డైలీ సీరియల్

బడబాగ్ని 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాంతో పై ప్రాణాలు పైకే పోయాయి ఆ యిద్దరికీ..
‘‘సార్ నిజంగానే వాడెవరో నాకు తెలియదు.. వాడిని నే చూడలేదు కానీ, అలా చెయ్యమని నాకు ఎవరో ఫోన్ చేశారు...
‘‘అహా.. ఎవరో ఫోన్ చేస్తే పంపించావ్, ఫోన్ చేసినవాడెవడో తెలియదు, ఆ వచ్చినవాడెవడో తెలియదు.. మరి నీ పదివేలూ ఎలా వచ్చాయ్.. ఎగురుకుంటూ వచ్చాయా..’’
‘‘నిజంగా సార్.. అలా చేస్తే నా ఖాతాలో పదివేలు జమ అవుతాయనీ, నాకేం సమస్య వుండదనీ... ఆ రోజు ఈ హోటల్లో రజనీకాంత్ సార్ దిగాడనీ... ఆయనంటే తన తమ్ముడికి చాలా యిష్టం అనీ, ఆయనను చూడటానికే వాడు వెళ్ళడానికి అలా అడుగుతున్నాననీ అంటే.. నేను నిజంగా స్టార్ రజనీకాంత్ సార్ ఆ రోజు వచ్చినమాట నిజమేనని కంఫర్మ్ చేసుకునే ఒప్పుకున్నాను.. నా ఖాతా నంబర్ వాళ్లకి చెప్పా సార్.. నిజంగా నాకింకేం తెలియదు సార్...’’ అమాంతం కాళ్ళమీద పడిపోయాడు.
‘‘సరే.. నీ ఖాతా నెంబర్, బ్యాంకు పేరు దీనిమీద వ్రాయి, అలాగే నీ ఫోన్ నెంబర్.. ఈ ఎంక్వైరీ సంగతి ఎవరితో అనకు. ఇక్కడే మర్చిపో.. లేకపోతే నీ మీద కేసు బనాయించడం నాకు పెద్ద పనేం కాదు..’’ స్క్రిబ్లింగ్ పేడ్ అతని చేతికిచ్చాడు. అతను గబగబా వ్రాసి చేతికిచ్చి ఇంక వెళ్లనా అన్నట్లు చూశాడు.
‘‘చూడు.. ఈ వేళా రేపూ రోజులు బాగా లేవు.. వెధవ డబ్బుకి కక్కుర్తిపడి పీకలమీదకు తెచ్చుకోకండి.. అప్పారావ్.. నీ ఫోన్ నెంబర్ కూడా రాయి.. నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి.. మళ్లీ అవసరం పడితే ఫోన్ చేస్తా.. రుూ దర్యాప్తు రహస్యంగా జరుగుతోంది.. ఎవ్వరి దగ్గరా అనకండి.. అప్పారావ్ నువ్వు ఇంకో పని చెయ్యాలి.. ఆ రోజు ఏ.సి సర్వీసింగ్ ఎన్ని గంటలకి జరిగిందో సుమారుగా తెలుసుగా... మీ సీసీ కెమెరాల్లో ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది. ఆ ఫుటేజ్ ఒక్కసారి తీసి నాకు చూపించాలి.. అతనిని మనం ట్రేస్ చెయ్యాలి.. పద..’’ అంటూ లేచాడు.
అప్పారావు, అతనూ బ్రతుకు జీవుడా అనుకుంటూ లేచారు.. రాహుల్ ఆ ఫుటేజ్ చూసి ఒక్కసారిగా నిరాశ చెందేడు. నల్లని కోటు, పైన టోపీ, ముఖానికి ఎలర్జీ వాళ్ళు ధరించే మాస్క్, కళ్ళజోడు.. ఏ విధంగానూ గుర్తుతెలియకుండా వుంది అతని ఆహార్యం.
సరే ఇంక బ్యాంకు ఖాతా కూడా ఒకసారి పరిశీలిస్తే, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని తనకు తానే ఆశ కలిగించుకున్నాడతను.
ఆ మర్నాడు ఆ ఏసీ సర్వీసింగ్ అతను చెప్పిన ప్రకారం ఆ బ్యాంకుకు వెళ్ళాడు. అతని ఖాతాకి పదివేల రూపాయలు ఎవరు కట్టారు అన్న విషయ నిర్థారణ కోసం అతను చెప్పిన బేంక్‌కి వెళ్లి ఫలానా తారీఖున, ఆ ఖాతాలో జమ వివరాలు అడిగేడు రాహుల్.
తనని తను పరిచయం చేసుకుని.. కేసు దర్యాప్తులో భాగంగా వచ్చాననీ, దయచేసి ఆ ఖాతాలో ఆ రోజు ఆ అవౌంట్‌ను ఎవరు జమ చేశారో చెప్పవలసిందిగా కోరాడు. ఆ మేనేజర్ అది బ్యాంకు రూల్స్‌కి వ్యతిరేకమైనా.. పోలీస్ కేసు అంటున్నారు కనుక చెబుతానని, చాలా ఉదారంగా ఆ రోజు వోచర్స్ తెప్పించి చూపాడు.. ఆ ఖాతాకి శివరావు అనే వ్యక్తి ఖాతానుండి జమ అయినట్టు వుంది అందులో. శివరావు ఖాతా వివరాలు చూసి రాహుల్ ఒక్కసారి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు, కారణం శివరావు చిరునామా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌దే అవడం అతనికి చాలా బలాన్ని ఇచ్చింది. తన శోధన సరైన దిశగానే జరుగుతోందనీ, అతి త్వరలో ఆ మిస్టరీ సాల్వ్ చెయ్యగలననే నమ్మకం అతనికి కలిగింది. బేంక్ మేనేజర్‌కి ధన్యవాదాలు తెలిపి అతను ఆ చిరునామాలో ఉన్న ఫోన్ నెంబర్‌కి కాల్ చేసి శివరావ్‌ని ఒకసారి అర్జెంట్‌గా కలవాలనీ, ఎపుడు ఎక్కడ కలుద్దామంటే అక్కడికి తను వస్తానని చెప్పి, బేంక్ మేనేజర్‌కి ధన్యవాదాలు చెప్పి బయటకొచ్చాడు రాహుల్. ఒకటి మాత్రం అర్థమైంది.. హంతకుడిది మామూలు తెలివికాదని.
బయటపడ్డ రాహుల్‌కి చాలా నిరాశగా అనిపించింది. అస్పష్ట ఆకారం ఏదో తనని చూసి గేలిచేసి నవ్వుతున్న భావన.. ఎలా.. ఎలా.. ఎలా.. పరిష్కరించాలి ఈ సమస్యని.. హంతకుడి తెలివితేటలకి.. తలొగ్గి కమల్ చావుని ప్రమాదవశాత్తు జరిగినట్టు భావించి వదిలెయ్యాలా..
లేదు.. ప్రాణాలమీదకి తెచ్చిన ఆ పరిశోధనలో కమల్ ఖచ్చితంగా ఏవో ఆధారాలు సంపాదించే ఉంటాడు.. అందుకే అతని ప్రాణం తీసి ఉంటాడు.. కమల్ చాలా తెలివైనవాడు. తను సంపాదించిన ఆధారాలు ఎక్కడో, ఏదో రూపంగా జాగ్రత్తగా చేసే ఉంటాడు.. తను నిస్పృహ చెందకుండా.. ఆలోచించి ఎలాగైనా వాటిని సాధించాలి, అదే తను కమల్‌కిచ్చే నిజమైన నివాళి.. ఆలోచిస్తూ హోటల్‌కి చేరాడు రాహుల్.
ఆ రాత్రి భోజనం చేసి బాల్కనీలోకి వచ్చిన అతనికి.. ఏసీ మెషీన్ నుండి వాటర్ కారే ట్యూబ్ ఊడి కిందకు వేలాడుతూ కనబడింది...
రాహుల్ ఆ ట్యూబ్ చేత్తో పట్టుకు చూసాడు, అది గదిలోని ఏసిని బయట మెషిన్‌ని కలిపే ట్యూబ్. దానిని పీకేసారెవరో.. ఎవరో ఏమిటి.. వాడే.. ఆ హంతకుడు పంపిన ఆ మనిషి.. పీకి ఏం చేశాడు.. కానీ ఏదో చేశాడు.. అదే యిటు కమల్ మరణానికి, అటు మహేష్ మరణానికి కారణం అయింది. ఏమిటది..’’ అస్థిమితంగా తల కొట్టుకున్నాడు రాహుల్.. మళ్లీ లోనికి వెళ్లాడు.. ఈ ఆలోచనలతో పిచ్చెక్కేలా ఉందని కాస్త మనశ్శాంతి కోసం టీవీ పెట్టాడు. ఏదో ఇంగ్లీష్ వార్ ఫిల్మ్ వస్తోంది.. అన్యమనస్కంగానే చూడటం మొదలుపెట్టాడు.

-ఇంకాఉంది

- మీనాక్షి శ్రీనివాస్