సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

765. రామచంద్రుడు లక్ష్మణ సూర్యజులతో
గిరి మహేంద్రము నెక్కి యా ప్రకృతి శోభ
జూచి మరియుచు శైలము నుత్తరించి
జేరుకొనె నపార పయోధితీరమునకు

766.‘‘వానరేశ్వర! జూడుమీ వనధి కవలి
యొడ్డు గనరాదు లోతు గాంభీర్యములను
ఇంత యని జెప్ప నెవరికి వలను పడదు
సగర సుతుల యశస్సునకిది ప్రతీక

767. సూర్యనందన మన రాక శత్రువులకు
దెలిసి కీడును గలిగింత్రు మాయబన్ని
సేననంతను సాగర తీరమందు
విడియ నియమింపు’’మని రాఘవేంద్రు డనియె

768. రాము నాజ్ఞ సుగ్రీవుడు నీలు బిల్చి
సేననంతయు సాగర తీరమందు
విడియ నియమింపు మసురుల కీడుగల్గ
జేతు రాసురీ మాయాజాలముల బన్ని

769.నీలు ననుమతి గిరి శిఖరుముల నుండి
దిగిరి కీశులు మరియొక కడలి వోలె
యెదుట గన్పట్టు గంభీర జలధి గాంచి
భీతి జెందిరి దాట నసాధ్యమనుచు

770. అంత నీలుడు సేవకు రక్షకులుగ
నతిబలిష్టులౌ మైంద ద్వివిదుల నిలిపె
వారహర్ని శలంతట సంచరించి
మెలకువను పర్యవేక్షణ సల్పుచుండ

771. రాముడొక్క యేకాంత ప్రదేశమందు
ననుజుతో ‘‘లక్ష్మణా! జనకజ వియోగ
దుఃఖమంతకంత కధికమై భరింప
దుస్సహంబయ్యెనని దీనవదనుడౌచు

772. జనక భూపతి ముద్దుల తనయ దశర
ధేశు కోడలు నా ధర్మపత్ని క్రూర
రాక్షసీ గణ మధ్యమునందు నెట్టు
లున్నదో సుమగాత్రి యిలా తనూజ

773. నిలిచె నూపిరి నామె సందేశమునను
దుష్టరావణు బరిమార్చి ధరజను దర
జేర్చుకొను నదృష్టమెపుడు వచ్చు ననుచు
శోకవశుడైన నగ్రజు సాంత్వన వచ
నముల నోదార్చె లక్ష్మణుండు చితరీతి

774. ఇంద్రసమ పరాక్రముడంజనీసుతుండు
నుద్ధతను లంక గాల్చి యోధుల వధించి
చైత్య ప్రాసాదముల నేల గూల్చి పురిని
కేళి గృహముగ జేసి క్రీడించి పోగ

775. రాక్షసేశ్వరుండు లజ్జిత వదనుడై
కొలువులోని మంత్రివరుల జూచి
‘‘ఒక్క వానరుండు వచ్చి దుర్భేద్యవౌ
లంక గాల్చియోధులను వధించె

776. నగరమంతయు కల్లలితముగ నుండె
మీరు యోచించి కర్తవ్యమును వచ్చింపు
డుత్తముడు దక్షులౌ సచివులతో బంధు
మిత్రులతో సంప్రదించి కార్యములు జేయు

777. తనకుతానె ధర్మా ధర్మములను దెలిసి
నిర్ణయము జేసుకొనువాడ మధ్యముండు
దోష గుణముల నెంచక దైవ మందు
నమ్మికయు లేకనధముడు డుపేక్షనుండు

778. శాస్త్ర విదులైన మంత్రుల యభిమతములు
నొక్కటై ప్రకటించిన నుత్తమంబు
వారియాలోచనలు బహువిధములౌచు
కడకు చర్చలో నొకటైన మధ్యమంబు

779. అధమమైనది తలకొక మాటయైన
మీరు బాగుగ యోచించి యిపుడు మనకు
క్షేమకరమగు నుత్తమ మార్గమేదొ
జెప్పవలెనని వెండియు నిట్టులనియె

780. సాగరము దాటి రాముడు సోదరునితో
వచ్చి లంకను తప్పక ముట్టడించు
గనుక మేలైన కర్తవ్యమేదొ మనకు
నూహగావించి బల్కుడవశ్య’’మనగ

781. బుద్ధిహీనులు నీతి బాహ్యులును కొంద
రసుర వీరులు లేచి లంకేశ మనకు
నతి పటిష్టము నవజయ మెరుగ నట్టి
సేన యుండగ చింతిల్ల నేల తమరు

782. దేవతలు మీకు దాసులై తలలు వంచ
యక్షరాజు కుబేరు జయించి నావు
దానవేంద్రుడు యముడు మీ దాసుడౌచు
తన కుమార్తెను మీకిచ్చె బహుమతిగను
783. యమునితో పోరుసల్పి యాశ్చర్య పరచి
లోకమున బలదర్పులౌ రాజసంఘ
ముల జయించి ప్రజలను సంతోష పరచి
నట్టి మీకు రాముడొక లెక్కయె సురారి

టంగుటూరి మహాలక్ష్మి