సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1246. ‘‘దశరధాత్మజ! సర్వజ్ఞ! రుూతడు వర
బలుడుగాన నజాస్తమ్రు వలనగాని
హతుడుగాడు విడువుము బ్రహ్మాస్తమ్రున్న
మాతలి పలుకులకు రామచంద్రమూర్తి

1247. తనకగస్త్య ముని ప్రసాదించి నట్టి
దివ్యచాపము కోదండమున్ ధరించి
వైరిమర్మఛేదనకరవౌ విరించి
యస్త్ర సంధానముంజేసి వదలు వేళ

1248. లోకమున చరాచర కోటులెల్ల గజగ
జన్ వణికె నజాస్తమ్రు తీవ్ర మంటలెగయు
వేగమున వచ్చి రావణు గుండెజీల్చి
రామచంద్రు నంబులపొది యందుజేరె

1249. కపుల జయజయ ధ్వానముల్ మిన్ను ముట్టె
దేవతలు గురియించిరి విరులవాన
లోకవాసు లానంద సూక్తముల జదివి
రెల్ల జగములు శ్రీరాము సన్నుతించె

1250. రామ సింహముమందు రావణమదేభ
మవనిగూలె నంతఃపుర మందు హంస
తూలికాతల్పమున శయనించు రాక్ష
సేశ్వరుడు రక్తసిక్త భూషయనుడాయె

1251. అన్న లంకేశ్వరుండు భూపతితుడౌట
జూచి చిత్తశోకమున విభీషణుండు
తన్ను తానె నిందించుకొని విలపించె
నగ్రజుని దేహమున వ్రాలి భోరుమనుచు

1252. మిత్రుని విభీషణుని సమీపించి రామ
భద్రుడు ‘విభీషణా! మహావీరుడితడు
యుద్ధమున వీరమరణము పొందినాడు
నట్టి వీరునికై శోకమనుచితమ్ము

1253. శోకమును మాని జరుపుము నంత్యక్రియల
ననుచు బల్కుచుండగ వార్త నంతిపురము
జేరె రావణ పత్నులు గుండెలవియు
రోదనములను మయుపరుత్రితోడ గలసి

1254. యుద్ధ్భూమిని పడియున్న భర్తదేహ
మున బడి శిరములన్ మోదుకొనుచు తరము
గాని బాధతో శోకించిరంత పట్ట
మహిషి మండోదరి పతి పాదములజేరి

1255. రాక్షసేశ్వర! నీ యధర్మ ప్రవృత్తి
వలన నీ కిటువంటి దుర్దశయు మాకు
నిట్టి దుస్థితి బట్టె నా తండ్రి చైత్య
వల్లభుడు, భర్త యసురేశ్వరుండటంచు
విఱ్ఱవీగు నను విధి యనాధజేసె
1256. రామపత్ని సీత నపహిరంచి దెచ్చి
నా మహాపతివ్రతను క్షోభింపజేయ
నామె శోకవహ్ని దహించె నసుర కులము
విష్ణురమలె సీతారాములన్న వినక

1257. యెంతొ తపయోగ నిష్ణుడవైన నీవు
కామవశుడవై సామాన్య మానవునిచే
నిహతి జెందితి వనచును నార్తితోడ
గుండెకన్నీట దడువ శోకించె సాధ్వి

1258. కొంత సమయము గడువ విభీషణునకు
రామచంద్రుడు మిత్రమా స్ర్తి జనముల
లంకకును జేర్చి యన్నకు నంత్యక్రియలు
జరుపుమనగ పాటించె రామాజ్ఞనతడు

1259. దహనకాండను పూర్తిగా జరిపి రామ
దర్శనమ్ముకేగె విభీషణుండు
రాఘవుడు లక్ష్మణా! నీవు లంకకేగి
యసుర రాజ్యాభిషిక్తుగావించుమితని

1260. అనుచు రాముడు బల్కరామానుజుండు
పట్టణమ్మునకేగి విభీషణాఖ్యు
పసిడి సింహాసనాసీను జేసి వృద్ధ
రాక్షసుల వేదమంత్రముల్ జదువుచుండ

1261. సప్తసాగర జలములు నసురుల సమ
కూర్చి దెచ్చిరి కనకపు కలశములతొ
వేద విదులైన మంత్రులాశీర్వదింప
లంక రాజ్యాభిషిక్తుగావించె ననఘు

1262. అంతట విభీషణుడు మంగళకర ద్రవ్య
ములతొ రామ దర్శనమునకేగి వస్తు
వులను రామభద్రుని ముందునుంచి మొక్కె
నారదమున స్పృశించె నాదిత్యవిభుడు

1263. దాశరధి యంత పవన నందనుని జూచి
‘మారుతీ! నీవు లంక రాజ్యాధిపతి వి
భీషణుననుమతి వడసి భూతనూజ
కుశల మరసిరమ్మని బంపె కపివరేణ్యు

1264. ఉత్తరక్షణమున పవనాత్మజుండు
భక్తి సంతోషములతో నశోకవనికి
నేగి సీతకు ప్రణమిల్లి విన్నవించె
రామ విజయము రావణు మరణమున్ను

1265. తల్లి! నీవిక స్వంత గృహమ్మునందు
యున్న యట్టులె భావింపుమమ్మ నీదు
దర్శనము జేయవచ్చు విభీషణుండు
ననగ యలరె జానకియాంజనేయు గాంచి

టంగుటూరి మహాలక్ష్మి