అంతర్జాతీయం
అమెరికాలో 52మంది భారతీయులు అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 June 2018
వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా చొరబడ్డారంటూ అక్కడ ప్రభుత్వం అరెస్టు చేసిన వారిలో 52మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సిక్కులు ఉన్నట్లు గుర్తించారు. మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడ్డారని, వీరు ఒరెగాన్ రాష్ట్రంలో ఆశ్రయం పొందటానికి ప్రయత్నిస్తున్నారంటూ అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది.ఫెడరల్ నిర్భంద కేంద్రంలో 123 మంది బందీలుగా ఉన్నట్లు చట్టసభ్యులు గుర్తించారు. రోజులో 22 గంటలు ఓ చిన్న గదిలో ముగ్గుర్ని చొప్పున ఉంచుతున్నారని వెల్లడించారు. వీరి పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు.