అంతర్జాతీయం

దక్షిణ సముద్రంపై చైనాకు హక్కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ది హేగ్:అంతర్జాతీయ వ్యవహారాలలో చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ చైనా సముద్రంపై ఆ దేశానికి ఎటువంటి చారిత్రక హక్కులకు లేవని ఐదుగురు సభ్యుల ట్రిబ్యునల్ స్పష్టమైన తీర్పు చెప్పింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ న్యాయస్థానం తీర్పుపై అప్పీల్ చేసుకునే అధికారం ఎవరికీ లేదు. అయితే ఇది అమలు చేసే అధికారం ఆ కోర్టుకు లేదు. అసలు ఈ కోర్టును తాము పరిగణించడం లేదని మొదటినుంచి చైనా చెబుతోంది. కాకపోతే తాజా తీర్పుతో చైనాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది.
దక్షిణ చైనా సముద్రంలో ఒక ద్వీపంవద్ద చైనా కదలికలు కొద్దికాలంగా పెరిగాయి. ఆ ద్వీపం తమదేనంటూ, దక్షిణ చైనా సముద్రంపై తమకే అధికారాలున్నాయని వాదిస్తూ ఆ ద్వీపంలో సైనిక బలగాలను మొహరిస్తోంది. నిజానికి ఆ దీవులు తమవేనని ఫిలిప్పీన్స్ వాదిస్తోంది. వియత్నాంసహా కొన్ని ఆసియా దేశాలూ ఆ వాదననే చేస్తున్నాయి. అయితే వీటిని పట్టించుకోని చైనా దూకుడుగా వ్యవహరిస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దీంతో అమెరికా దన్నుతో ఫిలిప్పీన్స్ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణకు చైనా దూరంగా ఉంది. కాగా మంగళవారంనాడు కోర్టు తీర్పు వెలువరించింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎటువంటి చారిత్రక హక్కులు లేవని తేల్చిచెప్పింది. దీంతో ఫిలిప్పీన్స్, వియత్నాంసహా కొన్ని దేశాలకు నైతికంగా విజయం దక్కినట్లయింది. కాగా 1.2 చదరపు కిలోమీటర్ల ఈ ప్రాంతం గ్యాస్, పెట్రో, సముద్ర ఉత్పత్తులకు పెద్దవనరు. పైగా దక్షిణ చైనా సముద్రమార్గంపై రాకపోకలకు కీలకమైన స్థావరం. అందుకే