భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బండి నాగరాజు, అరకువేలీ
ప్ర: ప్రస్తుతం మేము స్వీట్సు దుకాణం మూసేస్తున్నాము. మళ్లీ వేరే చోట పెట్టాలనుకుంటున్నాము. పెట్టమంటారా?
సమా: స్వీట్స్ వ్యాపారం కానీ, వస్త్ర వ్యాపారం కానీ, అలంకార ద్రవ్యాల వ్యాపారం కానీ, మినరల్ వాటర్ వ్యాపారం కానీ మీకు బాగుంటాయి. స్థలం, వాస్తు మాత్రం సరిగా చూసుకోండి.
ఎ.శేషాద్రి రెడ్డి, ఎమ్.ఎమ్.పల్లి
(అనంతపురం)
ప్ర: జీవితంలో నేను చాలా కష్టాలు పడ్డాను. ఇలా కష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
సమా: ఇంట్లో దేవుడి పటం వద్ద 24 గంటలూ దీపం వెలిగే విధంగా ఉంచండి. ప్రతి సోమవారం ఆవుకు దాణా పెట్టండి. ప్రతి గురువారం ఉత్తముడైన బ్రాహ్మణునికి యథాశక్తి దానం చేయండి.
కదిరి సూర్య శంకరం, విజయనగరం
ప్ర: ప్రభుత్వం నుండి నాకు రావలసిన డబ్బు సకాలంలో వస్తుందా?
సమా: తప్పకుండా వస్తుంది. వచ్చే దుర్ముఖి నామ సంవత్సరం మధ్యభాగంలో మీ సొమ్ము మీకు వచ్చే అవకాశం ఉంది.
పి.గణపతి, వనస్థలిపురం
(హైదరాబాద్)
ప్ర: మా మనుమరాలు, ఆమె భర్తకు ఉద్యోగాల్లో మార్పు వస్తుందా?
సమా: ఎవరికి సంబంధించిన ప్రశ్నలకు వారే సంఖ్యలు చెప్పి అడగమనండి.
పి.ఎస్.లక్ష్మి, శ్రీకాకుళం
ప్ర: ప్రశ్నలు అనేకం...
సమా: మీరు పంపిన వాటిలో ఒక ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూడండి. తూర్పు, ఉత్తరం ముఖంగా గల స్థలం మీకు బాగానే వుంటుంది. ‘అర్వణము’ అనేది వ్యక్తి పేరున కాకుండా ఇంటి పేరున చూసుకుని ఆ ఇంటికి తగిన పేరు పెట్టుకోవాలి.
కె.ప్రకాశ్, బరంపురం (ఒడిశా)
ప్ర: నాకు జీవితంలో ధనప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది.
సమా: ‘ఉద్యోగినం పురుషం పైతి లక్ష్మీ’ అని పెద్దలు అన్నారు. మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి. ధనలక్ష్మి రాక మానదు. ధనప్రాప్తి మీ యోగం ప్రకారం మాత్రమే కలుగుతుంది.
ఎం.హెచ్.వంశీ, శ్రీకాకుళం
ప్ర: నాకు వైద్య విద్య యోగిస్తుందా? ఐఐటి యోగిస్తుందా?
సమా: మీకు వైద్య విద్యే యోగించే అవకాశం వుంది.
గడకంచి గిరిరాజ్ చౌదరి, విజయవాడ
ప్ర: మా వ్యవసాయ భూమిలో గణేశ విగ్రహం లభ్యమయింది. దానికి చిన్న గుడి కట్టించాం. నిత్య పూజలు మాత్రం చేయటం లేదు. ఇలా చేయడం దోషమంటారా?
సమా: గుడి కట్టించే ఓపిక, స్థోమత ఉన్నవాళ్ళు నిత్యపూజలు చేయించలేరా? కనీసం మీరైనా ప్రతిరోజూ కొంచెం నీళ్ళు పోసి వినాయకుడిని అభిషేకించి, రెండు పూలు పెట్టి, గోధుమ పిండి, చక్కెర నివేదన చేయండి. యంత్ర ప్రతిష్ఠితమైతే మాత్రం తప్పక మంత్ర సహితంగా పూజలు చేయించాలి.
ఆర్.ముఖేశ్ కుమార్, ఖమ్మం
ప్ర: మిమ్మల్ని ప్రశ్నలు అడిగేవారి గురించి ఆలోచిస్తుంటే- కేవలం ఉబుసుపోకకు కొందరు ప్రశ్నలు అడుగుతున్నారనిపిస్తోంది. ఏమంటారు?
సమా: మీ ప్రశ్న ఏ కోవలోకి వస్తుందా? అని ఆలోచిస్తున్నాను. మీరూ కాస్త ఆలోచించండి.
మాగంటి శోభారాణి, ఏలూరు
ప్ర: నేను కొన్ని కథలు రాశాను. పత్రికలలో అచ్చయ్యాయి. రచయిత్రిగా పేరు సంపాదించగలనా?
సమా: తీయగా తీయగా రాగము, రాయగా రాయగా రచయిత రాణించడం జరుగుతుంది. మీరు కథలు రాస్తూనే వుండండి.
*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