డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మీ ఈ సుఖాలను ఇస్తుందా? ఒక్కొక్క పైసా కూడాబెట్టి నీకు ఈ సుఖాలను ఇస్తున్నాంరా! ఒకప్పుడు పదిపైసలు దాచిపెట్టడానికి సియాల్‌దాహ్ నుండి కాలేజ్ స్ట్రీట్ దాకా నడిచివెళ్ళేవాడిని. మీ నాయనమ్మ గుడికి వెళ్తుంటే మధ్య దారిలో పడ్డ పేడను ఎత్తుకువచ్చేది. ఎందుకంటే పిడకలు చేస్తే ఆ రోజు గడిచిపోతుంది. ఒరేయ్ ఆర్మీలో ఎవరు వెళ్తారో తెలుసా? ఏ దారి తెన్నూ లేని వాళ్ళైనా వెళ్తారురా, లేకపోతే బతుకుమీద విసుగుపుట్టినవాళ్ళైనా వెళ్తారురా! అసలు నీకు ఏం తక్కువ అయిందని? చావడానికి అక్కడికి వెళ్తున్నావా! గుండెలకి పిస్తోలు గుళ్ళు తగులుతాయిరా!’’
సందీప్ తండ్రి కళ్ళల కొడుకుకోసం అనునిత్యం బాధపడే ఒక ఆత్మీయుడిని చూసాడు. అఅతడు భావుకుడు అయ్యాడు. మళ్లీ ఒకసారి తండ్రికి నచ్చచెప్పాలని ప్రయత్నం చేసారు. నాన్నగారూ! మీరు చెప్పేదాంట్లో నిజం ఉండవచ్చును. నాకు ఆర్మీలో ఇప్పుడు మీ వ్యాపారంలో కాని మరే ఉద్యోగాలలో కాని లభించే సుఖాలు లభించకపోవచ్చు. అంత సంపాదన లేకపోవచ్చును. నేను కలలు కనే ఆర్మీ జీవితం మిలటరీలో దొరకకపోవచ్చు. కాని ఇప్పుడు మీరందరూ జీవించే జీవితంకన్నా ఆ జీవితం మాత్రం వేరు. నాన్నగారూ! నాకు ముందు ముందు లభించే జీవితం ఎట్లాగైనా ఉండనీ కానీ నేను మీరు జీవించే జీవితాన్ని మాత్రం జీవించను. నేను నిర్ణయించుకున్నాను’’.
‘నిర్ణయం తీసుకున్నాను’- ఈ శబ్దాలు మళ్లీ అతని గుండెలమీద, పితృత్వంమీద చెర్నోకోళంతో కొట్టినట్లుగా అనిపించాయి. కొడుకు చేతిలో పూర్తిగా మోసోయాడు. ఆయనలో దుఃఖం పెల్లుబికింది. ఈనాడు ఇంట్లో అంతా హాయిగా సుఖంగా ఉంది అని అనుకుంటుంటే ఒక్కసారిగా విధి ఎందుకిట్లా బాధపెడుతోంది. ఎందుకు? ఇది తన ఆనందమయ జీవితానికి, సుఖంగా తృప్తిగా నడుస్తున్న జీవితానికి అంతము! ఈ అంతిమ జీవితానికి ఇది మొదలా? ఆయనలో ఆలోచనా తరంగాలు లేస్తున్నాయి. అసలు ఈ కుటుంబంలో గత ఏడు తరాల నుండి ఏ కొడుకైనా ఆర్మీలో ఏమిటి కనీసం ఉద్యోగం కూడా చేసాడా? ఊహ.. ఒకతరం ముందు తన సోదరి కొంత ప్రతిఘటన చేసిన మాట నిజమే. పెళ్లి చేసుకోనంది. సన్యాసం తీసుకుని సాద్విని అవుతానని నిర్ణయం తీసుకుంది. ఈ సందీప్‌లో కూడా మేనత్త జీన్స్ వచ్చాయా! ఉఫ్.. మేనత్త పోలికలు.. ఆయన కఠోరంగా అన్నాడు. ‘‘నీవు.. ఆర్మీలో చేరడానికి వీలు లేదు. ససేమిరా వీలు లేదు’’. తండ్రి శేఖర్‌బాబు ఎంత కఠోరంగా అన్నాడో అంత కఠినంగానూ కొడుకు సందీప్ ‘ఇటీజ్ మై లైఫ్ డాడీ.. ఇటీజ్ మై డెసిషన్ పాపా! మీకు పురాణాలంటే ఎంతో ఇష్టం కదా నాన్నా! మహాభారతంలో కృష్ణుడు ఒకచోట ఇట్లా అంటాడు- ప్రతి మనిషి తన కర్మభూమికి పునాదిరాళ్ళను స్వయంగానే వేసుకోవాలి. స్వయంగానే రాళ్ళను కొట్టాలి. మరి ఆ కర్మభూమి నా కలల కర్మభూమి ఎందుకు కాకూడదు. రాళ్ళను కొడుతున్నప్పుడు కూడా ఆనందానుభవం కలగవచ్చుగా..’’ అన్నాడు.
‘‘పోరా.. పోరా.. ఏ నూతిలో దూకుతావో దూకు’’ కోపంతో ఊగిపోవడం వలన శేఖర్ బాబులో ఒణుకు మొదలయింది. ఇప్పటిదాకా వాళ్ళ నోట వీళ్ళ నోటా వింటూనే ఉన్నాడు. పిన్నలు పెద్దవాళ్ళకి ఏ మాత్రం గౌరవం ఇవ్వడంలేదు. కాలం ఎంతగా మారిపోయింది. కాని.. కాని ఈనాడు తన ఇంట్లోనే.. ఇంత తొందరగా ఇంతగా వాతావరణం మారుతుందని, పిల్లల నోటి నుండి ఇటువంటి మాటలు వినాల్సి వస్తుందని తను కలలోకూడా అనుకోలేదు. అసలు తన కొడుకు తనకు తిరిగి జవాబు చెప్పడం ఒక్కటే కాదు తన అస్తిత్వాన్ని గాలిలోకి వదిలేసాడు. ఇంట్లో నలువైపులా ఒకటే వాక్యం ప్రతిధ్వనిస్తోంది- ‘ఇట్స్ మై లైఫ్! మై డెసిషన్’’.
ఆ రాత్రి శేఖర్‌బాబు ఏమీ తినలేదు. ఎవరితోనూ ఒక్క మాట అయినా మాట్లాడలేదు. గదిలో తలుపులు మూసుకుని ముసుగుతన్ని పడుకున్నారు ఆయన.
ఆ రాత్రి తల్లి సందీప్ ఫాలభాగం పైన చేత్తో రాస్తూ కొడుకుకి నచ్చచెప్పాలని చూసింది. ప్రేమగా ఆవిడ అన్నది- ‘‘బాబూ! నువ్వు ఇంటికి పెద్దకొడుకువి. నువ్వు వెళ్లిపోతే సిద్ధార్థను ఎవరు పట్టించుకుంటారు చెప్పు. ఇక నాన్నగారికి బిజినెస్ చేయడంలో టైమ్ ఎక్కడ దొరుకుతుంది. అసలు ఒక్క నిమిషం కూడా ఆయనకి తీరిక లేదు. మరి ననె్నవరు పట్టించుకుంటారు చెప్పు?’’
‘‘అమ్మా! సిద్ధార్థ గురించి నువ్వు బెంగ పెట్టుకోకు. ఇప్పుడు వాడేం పిల్లవాడు కాదు. వాడికి బోలెడు తెలివి ఉంది. వాడు నా నిర్ణయాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. ఇక నీ విషయం- నీకెప్పుడు అవసరం అయితే అప్పుడు పిలు. నేను ఎప్పుడు నిన్ను మరచిపోను’’.
కొడుకు మాటలు విని తల్లి వౌనంగా ఉండిపోయింది. ఇక ఈ వెల్లువను ఆపలేము. సందీప్ ఆవేశకావేశాలను ఆపడం ఇక ఎవరి తరము కాదు. సందీప్‌కి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఒకే ఆలోచన- ఇండియన్ ఆర్మీ.
***
సందీప్‌కి ‘నీవు బరువు తగ్గించుకోవాలి. ఇంటర్‌వ్యూలో నిన్ను రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆర్మీలో చేరేవాళ్ళ శరీరం దృఢంగా ఉండాలి కాని ఊబకాయం వాళ్లకి పనికిరాదు, చురుగ్గా ఉండాలి, సింహంలా ఉండాలి’ అని ఎవరు చెప్పారో ఏమో, ఈ మాటలు బాగా తలకెక్కాయి. అప్పటినుం ఇరవై నాల్గుగంటలూ బరువు తగిగంచుకోవాలన్న యోచన వలన వ్యాయామం చేయడం మొదలుపెట్టాడు.
ఫెళఫెళమని మండుతున్న ఎండలో సందీప్ నిల్చుని ఉండటం చూసాక శేఖర్‌బాబు మనస్సు ఎంతో బాధపడేది.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత