డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు ..18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు రకాల వార్తలు
వాహ్! వార్తలను కూడా విభజించారు. వాళ్ళందరు ఎంతగానో నిమగ్నులై ఈ వార్తలు చదువుతారు.
యాక్షనల్ ఇన్‌ఫర్‌మేషన్- అంటే మిలిటెంట్లు ఫలానా ఇంట్లో ఉన్నారు. లేకపోతే వాళ్ళు రాబోతున్నారు. ఇటువంటి వార్త రాగానే దీనిమీద వెంటనే యాక్షన్ తీసుకుంటారు.
రీసెంట్ ఇన్‌ఫర్‌మేషన్- అంటే నిన్న మిలిటెంట్లు ఫలానా ఇంటికి వచ్చారు. అక్కడే ఉంటున్నారు. ఫలానా.. ఫలానా వ్యక్తులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి.
నేను నా కంపెనీ రీసెంట్ ఇన్‌ఫర్‌మేషన్ ఇస్తుందన్న ఆశతో ఎదురుచూస్తూ ఉంటాను.
-బాక్‌గ్రౌండ్ ఇన్‌ఫర్‌మేషన్- మిలిటెంట్లకు ఎవరెవరు ఇంతకుముందు సహాయం చేశారు. ఏ కుటుంబాలకు ఈ మిలిటెంట్లు చెందుతారు.
జనరల్ ఇన్‌ఫర్‌మేషన్- ఊళ్ళో ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి. కొత్త మార్గాలు ఎవరైనా వేస్తున్నారా? కొత్త ఇళ్ళు ఎవరైనా నిర్మిస్తున్నారా?
శ్రీనగర్ నుండి జమ్మూ వెళ్ళాలంటే ఏ సైనికుడైనా వాహనాల్లో వెళ్ళకూడదు. ఒకసారి ఎనిమిది మంది సైనికులు టాటా సుమోలో వెళ్తున్నారు. ఒక టిప్పర్ టాటా సుమోను ఢీకొనడం వలన పెద్ద దుర్ఘటన జరిగింది. అందులో ఐదుగురు సైనికులు చనిపోయారు. మిలిటెంట్లే ఈ టిప్పర్‌ని పంపించారని తెలిసింది. మీరు వెళ్ళే తొందరలో ఉంటే మిమ్మల్ని విమానంలో పంపిస్తాం.
సి.వో మీకు నూరేళ్ళు. మీరు ఇచ్చిన ఈ సూచనలకు సలామ్. బహుశా అందువలనే మీ పోస్టింగ్ టైమ్ క్యాష్యూయాలిటీ చాలా తక్కువ. బహుశా నేను కూడా బతికిపడతానేమో.. మనస్సులోనే అతడు సి.వోకి శభాష్ అంటూ వీపు తట్టాడు. అతడు కుడి వైపు తిరిగాడు. ఇక్కడ కూడా సైనికులకు సూచనలు ఇవ్వబడ్డాయి. అతడు చదవడం మొదలుపెట్టాడు.
- ప్రతి సైనికుడికి ఒక చిన్న స్నేహితుడు ఉండాలి.
- యుద్ధం తెలివిగా చేయాలి. అంతేకాని కాళ్ళతో కాదు.
- ఆపరేషన్ ఒక వేటగాడిలా చేయండి. చౌకీదారుగా మాత్రం వద్దు.
- సివోస్ కార్నల్ ఎప్పుడూ చదువుతూ ఉండండి. ఇవ్వబడిన సూచనలను ఆచరణలో పెట్టండి.
- మీ నివాసస్థానాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. మీరు మిలిటెంట్లకన్నా ఎక్కువ బలవంతులుగా ఉండాలి.
- ఫీల్డ్ క్రాఫ్ట్/ బాటిల్ క్రాఫ్ట్‌ని ఉపయోగించండి.
ఆపరేషన్‌కి వెళ్ళే ముందు బ్రీఫింగ్, తరువాత డిబ్రీఫింగ్, ఆ తరువాత ఆపరేషన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి.
-బాడీ సిస్టమ్‌ని అమలుపరచండి.
