సబ్ ఫీచర్

మరోసారి ముఖ్యమంత్రి మండిపడ్డారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్ర శాసనసభలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టికలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంలో గతంలో చెప్పిన విషయాలను పునఃప్రస్తావించారు. వీటిలో ప్రధానమైన విషయమేమిటంటే.. ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు పౌరసత్వం రుజువు చేసుకోవడానికి పనికిరావని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి మాటలకు కొన్ని రోజుల ముందు హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ... ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ సందర్భంగా ప్రజలు తమదగ్గర ఉన్న సమాచారం ఇస్తే సరిపోతుంది. ప్రశ్నావళిలోని అంశాలకు సరైన సమాచారం ఇవ్వకపోతే డౌట్ ఫుల్ పేరండి అనే అక్షరం కూడా చేర్చబోమని స్పష్టంగా ప్రకటించారు. దీనికి గులాంనబీ ఆజాద్, కపిల్‌సిబాల్ తదితరులు దాదాపు సంతృప్తి చెందారు. పైగా సిఏఏ వల్ల భారత ముస్లింల పౌరసత్వం పోతుందని తామనడం లేదని రాజ్యసభ సాక్షిగా ఆ కాంగ్రెసు నాయకులు ప్రకటించారు. వీరు ‘‘యూటర్న్’’ తీసుకున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఈ పరిణామం అనంతరం తెలంగాణ శాసనసభలో ఆ విషయమై తీర్మానం ఆమోదించడంలో ప్రాసంగికత ఏమున్నది?... దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. వీటిలో ఏడు రాష్ట్రాలు ఇప్పటికే సిఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయని, తెలంగాణతో ఎనిమిది రాష్ట్రాలు ఈ రకమైన తీర్మానాలు చేసినట్టయిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంటే మెజార్టీ రాష్ట్రాలు ఆ తీర్మానం చేయలేదనేగా అర్థం!...
దేశానికి పటిష్టమైన చట్టం ఉండటంలో తప్పులేదు, ఇతర దేశాలనుంచి వలస వచ్చేవారిని అడ్డుకోవాలి. అంతలోనే ముఖ్యమంత్రి సిఏఏను వ్యతిరేకించడం విడ్డూరం. సిఏఏకు భారతదేశ ముస్లింలతో సహా ఎవరూ ఏ గుర్తింపుకార్డు, బర్త్ సర్ట్ఫికెట్ చూపవలసిన అవసరం లేదు. కారణం అది భారత పౌరులకు సంబంధించిన చట్టం కాదు గనుక. మరి తిరకాసు ఎక్కడొస్తున్నది?... ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ విషయంలోనూ ఈ విషయమై ఎలాంటి పత్రాలు చూపనవసరం లేదని రాజ్యసభలో హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. రాజ్యసభలో ఇచ్చిన మాటకు మాన్యత లేదనుకుంటారా?... హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఇటీవల పలుసార్లు ఎలాంటి పత్రాలు ఎవరు చూపాల్సిన అవసరం లేదు. కొందరు ఈ విషయమై అపోహలు, పుకార్లు సృష్టిస్తున్నారని చెప్పారు. వీరిద్దరు అధికార పూర్వకంగా ప్రకటించిన విషయాన్ని విశ్వసించకుండా ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా విధానసభలో ఇలా తీర్మానాలు చేయడంతో ప్రజలకిస్తున్న సందేశమేమిటి?...
దేశంలో ఆదివాసీలు, పేదలు, బడుగు-బలహీన వర్గాలవారు ఎక్కువగా ఉన్నారు. వారిదగ్గర బర్త్ సర్ట్ఫికెట్ ఉండదు. వారందరిని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళి నిర్బంధ క్యాంపుల్లో పెడుతుందని, పౌరసత్వం లేని వారిగా పరిగణిస్తుందని ప్రచారంచేయడం దుర్మార్గం. ఆ ప్రజల్ని పౌరులుగా గుర్తించక చెట్లు- పుట్టలను కేంద్రం పాలిస్తుందా?... ప్రభుత్వమంటే కేవలం ప్రధాని, హోంమంత్రి, హోంశాఖ సహాయ మంత్రి మాత్రమేకాదు... ఎన్నో వ్యవస్థల సమాహారం, వాటికి ఆలంబనగా రాజ్యాంగం నిలుస్తున్నదన్న ‘ఇంగితం’ ఉన్నప్పుడు అలాంటి భయాందోళనలకు తావులేదు. అపోహలు, భ్రమలు, పుకార్లు, అశాస్ర్తియ ఆలోచనలతో ప్రజల్ని తప్పుతోవ పట్టించడం సబబుకాదు.
సిఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పిఆర్ ముస్లింలకే కాదు యావత్ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయని, ఇవి ప్రజావ్యతిరేకమైనవని, వీటిని వ్యతిరేకించేవారిని దేశద్రోహులంటే ఎలా? అని కూడా ముఖ్యమంత్రి శాసనసభలో ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో విభేదించడం ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కు ఆధారంగానే అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు, అల్లర్లు జరిగాయి. షాహీన్‌బాగ్ లాంటి ధర్నాలు జరిగాయి. వారెవరిపై దేశద్రోహం కేసులు ఎవరూ పెట్టలేదు. ప్రజల ఆస్తులు తగులబెట్టినా, నానాబీభత్సం సృష్టించినా, రహదారులు మూసేసినా ఎవరిమీద దేశద్రోహం కేసు నమోదుకాలేదు. కాని దేశంనుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరుచేస్తాం... అందుకోసం సంఘటితం కావాలని ప్రజలను రెచ్చగొట్టిన షార్జిల్ ఇమామ్ లాంటి వారిపై దేశద్రోహ నేరం మోపబడింది. ఈ ఉద్యమానికి ఆర్థిక సహాయం చేస్తున్నదని భావిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)పై నిఘాపెట్టారు. 15 కోట్ల మంది ముస్లింలు వంద కోట్ల హిందువులపై తమ తఢాఖా చూపిస్తారన్న ఎం.ఐ.ఎం.నాయకుడు వారిస్ పఠాన్‌పై సైతం ఎలాంటి కేసు నమోదుకాలేదు. అంబేద్కర్ వారసుడనని చెప్పుకుంటూ సిఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని ఉవ్వెత్తున జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళుతున్న రాజు సత్ఫాల్ ఉరఫ్ రాజరత్నం ప్రకాశ్ అంబేద్కర్‌పై ఎలాంటి కేసులు నమోదుకాలేదు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయితే దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సభలు, సమావేశాలతోపాటు, పెద్దపెద్ద ప్రదర్శనలు నిర్వహిస్తూ, ద్వేషం... విద్వేషం చిమ్మినా ఆయనపై దేశద్రోహం కేసు నమోదుకాలేదు... మరి సిఏఏ వ్యతిరేకులను దేశద్రోహసులని ఎవరంటున్నారు?...
ప్రపంచం ఇప్పుడు ఎలా నడుస్తున్నదో, దానికన్నా మెరుగ్గా దేశం ఉండాలని, పరిపాలన సాగాలని, ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగాలని కోరుకునే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పిఆర్ అందుకు భిన్నమైనవని భావించడం దురదృష్టం.
ఈ అపోహలు, ఆందోళనల నేపథ్యంలో సద్గురు జగ్జీవాసుదేవ్ స్పందిస్తూ... దేశంలో ఎవరు నివసిస్తున్నారో తెలుసుకోవడం ప్రభుత్వ ధర్మం. ఎవరు ఈ దేశ పౌరులూ, ఎవరు కారో గుర్తించడం ప్రభుత్వ విధి. అందులో భాగంగా కొన్ని ప్రమాణ పత్రాలు చూపమనడం పొరపాటు కాదు. ఏరకమైన పత్రంలేదన్నా కనీసం నిన్ను గుర్తించే ముగ్గురి పేర్లు చెప్పమని కోరడం నేరం కాదు. అదీ చెప్పకపోతే మరి ఎవరు నువ్వు? అని అడిగే ఆస్కారముందన్నారు.
ప్రతి దేశం ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నదని, కేవలం భారత్‌లోనే ఉందని భ్రమపడటం సరికాదు. ప్రజలే కేంద్రంగా పాలన సాగాలంటే ఈ సమాచారం ప్రభుత్వందగ్గర ఉండాలి. ఈ విషయం అర్థంచేసుకోని అజ్ఞానులు దేశంలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు దగ్గరగా గతంలో కేసీఆర్ ఇంటింటి సర్వే జరిగిందని విస్మరించరాదు.
ఓవైసీ సోదరుల ప్రచారం నిర్హేతుకమైనదని ఎన్నోమార్లు రుజువైంది. పార్లమెంట్‌లోనే అసదుద్దీన్‌కు హోంమంత్రి సమాధానమిచ్చారు. అనేక శంకలను నివృత్తిచేశారు. అయినా అగ్గి ఆరిపోరాదన్న భావనతో, స్వప్రయోజనాలతో, సొంత ఎజెండాతో ఉద్యమిస్తూ ముఖ్యమంత్రిని సైతం వారు ముగ్గులోకి లాగారు.
ముఖ్యమంత్రి అద్భుత ఆలోచనలకు, దార్శనికతకు, దూరదృష్టికి, నాయకత్వ పటిమకు, ధైర్యసాహసాలకు ఇలా గ్రహణం పట్టేలా చూసేందుకు ఆ సోదరులు కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆ మర్మాన్ని పట్టుకోలేకపోతున్నారనిపిస్తోంది. హైదరాబాద్‌లోని బార్కాస్ తదితర ప్రాంతాల్లో దేశంలోకి అక్రమంగా చొరబడిన వారనేకమంది ఉన్నారు. వారిని రక్షించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అలాంటి చొరబాటుదారులు దేశంలో ఎక్కడున్నా వారిని వారివారి దేశాలకు పంపించేందుకు ప్రయత్నించడం తప్పెలా అవుతుంది?... అమెరికా- మెక్సికో సరిహద్దులో నిర్మిస్తున్న గోడలా కంచె ఉన్నా వారు చొరబడిన విషయం ముఖ్యమంత్రికి తెలుసుకదా?... రాష్ట్రాలు బాగున్నప్పుడే దేశం బాగుంటుందని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి మరి తన పరిధిలో ఏం చర్యలు తీసుకున్నారు?...

- వుప్పల నరసింహం, 9985781799