డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబంలోని వారందరిని, బంధువులందరిని భార్యాభర్తలని ఒక సూత్రంలో బంధించి ఉంచగల శక్తి వివాహంలో ఉంది. ప్రతి ఆచారాన్ని పాటించేటప్పుడు ఏదో ఒకదానిలో అందరిని ఇన్‌వాల్వ్ చేసి దాని విశిష్టతను తెలియపరచడమే కాక అందరిని ఆత్మీయత అనే దారంతో ముడివేయగల శక్తి మన పెళ్లి తంతులో వుంది. సందీప్ ఆలోచనల ప్రవాహానికి ఒక్కసారిగా బ్రేకు పడ్డది. ఆ ఇంట్లో అంతా సందడిగా వుంది. వధూవరుల మధ్య పోటీ నడుస్తోంది. నీళ్ల పాలతో నిండిన ఒక పళ్లెం ఉంది. అందులో కొన్ని గవ్వలు, పసుపు పిండిలతో చేయబడిన కొన్ని పళ్లు ఉన్నాయి. కొన్ని ఇనుప రింగులు ఉన్నాయి. వీటితోపాటు ఒక వెండి ఉంగరం, వరుడు ఒక చేతితో ఈ వెండి ఉంగరాన్ని వెతకాలి. వధువు రెండు చేతులతో వెతకాలి. ఏడుసార్లు ఈ ఉంగరాన్ని విసురుతారు. ఇప్పటివరకు వధువు గెలుస్తోంది. ఇది ఏడోసారి..
ఇది సిద్ధార్థకు చివరి పరీక్ష. ఇందులో గెలవాలి. లేకపోతే జన్మంతా భార్య దగ్గర ఓడిపోతునే ఉంటాడు అని ఒక స్ర్తి అన్నది.
వాహ్! ఈ ఆటల వెనక ఎన్ని అర్థాలు, ఎన్ని ఆలోచనలు దాగి ఉన్నాయో.
మరో తంతు- సిద్ధార్థ చేతిలో బట్టతో చేసిన ఒక కొరడా వుంది. అతడు దానిని గాలిలో ఊపుతున్నాడు. వధువుమీద విసురుతున్నాడు. ఆమె ఆ కొరడా తగలకుండా పరుగెత్తుతూ నాటకం ఆడుతోంది. అక్కడున్న వాళ్లందరూ నవ్వుతున్నారు. వధువు శరీరంపై ప్రతీసారి కొరడా దెబ్బ పడబోతూ వుంటుంది. ఆమె తనను తను రక్షించుకుంటూ ఉంటుంది. ఈ ఆచారం కూడా మన సమాజానికి అద్దం పడుతుంది. సంసార జీవితం ప్రారంభించేటప్పుడు పురుషుడు అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. కొరడా చేతిలో పట్టుకుని జీవితం అంతా తన చెప్పు చేతులలో ఉంచుకుంటాడు.
ప్రతీ తంతు వెనుక ఉన్న అర్థాన్ని వెతుకుతున్నాడు సందీప్.
ఇంతలో మరో తంతు మొదలయింది.
కాళ్లు పట్టుకుని వేడుకునే తంతు ఇది.
వధువు ఇంటి పెద్దలందరి కాళ్లు పట్టుకుంటుంది. వధువుకు ఆశీర్వాద రూపంలో ఏదో ఒక బహుమతి ఇచ్చేదాకా కాళ్లను పట్టుకునే ఉంటుంది.
శేఖర్‌బాబు ఆశీర్వాద రూపంలో ఒక బంగారు నాణెం ఇచ్చాడు. ఆయన భార్య బంగారపు గొలుసు ఇచ్చింది.
ఇప్పుడు సందీప్ వంతు వచ్చింది.
