అంతర్జాతీయం

వైద్యులను అనుమతించటం లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయనను చూసేందుకు వైద్యులను అనుమతించటం లేదని షరీఫ్ కుమార్తె మర్యం అన్నారు. లాహోర్‌లోని లఖ్‌పట్ జైలులో ఏడేళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్న షరీఫ్‌కు గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వైద్యులు ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా జైలు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నట్లు కుమార్తె మర్యం వెల్లడించారు. తన సోదరుడికి ఏదైనా జరిగితే ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని షరీఫ్ సోదరుడు, పీఎంఎల్‌ఎన్ అధ్యక్షుడు షహ్‌బాజ్ హెచ్చరించారు.