సందీప్‌కి బూషన్ బేస్ క్యాంప్‌లో తిరుగుతుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. కొన్ని రోజుల క్రితమే చార్లీ కంపెనీకి కంపెనీ కమాండర్‌గా ఇక్కడికి వచ్చాడు. పోస్టింగ్ గూడ్‌గాంవ్‌లో. కాని మధ్యమధ్యలో రిపోర్టింగ్‌కి హెడ్ క్వార్టర్ బూషన్‌కి రావాల్సి వస్తూ వుంటుంది. ఇది రాయిఫిల్స్ 14కి బేస్ కాంప్.
ఆఫీసర్లకి, సైనికులకి లిఖితరూపంలో ఇచ్చిన ఈ సూచనలను చదువుతూ చదువుతూ కమాండింగ్ కర్నల్ ఆప్డే గదిదాకా వచ్చాడు. ఒకసారి తొంగి చూసాడు. బయట రంగు లైట్ వెలుగుతోంది. ఆకుపచ్చ లైట్ వచ్చేవరకూ ఎదురుచూడాలి.
తిరుగుతూ తిరుగుతూ ముఖ్యద్వారం దాకా వచ్చాడు. ఇక్కడ వాహనాలు చాలా వున్నాయి. సందీప్ ఇక్కడికి కొత్తగా వచ్చాడు. పీస్ పోస్టింగ్‌నుండి ఫీల్డ్ పోస్టింగ్ వేరుగా వుంటుంది. అందువలన అతడు ఈ పెట్రోలింగ్ మామూలుగా ఎప్పుడు చేసేదేనా లేకపోతే ఏదైనా ముఖ్యమైన ఆపరేషన్ కోసమా తెలుసుకోలేకపోయాడు. అప్పుడే అతడికి కెప్టెన్ ఆనంద్‌తో పరిచయం అయింది. రాంచీ పోస్టింగ్ టైమ్‌లో ఆనంద్ తనతో ఉండేవాడు.
అతడు అడిగాడు- ‘ఏదైనా ఆర్మీ ఆపరేషన్....’
‘‘ఉహూ.. ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే మేము... ఆ కొడుకులకి తెలియకుండా వెనక వెళ్తాము. వాళ్ళని పాతేస్తాము. ఇదంతా వాళ్ళని భయపెట్టడానికి ఆడే నాటకం. నక్కలని భయపెట్టాలంటే సింహాలు గర్జించాలి, తప్పదు’’.
సందీప్ చిరునవ్వు నవ్వాడు. ముందుకు నడవడం మొదలుపెట్టాడు.
భూషన్ క్యాంప్ లోపల రెండు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. బయట చిన్న మెటల్ బోర్డు మెరుస్తోంది. దానిమీద ఇట్లా రాసి ఉంది- వీరత్వం- దృఢత్వం.
సందీప్‌లో ఆలోచనా తరంగాలు లేస్తున్నాయి. ఇంతవరకు తను రాంచి, మధుర పోస్టింగ్‌లని చూసాడు. రెండూ పీస్ పోస్టింగ్‌లే. అందువలన అక్కడి వాతావరణం ఇక్కడికన్నా పూర్తిగా వేరుగా ఉంది. అక్కడ కూడా ఎంబ్లమ్ వుంది. ‘్ధరత్వం - వివేకం’ కాని వివేకం బదులుగా దృఢంగా అని రాసి ఉంది. బహుశా ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి వివేకం కాదు కావలసింది దృఢత్వం. కాని ఎందుకు? వీరత్వం, వివేకం, దృఢత్వం మూడు కలిపి పనికిరావా? అక్కడ గుడి చూసాక అతడికి ఆశ్చర్యం అనిపించింది.
ఆర్మీ వాళ్ళకి భగవంతుడిపైన, విధివిలాసంపైన నమ్మకం ఎక్కువ. ఈ విషయం అతడికి తెలుసు. వాళ్ళ జీవితాలకు ఎప్పుడూ ముప్పే. ఏ క్షణం ఏం అవుతుందో వాళ్లకి తెలియదు. జీవితంలో వచ్చే కష్టాలవలన వాళ్ళందరు ఎక్కువగా ఆస్తికులై ఉంటారు. భగవంతుడు, కర్మ సిద్ధాంతం వాళ్ళకు బలాన్నిస్తాయి. ప్రతి ఆపరేషన్‌ముందు ‘జయ భజరంగ్‌బళీ’ అని వాళ్ళు ఉద్ఘోష చేస్తారు. సైనికులకు కేవలం భగవంతుడిమీద నమ్మకమే కాదు, వాళ్ళు భారతీయ సంస్కృతిలో భాగం అయిన పునర్జన్మ,

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత