సుమధుర రామాయణం

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

372.రామ వనవాసము దశరధుని మృతియు
భూమిజాపహరణము జటాయు మృతియు
వాలి నిహతియు మనలకీ విషమ గతియు
గల్గుటకు కారణమ్ము కైకమ్మ వరమె

373.అనుచు విలపించు కపుల సంపాతి జూచి
రామ కార్యమునకు తమ్ముడౌ జటాయు
వసుపు లర్పించుట విని దుఃఖించి కీశ
వరుల కడకేగి వనచర వర్యులార!

374. మీరలనుకొనెడు జటాయు వెట్లు రామ
కార్యమునకు బ్రాంముల నర్పించె కృపను
దెల్పుడ్య నేనాతని సోదరుడును
నన్ను సంపాతి యందురు ప్లవగులార!

375. రామ కథ జెప్పి కవులు సంపాతి కపుడు
ఆశ్రమంబున నొంటిగ నున్నరామ
పత్ని సీతను రావణుం డపహరించి
గొంచుబోవుచునుండ పక్షీంద్రుడపుడు

376. రావణాసురు రధమున కడ్డు నిలచి
వృద్ధుడౌ జటాయువు పౌరుషంబుతోడ
భీకరంబుగ దైత్యుతో పోరు సల్పి
రామ పత్నికై నసువులర్పించె ననఘ!

377. అంత సంపాతి తమ్ముని దలచుకొనుచు
చాల దుఃఖించి ‘‘వానరులార! మేము
పూర్వమొక పరి సూర్య మండలము కెగసి
నర్క కిరణములకు తట్టుకొనగ లేక

378.వివశుడై జటాయువు జనస్థానమందు
బడుచు నుండగ జూచితినంత నేను
పక్షములు గాలి పోవగ బడితి నిచట
మెల్లగ నిశాకర మునియాశ్రమము జేర

379. జూచి నన్ను మహర్షి సంపాతి యిట్టు
లైతి వేమన దుఃఖించి విషయమంత
జెప్పితిని ముని యోగ నేత్రమున జూచి
దుఃఖ పడకుము యిచటనె యుండి నీవు

380. రామకార్యార్థులై వత్తురిటకు కవులు
వారలడుగగ జానకి జాడదెల్పు
మపుడు మరలనీ రెక్కలు వచ్చునని వ
చించి దివికేగ వౌని నిశాకరుండు

381. మీకొరకెదురు చూచుచునుంటి నిచట
ఒక దినమ్మున మత్పుత్రుడౌ సుపార్శ్వు
డాకలితొనున్న నాకు మాంసమ్ము దెచ్చు
చుండ ‘‘రామరామా’’యని యేడ్చు సతిని
రావణుడు లంకకుం గొని పోవజూచె

382. కడలి కావలి గట్టున గలదు లంక
వసుధ పుత్రికనుంచె రావణుడునందు
దూరమున నున్న దృశ్యముల్ జూచు శక్తి
పద్మసంభవుడు ప్రసాదించె మాకు

383. జూచితిని లంకలో నేను జనకసుతను
సాగరము మీరు దరియించి సీతను గని
ధన్యతములై మరలుడు డిష్కింధ కనుచు
దెల్ప రెక్కటు వచ్చె దృఢమ్ములౌచు

384. తమ్మునడు నిచ్చి జలతర్పణమ్ములతడు
కపులకు ప్రీతితో నమస్మృతుల జేసి
నాకసంబున కెగసి ఖగేంద్రుడరిగె
నతని మాటలవానరుల్ ముదము జెంది

385. అమృత తుల్యములైన సంపాతి వచన
ములకురి నుబ్బి గెంతుచు లబ్ధపౌరుషులయి
రాముసతి జూచు కోర్కెసాగరము దాట
సంతతోత్సహవంతులై జనిరి కవులు

386. తిమిరి మింగిలాది మహామకర భయంక
రమ్ము దుష్పార మీ సముద్రమ్ము నెట్లు
దాటగల వారమనుచు చింతలకు జిక్కి
యున్న కీచుల వాలినందనుడు గాంచి

387. ‘‘ఈ విషాదమేల? వనచరవరులార!
విఫల హేతువు పురుషార్థమునకు
కుపిత పన్నగమ్ము పసిబాలు గరచెడు
రీతి క్రుంగదీయు పూరుషులను
*

టంగుటూరి మహాలక్ష్మి