచారం తెలిసినా నాకు చెబుతూండు’’ అన్నాడు శ్రీకర్.
సరేనని పెంచల్రావు వెళ్లిపోయాడు. అప్పుడు శ్రీకర్ సుందరం వంక చూసి ‘‘ఈ నరకపురిలో ఏదో జరుగుతోంది. దానికి మనమేదో చెయ్యలనిపిస్తోంది. కానీ ఎలా?

ఇంకా ఉంది

వసుంధర