సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1126. యుద్ధమున వానరులనంత మొందజేయు
నా నరాంతకు వాలినందనుడు దునిమె
హనుమ జంపె దేవాంతకు నతని తోడ
నున్న రాక్షస వీరుల క్షణములోన

1127. సాటిలేని యుద్ధకుశలుడు నీలుడు
నమ్మహోదరు పిడికిటను బొడువ
నుసురువిడిచె నంత ననిల తనూజుండు
త్రిశురు చరచ మూడు తలలు పగిలె

1128. హనుమ మీదికి వచ్చు నున్మత్తు ఋషబు
డడ్డుకొని ముష్టిఘాతము జేయ శిరము
పగిలి రక్తము ప్రవహింప బాసె తనువు
కపులు బొగడిరి తమ యూధపతిని ఋషబు

1129. అంత జూచుచున్న నతికాయుడరుదెంచె
బ్రహ్మదత్త నస్తశ్రస్తమ్రులతొ
నరదమెక్కి వచ్చు నతికాయు ఘటకర్ణు
డని దలంచి కపులు పరుగులిడిరి

1130. రామచంద్రుని వెనుకకు జేరుకొనిరి
సింహనాదముజేసి సౌమిత్రి పైకి
దూకె నతికాయు డిరువురి మధ్యపోరు
ఇంద్ర వృత్తుల సమరమురీతి సాగె

1131. అచ్చెరువుగజూచి రమరు లంబరమున
లక్ష్మణు శర మసురు లలాటమ్ముదాకి
రక్త్ధారలు స్రవియించె రాక్షసుండు
నిశిత శరముల గప్పె సుమిత్రసుతుని

1132. లక్ష్మణుడు శరములనుగ్గొనర్చి వాని
సారధిని రధాశ్వముల వేధింప పవను
డెలమి చెవినూదె లక్ష్మణ వరబలుండు
వీనిపై ప్రయోగింపుమజాస్తమ్రనుచు

1133. అంత సౌమిత్రి శింజినీ రవమొనర్చి
పద్మ సంభవాస్తమ్రును నందించు సమయ
మందు సూర్యచంద్రులు గ్రహతారకలును
దిశలు కంపించె జీవకోట్లెల్ల నదరె

1134. విడిచె రామానుజుండు విరించి యస్త్ర
మగ్ని శిఖలతొ వచ్చు నస్తమ్మ్రు నడ్డు
కొనగ సర్వ శస్త్రాస్తమ్రులన్ని వేసె
గాని వృధయయ్యె తెగెనతికాయుశిరము

1135. కీశవీరులు హర్షాతిరేకములను
జయము లక్ష్మణస్వామికి జయమటంచు
జయ నినాదములను గంతులిడిరి లక్ష్మ
ణుండు రామపాదములంటి మ్రొక్కి నిలచె

1136. దీనవదనులై యసురులు దశవదనుని
కెరుక పరచిరి నతికాయు మరణవార్త
శోకతప్తుడై రావణాసురుడు దలచె
రాము డాదినారాయణుండేమొ యనుచు

1137. వార్త విని మేఘనాథుడు తండ్రి కడకు
వచ్చి నేనుండ మీకు విచారమేల
ఇంద్రు గెల్చిన నాకు వానరులు నరులు
యేమి లెక్క క్షణమ్ములో హతులజేతు

1138. అనుచు తండ్రికి ధైర్యము బల్కి భక్తి
పూర్వకముగ దండ ప్రణామంబుజేసి
బంగరుస్యందన మ్మెక్కి బవరమునకు
గదలె చతురంగ బలములు గొల్చిరాగ

1139. మార్గమున సైనికుల వలయముగ నిల్పి
అగ్నిని ప్రజ్వలింపగజేసి మంత్ర
పూర్వకమగు నాహుతులివ్వహుతవహుండు
నతనికర్పించె కమలభవాస్తమ్రపుడు

1140. అస్తబ్రలముతొ ఇంద్రారి చూపుతోడ
ప్రాణులను మ్రింగునట్లుగ భీకరముగ
జూచుచు రణరంగమున కేతెంచుచున్న
రావణకుమారు కపీవీరు లడ్డుకొనిరి

1141. మేఘమండలి కెగసి మేఘములదాగి
రిపుల గురిజూచి నాయువుపట్టు లందు
జూచి గొట్టె నిశితశర జాలములను
వేటగాడు పక్షులను వేటాడు రీతి

1142. వాని బాణము సోకని వానరుండు
లేడు గంధమాదన నలనీలజాంబ
వంత సూర్యసుతాంగద యోధులెల్ల
మూర్ఛిలిరి మేఘనాదు బ్రహ్మాస్తమ్రునకు

1143. రామలక్ష్మణ హనుమంతులజుని యస్త్ర
మునకు గౌరవమిచ్చును భూమిపైని
శాంత చిత్తులై శయనించిరంత ఇంద్ర
జిత్తు బలగర్వమున జేసె సింహగర్జ

1144. ఇంద్రజిత్తును కొనియాడి రసురవీరు
లంతట విజయ గర్వమున పితృదేవు
చెంతకుంజని గూల్చితి రిపులనంచు
విజయగాథను వివరించి మ్రొక్కి జనియె

1145. అజుని యస్త్ర ప్రభావము సోకనట్టి
యా విభీషణుడిట్లచేతనుల వోలె
నేల బడియున్న కీశుల నరసి కొనుచు
జాంబంతుని గుర్తించి కుశలమడిగె

టంగుటూరి మహాలక్ష్మి