Others

అరిషడ్వర్గాలను అదుపుచేసే ఆరు శ్లోకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం ఆరుశ్లోకాలల్లోనే భగవం తుని గూర్చి తెలుసుకొంటూ భగవం తుని శరణాగతిని పొందవచ్చని ఆదిశంకరులు మనుషులకు ఇచ్చిన బహుమతిగా షట్పదిస్తోత్రాన్ని భక్తుల భావిస్తారు... ఆ సాహితీ కుసుమం లోని పూలపరిమణం ఇదే ఓ భక్తుడు తన మనసులోని విషయాన్నంతా తనకు ఆప్తుడు, మిత్రుడు, అంతేకాదు తన సర్వస్వము అయన భగవంతునికి తనకు కావాల్సినదాన్నంతా నివే దిస్తున్నాడు. ముందు తనలో ఉండకూడని విషయాలను చెబుతూ తనకు కావల్సిన వాటిని అనుగ్రహించమని కోరుకుం టున్నాడు.
అవినయ మపనయ.......
నాలో ఉన్న అవినయాన్ని తొలగించి సంసార సాగరంలో ఈదులాడే నాకు, వినయాన్ని అలవడే విధంగా మనో నిగ్రహాన్ని కలిగించే శక్తినిమ్ము . ఆపై ఎండమావులవంటి విషయ వాంఛలకు లోనుకాకుండా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడానికి తగిన శక్తి సామర్ధ్యాలను సమకూర్చమని మొదటి శ్లోకంలో కోరుకుంటాడు. ఆ తరువాత రెండవ శ్లోకంలో
దివ్యధునీ మకరందే..................
శ్రీపతి పదారవిందముల సేవనమంటేదుఃఖభాజనమైన ఈ జీవిత నౌకను తీరం చేర్చేందుకు అనువైన తాడు శ్రీపతి పదారవిందములే. అంతే కాక అభీష్టసిద్ధినిసిద్ధింపచేసేవీ ఈ పాదాలేనని భగవం తుని కీర్తిస్తాడు.
సత్యపి భేదాపగమే నాథ ... ఇందులో భగవంతుడే తన నాథుడనుకొనే భక్తుడు సర్వానికి మూలమూ భగవంతుడే నం టాడు. నేను బీజ ప్రాయుడనని, నీవో వృక్షప్రాయుడవని భావిస్తూ భక్తుడు తన అల్పత్వాన్ని ఆపాదించుకొంటాడు. అట్లానే నేను ఓ తరంగాన్ని అయతే నీవో సముద్రమంటివాడివని (్భగవంతుడు) అట్లాంటి నీతో నాకు పోలిక యేమిటి యని భగవంతుని సామర్ధ్యాన్ని శ్లాఘిస్తారు. ఇచట ద్వైత, అద్వైతతత్త్వానికి చక్కని సమ్మేళనమా అనిపిస్తుంది. అంటే ఇక్కడ దృష్టి భేదమేకాని తత్త్వ భేదము లేదుఅని భక్తుడు చెప్తాడు.
ఉద్ధృతనగ! నగభిదనుజ! ......... భగవంతునిపై విశ్వాసంతో లోకాలన్నిటికి కాపాడేవాడవు నీవే నంటూ సజ్జనమిత్రుడవు శిష్టులను కాపాడడమెంత ముఖ్యమో దుష్టులను దునుమాడడం కూడా నీవే అంతే శ్రద్ధతో చేస్తావు అంటాడు. అంటే ఇక్కడ పూర్వంలో భగవంతుడు చేసిన దుష్టులను దూరం చేయడంలో వారి కోరికలను ఎలా తీర్చాడో ఒక్కసారి భక్తుడు గుర్తు చేసుకొన్నట్టు అంత ర్లీనంగా కనిపిస్తుంది. ఇది భగవంతుని సర్వజ్ఞత్వాన్ని సూచిస్తుంది. భక్తజన హృదయాస్థితుడైన భగవంతుడే ముక్తిని ప్రసాదించే కరుణామూర్తి అనే నమ్మకం.
మత్స్యాదిభి రవతారై రవతారవతా.... అన్యధా శరణం నాస్తి. ఆత్మనివేదన అభివ్యక్తి. శరణాగతి తత్త్వంఇక్కడ ప్రకాశమా నమవుతుంది.
దామోదర! గుణమందిర! సుందర వదనారవింద! ........... భగవంతుని ఘటనా ఘట సమర్ధతను మెచ్చుకుం టూ భగవంతుడే శరణమని నీవే నన్ను కాపాడాలని కోరుకొం టాడు భక్తుడు.
కేవలం ఆరు శ్లోకాలతో ఉన్న ఈ షట్పది మనిషిలోని దుష్టఆలోచనలను దూరం చేస్తూ భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆరుశ్లోకాలను పఠించడం అంటే భక్తులు అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకోవడమే నంటారు.

- చివుకుల రామమోహన్