సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1106. రాక్షసుల జయజయ నాదములను నగర
వీధి జను కుంభకర్ణుపై వివిధ పరిమ
ళ భరితమ్ముల పన్నీరు జల్లు జల్లి
పూల వానలు గురిసిరి పుర జనములు

1107. పూల పరిమళ పన్నీటి చల్లగాలి
సోక తెలివొంది సూర్యజుండొక వుదుటున
నెగిరి ఘటకర్ణు చెవులును ముక్కుపీకి
గగన మార్గాన తనవారి గలసుకొనియె

1108. వానరులు ప్రభువునుజూచి హర్షులైరి
కుంభకర్ణుడు తీవ్ర క్రోధమ్ముతోడ
వడిగ రణభూమి కేతెంచి విలయకాల
యమునివలె వానరులబట్టి మ్రింగ దొడగె

1109. వానరులు రఘవీరుని వెనుక కరిగి
రంత సౌమిత్రి యతి రోషమున యసురుని
నిశిత శరవర్షమున ముంచి నిశిచరు కవ
చమ్ము ఛేదించి యత్నము జేయుచున్న

1110. లక్ష్మణా! యింద్రు వజ్రాయుధమ్ము వంగె
నీ కవచమును దాకి బాలుండు వీవు
ముందు రాముని కడతేర్చి పిదప నిన్ను
నంపుడు సమవర్తి సదనమునకు ననగ

1111. ‘‘ఓ మహావీరుడా! రఘువీరు!డడుగా
వెళ్ళు మాయన నెదిరింప వలయునన్న
భీకరమ్ముగ గర్జించి భయదమైన
గదను బూని రామునిపైకి దాడి వెడలె

1112. రామచంద్రుడు వచ్చు రాక్షసుని వక్ష
మునకు గురిపెట్టి రౌద్రాస్తమ్రేయ కుంభ
కర్ణుడు చలించె గదజారె కరమునుండి
తెప్పరిలి పర్వతము రాముపైకి విసరె

1113. దారిలోననె రాముడు గిరిని ఖండ
ఖండములుజేసి విను కుంభకర్ణ సర్వ
రాక్షసుల సంహరింపగ దీక్షబూని
యుంటి సావధానుండవై యుండుమనిని

1114. ‘‘రాఘవా! నేను వాలి విరాధ ఖర క
బంధ మారీచులవలె నల్పుడనుగాను
కుంభకర్ణుడ ఇంద్రదిక్పాలకులను
ఈ గదను నిర్జించితి నీవనంగనెంత

1115. అనుచు గర్జించుచును వచ్చువాని రెండు
భుజములు తెగె శ్రీ రఘువంశ విభుడు విడిచి
నట్టి వాయవ్య ఐంద్రాస్రతములకు తెగిన
చేతులతొ వచ్చ ఘటకర్ణు జూచి విభుడు

1116. భాస్కరద్యుతులను ప్రకాశించు ఐంద్ర
యస్త్ర రాజము మరల సీతావిభుండు
యసురు కంఠములక్షించి విడువ శిరము
యెగిరిపడె లంకలో త్రికూటాద్రివోలె

1117. ఆ మహాకాయము సముద్రమందు బడియె
నందుగల మహామకర తిమింగలములు
మత్స్యములు నలిగి నశించె యసురులట్లె
నిల్చిపోయి రచేతనులౌచునపుడు

1118. వానరుల హర్ష నాదముల్ మిన్నుముట్టె
లోకకంటకు ఘటకర్ణు గూల్చినట్టి
రఘుకులాధీశు రాఘవు సూర్యజుండు
అతుల శౌర్యుండని ప్రశంసించినంత

1119. మింటజూచుచున్న సమరగణమ్ములు
దేవ ఋషులు రామచంద్ర విభుని
సంతసమున జయజయాది శబ్దములను
సర్వలోకహితుని సుంస్తుతింప

1120. దుర్జయుడు మహాబలశాలి కుంభకర్ణు
మరణమున వానరుల వదనమ్ములన్ని
సూర్యకాంతికి వికసించు జలజ పుష్ప
ములవలె వికసించె నతిసంతసమ్ముతోడ

1121. రామభద్రుడు కపిసేన మధ్యకోటి
సూర్య సమతేజుడై ప్రకాశించెనంత
దెల్పిరి హతశేషులు వార్త తమ ప్రభునకు
వినిన రావణు వదనము విన్ననయ్యె

1122. శోక విహ్వలుడై మూర్ఛజెంది కొంత
తడవునకు తెలివంది సోదరుడ! కుంభ
కర్ణ! ఇంద్రు చాపముతృణమ్ముగను నెంచు
నీవు గూలితివా నొక్క నరునిచేత’’

1123. అనుచు దుఃఖించి మనము నెమ్మదిని పొంద
వీరపుత్రులు దేవాంతక త్రిశిరుల
మరినరాంతక నతికాయులను రిపులను
జంపిరండని యానతినిచ్చి బంపె

1124. తండ్రికిం ప్రదక్షిణజేసి మ్రొక్కివారు
దీవెనల నంది తమతమ వాహనముల
నెక్కిజన దశకంఠుని తమ్ములైన
మత్తవున్మత్తులేగి రాయత్తులౌచు

1125. అసుర వానర సేనల నడుమ తుముల
సమరము జరుగగ దొడగె రిపుల కపులు
గండ శిలలును ఘన పాదపములు విసరి
గోళ్ళ కోరల ముష్టుల గూల్చిరపుడు

టంగుటూరి మహాలక్ష్మి