సుమధుర రామాయణం

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

356. రాక తక్కిన వాని ప్రాణంబు దీతు
నిదియె నా శాసనంబని యంతిపురము
జొచ్చి యంగనాసక్తుడై సర్వకార్య
ములను మంత్రులపై నిడి మరచె నన్ని

357. వర్ష ఋతువేగె విను వీధి విమలమయ్యె
రామునకు జానకీ వియోగమున నాల్గు
నెలలు నాల్గు యుగమ్ములవలెను దోచె
కీశపతి యుదాసీనుడై గడుపుచుండ

358. రాము నాగ్రహవచనము లాసుమిత్ర
పుత్రు ముఖమున వని యదరిపడి రవిజు
డినకుల మణిపాదమ్ముల బడుచు కపిని
దడసితిని నన్ను క్షమింపు దయను రామ!

359. పదములను బట్టుకొన్న కిష్కింధ పతిని
సరసకును జేర్చి రాజుకు సమయ జ్ఞాన
మున్న రాణించునని బల్కి రామమూర్తి
కీశ వల్లభు వినయశీలతకు మెచ్చి

360. ‘‘రవిజ! విను సర్వదా కామరతుడుచెట్టు
కొమ్మపైనను నిద్రించి క్రిందబడిన
పిదప మేల్కొను వానిని బోలు ననఘ
ధర్మముగ సల్పవలె నర్థకామములను

361. ఇప్పుడిక జానకిని శీఘ్రగతిని వెదక
బూనవలెనన్న రఘువరు పల్కు ముగియు
నంతలో నరుదెంచి రత్యంత బలులు
సకల వానరయోధుల సంఖ్యలుగను

362. సూర్యజుండంత ‘‘రఘురామ! వీరలెల్ల
యుద్ధముల నారితేరిన యోధవరులు
జానకీదేవి నరసి రాగల సమర్థు
లందరున్ తమ యాజ్ఞకు బద్ధులధిక!’’

363. అంత రాముడు రవిజ! ధీశాలి వీవు
నీ ససాయముతోడనే నసురకులము
నందు విజయము సాధింతు ముందు సీత
నరయ బంపుము నెంపిక జేసి కపుల’’

364. తూర్పు దిక్కుకు వినతుని, పశ్చిమమున
కద్రి చరవరేణ్యు సుషేణు, నుత్తరమున
కనిపె శతవిలిని, తగు సైన్యముల తోడ
తిరిగి వచ్చుటకొక నెల గడువొసంగి

365. వారలను బంపి దక్షిణ దిశకు వాయు
పుత్రు నలనీల జాంబవ దంగదాది
హరివరుల నెంపికను జేయు రాఘవుండు
పవన నందను చెంతకు బిలచి యపుడు

366. అంగుళీయకమ్ము నానవాలుగ రాము
డిచ్చి దీని జూప విశ్వసించు
భీతిలేక సీతనాదూతవని నిన్ను
నీవలన లభించు నిలజనాకు

367. అనుచు రామచంద్రు డంగళీయక మీయ
మూర్ధమున ధరించి మ్రొక్కి హనుమ
సకల కపుల తోడ గహనావళుల సీత
వెదకగ జనె కార్యదీక్ష తోడ

368. వెదకి వెదకి దాహార్తిచే ఋక్షబిలము
జొచ్చి యోగినిని స్వయంప్రభను జూచి
రామ కథ జెప్పి తమరాక విధము దెల్ప
నా తపస్విని వారల నాదరించి

369. నియతశీల స్వయంప్రభ యోగశక్తి
వారి నెల్లర నంబుధి దరికి జేర్చి
కార్యఫలత గల్గు మీ కనుచు బల్కి
తిరిగి తొల్లింటి నెలవున కరిగె నామె

370.ఎదుట గన్పట్టు నంబుధిన్ చీకితులౌచు
జూచుచుండిరి ప్లవగులు జేయ నేమి
దోపకుండగ నంత నంగదుడు బల్కె
ఇనజు డిచ్చిన నెల గడువేగె మనకు

371.నృపకుమారిని గానక మరలి చనిన
ప్రాణముల దీయు మార్తాండ పుత్రుడింక
నిచ్చటనె నేను ప్రాయోప విష్ఠుడనయి
యసువులను బాయుదు నను నంగదుని జూచి

*

టంగుటూరి మహాలక్ష్మి