సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (సుందరకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

732. యజ్ఞ వేళ ఇంద్రు డొసగె ప్రసన్నుడయ
జనక భూ విభునకు నతడు మా వి
వాహ సమయమందు తనయకు స్వయముగా
ప్రీతితో నలంకరించెదీని.

733. హనుమ యింకను జానకి యేమి బల్కె
దెల్పుమా నాకు దాహార్తి నలమటించు
మనిషి కమర నదీజల మబ్బినట్లు
సేద దీర్చును నన్నామె భాషణములు’’

734. తాను తల్లిని భుజ సీమ నదివసింపు
మమ్మ వేగమె నిను స్వామి చెంత జేర్తు
ననగ పర పురుషుని ముట్ట నన్ను రావ
ణుండు వివశురాలిని దెచ్చె హనుమ యనియె’’

735. దడయవలదిం శ్రీరామ కడలి దాటి
మనము లంకకు చేరగా వలయు దుఃఖ
భారమున జూచు మాతకు ధర్యము గలి
గించి వచ్చితినని మ్రొక్కి నిలచె హనుమ

736.రామచంద్రుడు హనుమను ప్రేమతోడ
చెంతకును జేర్చి యింతటి క్లిష్ట కార్య
మతి సమర్థవంతముగను నిర్వహించి
నిలువబెట్టెను మా రఘు వంశ మితడు

737.ప్రభువు కార్యము సమయోచితముగ విజయ
వంతమొనరించు దూతుత్తముడు తనకు
జెప్పిన పని జెప్పినరీతి జేయువాడు
మధ్యము డధము డేదియు జేయలేడు

738.ఆంజనేయుడు ఉత్తమ శ్రేణివాడు
గరుడుడో వాయువో దప్పగడవలేని
కడలి లంఘించి చీమకున్ చొరగ రాని
లంకలో జొచ్చి జానకిన్ గాంచి వచ్చె

739.రామచంఅదుడు ప్రేమతో వాయుపుత్ర
లంక నిర్మాణ మెట్టిది దెల్పు మనగ
తాను జూచిన లంకను జూచినట్లు
వివరముగ దెల్పెరఘువంశ విభున కపుడు

740.రాముడంతట ‘6మిత్రమా! రవిజ! సాగ
రము ధరించి వానర సేన లంక జేరు
టెట్ల’’న సుగ్రీవుడినవంశ మణికి దగునె
యిట్లు శంకించి సామాన్యు నట్లు బలుక

741.్ధర్మమూర్తివి శాస్త్ర కోవిదుడు వీవు
మమ్ము నడిపించు బుద్ధిమంతుడవు మాకు
నండగా నిల్చి సూచనలిడుము రామ
మేము సాధింతు మెట్టి కార్యమ్ము నైన

742. సీత జాడ దెలిసె నిశ్చింతగా నుండు
మొక్కమారు జూడు మద్రి చరుల
యెట్టి కార్యమైన చిటికెలో సాధింప
గల్గు వారఖండ బలులు వీరు

743. సాగరము దాటు టెట్లని చింతవలదు
కట్టుదము సేతువెలమి సముద్రమునకు
శోకశీలి కార్యమును సాధింపలేడు
ధనువు పట్టిన నీ కసాధ్యమ్ము గలదె?

744. వానరాధిపు మాటలు రాఘవునకు
ధైర్యమిచ్చెను నాతపశ్శక్తి తోడ
సేతు నిర్మాణ మొనరింతు లేనియెడల
నిగురబెట్టుదు సాగర జలములన్ని

745. లక్ష్మణ సుగ్రీవులానందముగను రామ
చంద్రునకభినందనల దెల్పిరంతు కీశ
పతుల జయ జయ ధ్వానములనువనమ్ము
నిండె భయపడి మృగములు పర్వులెత్త

746. వాయుపుత్రుడు ‘‘స్వామి! నే వారి సేన
బలములో నొక్క భాగము హత మొనర్చి
వచ్చితిని మన సేనాధిపతులె జాలు
రావణుని లంక స్వాధీన పరచుకొనగ

747. వంతెనల భగ్న మొనరించి కందకముల
రాళ్ళతో నింపి ప్రాకారములను నేల
మట్ట మొనరించి వచ్చితి మనము కడలి
దాట లంక గూలిన యట్లె రామచంద్ర
*

టంగుటూరి మహాలక్ష్మి