అవివాహితుడైన బావగారు. ఎవరో నవ్వుతూ అన్నారు. మార్వాడీ సమాజంలో అసలు పెళ్లి కాకుండా ఉండడం ఒక పెద్ద తప్పుగా భావిస్తారు. ‘అవివాహితుడు’ అన్న శబ్దం సిద్ధార్థ గుండెలలో బల్లెంలా గుచ్చుకుంది. అసలు నిజానికి ఇక్కడ వున్న వారందరిలో ఎవరూ సందీప్ కాలి గోటి మట్టికి కూడా పనికిరారు. సిద్ధార్థ మనస్సు బరువెక్కింది. అన్నయ్య ఎవరికోసమో ఎదురుచూస్తున్నాడు అని తనకి తెలుసు. జీవితంలోని వసంతాన్ని రాబోయే ఆమె కోసం ఎదురుచూస్తూ పోగొట్టుకుంటున్నాడు. సందీప్ స్నేహితుడు మేజర్ సుఖవంత్ అన్న మాటలు చెవుల్లో మారుమ్రోగుతున్నయి. సందీప్ పిచ్చివాడు కాక మరేమిటి? ఇది ఎదురుచూడడం కాదు. మూర్ఖత్వం. కొంతమంది సమాజపు బరువునంతా తమ నెత్తిమీద మోస్తూ ఉంటారు. జమీల్ కుటుంబం నాశనం కావడానికి సందీప్ బాధ్యుడు కాదుగా! కాని ఆ రుబీనా కోసం ఎదురుచూస్తున్నాడు. ఆమెని ప్రేమిస్తున్నానంటాడు’’.
రుబీనా! రుబీనా! ఎవరు? సిద్ధార్థ ఆశ్చర్యపోయాడు. మీకు తెలియదా! ఏమీ తెలియదా! ఇప్పుడు సుఖవంత్ సింహ్ అవాక్కయ్యాడు.
యార్! సిద్ధార్థ! ఒకవైపు అన్నయ్య జీవితంలో తుపానులు లేస్తున్నాయి. నీకు తెలియదా! నువ్వు నీ లోకంలో మునిగిపోయి ఉన్నావు. జమీల్‌ని చంపినప్పటినుండి ఏమయిందో గాని సందీప్ ఆత్మని వాడు ఆవహించాడా అని అనిపిస్తోంది. నేను ఎన్నోసార్లు నచ్చచెప్పాను. కాని అతడు జమీల్‌ని చంపి నేను ఒక ఆర్మీ ఆఫీసరు బాధ్యతను నిర్వహించాను కాని ఆ కుటుంబం వారికి చేయూతనిచ్చి ఒక నాగరికుడి ధర్మం నిర్వహించాలని అనుకుంటున్నాను అని అన్నాడు. నీవు సహారా ఇస్తానంటూ జమీల్ చెల్లెలిని భార్యగా చేసుకోవు గదా! ఈ ముల్లాల విషయం ఎవరికి తెలియదు. తమ ఆడపిల్లలను ఎరవేసి నిన్ను లొంగదీసుకోవాలనుకుంటున్నారేమో. ఆ కుటుంబం తన స్వార్థం కోసం సొంత కొడుకునే చంపివేసింది. అటువంటి కుటుంబం ఏమైనా చేస్తుంది అని నేనన్నాను. వేరే వాళ్లను వదిలేయి, అసలు మనం ఎవరో తెలుసుకోగలమా! ఈనాటివరకు ఆకలితో అలమటిస్తున్న దీనాతిదీనంగా బతుకుబండి ఈడుస్తున్న రుబీనాను పెళ్లి చేసుకుందాం అని అడిగితే ఆమె ఎగిరి గంతేస్తుదని, ఆనందంగా ఊ కొడుతుందని అనుకున్నాను. కాని.. కాని.. ఆ అభిమానవతి ఏం జవాబు చెప్పిందో తెలుసా! నీవు మహమ్మదీయుడివి కావు హిందూవి. మీరు ఆర్డర్‌ను అమలు జరపడానికే అట్లా చేశారు అని నాకు తెలుసు. జమీల్‌భాయి చంపబడ్డాక కూడా మీరు మానవత్వంతో మా కుటుంబానికి మంచి చేయాలని ఎంతో ప్రయత్నించారు. మేం మళ్లీ బతుకుతెరువు చూసుకుని జీవించాలని మీ కోరిక. అందుకే మిమ్మల్ని నేను ఎంతో గౌరవిస్తాను. కాని పెళ్లి విషయానికి వచ్చే సరికి ఎందుకో నా మనసు మూగ వోతుంది. దానికి నా దగ్గర మీరు అడిగితే సమాధానం లేదు. కనుక ఈ విషయాన్ని వదిలేయండి. నామనసు పెళ్లికి తయారుగా లేదు కనుక నేను పెళ్లిచేసుకోనని చెప్పింది ఆమె అని సందీప్ చెప్పాడు.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత