భక్తి కథలు

కాశీ ఖండం..10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదకత్తులకి అంతర్యామీ! నీ అభయహస్తాన్ని మాకు చూపు.
ఋగ్యజుస్సామవేదత్రయి నీ నిట్టూర్పు గాడ్పు సకల చరాచర జగత్తు నీ మూర్త్భిదం. నీ పాదం భూమి నీ శిరము ఆకాశం. నీకు అంతరిక్షం నాభి అంటారు. చంద్రుడు నీ హృదయం. నీకన్ను సూర్యుడు. వృక్షాలు నీ తనూరుహవ్రాతం. నీవు సమస్తమున్ను. సర్వమూ నీ యందు వుంటుంది. స్తుతించే వారు స్తోత్రాలు, స్తుతింపబడువారూ నువ్వే. నీకు మ్రొక్కుతాము’’ అని సంయమలు, నిర్జరులు అంజలి పుటాలు నొసట కీలించగా ఆ చతుర్ముఖుడు ఆత్మలో హర్షించి అందర్నీ వీక్షించి ఈ రీతిగా ఆనతి యిచ్చాడు.
‘‘అనఘాత్ములారా! ఆద్యమైన ఈ స్తోత్రానికి హృదయంలో నేను పరితోషాన్ని పొందాను. మీకు ఏమి కావలసినా ఇస్తాను. కనుక మీ అభీష్టం యిది అని అడగవలసింది.
దోషరహితమూ, సుస్థిరమూ అయిన భక్తితో నన్నుకాని, శంకరుణ్ణి కాని, విష్ణువుని కాని గురించి ఎవరైనా ఈ సారస్తోత్రాన్ని జపిస్తారో అట్టివారికందరికీ మేము ముగ్గురమూ, సంతుష్టులం అయి ఆశ్చర్యజనకంగా ధనధాన్య పశుపుత్ర సుఖాయురారోగ్యాలని అనుగ్రహిస్తాము. మీకు మిక్కిలి ప్రియం యేదో అట్టి వరం కోరుకొనండి. ఇస్తాను. ఈ సత్యలోకానికి ఏతెంచి కూడా ఈ విధంగా ఏ నిమిత్తం ఆకులపాటు విడువరు? స్తిమిత చిత్తులు అవండి. ఈ నా లోకాన కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య హింసాసూయలు లేవు. సాకార వేదాలు, చతుర్దశవిద్యలు, యజ్ఞాలు, దక్షిణలు, సత్యము, ధర్మలు, తపస్సులు, బ్రహ్మచర్యలు- ఇత్యాదులు ఎంత ఉల్లసిల్లుతున్నవో చూడండి’’ అని పలికి యింకా ఈ భంగి వక్కాణించాడు.
సత్యలోకంలో లేక బ్రహ్మలోకంలో ఏయే పుణ్యకర్మల్ని ఆచరించినవారు వుంటారో బ్రహ్మ వివరిస్తున్నాడు. ‘‘వీళ్లు భూలోకంలో వుండగా నిశ్చల భక్తితో తల్లిదండ్రులకి శుశ్రూష చేసిన శుద్ధమతులు. వీరుగో ఈ స్ర్తిలు నిర్వ్యాజమైన తత్పరభావంతో పరిచర్యలు ఒనరించిన వారు. ఈ పురుషులు సత్పురుషులకి ఏ ఫలాపేక్ష ఆశింపక ఉపకృతి సల్పిన ధీరులు. వీరు సమయం మించిపోకుండా సంధ్య జప హోమ తంత్రాల్ని తీర్చిన ధన్యులు. వీరు బ్రహ్మనిరతులు, వీరు తపస్వులు. వీరు భవ్యతీర్థాలు సేవించిన వారు. వీరు సద్వ్రతులు. వీరు నిస్పృహులు. తాము ఒనరించిన పుణ్య కర్మ ఫలాలకి ఫలభూతం అయిన ఈ బ్రహ్మలోకంలో సుఖవాసం వున్నారు. కనుగొనండి. ఈ స్వర్ణసౌధాలలో వసిస్తూ చిరకాల భోగ్యాలైన పుణ్య విలాసాలతో సంచరిస్తున్న ఈ జనులందరు ప్రణామ పురస్సరంగా మహీసురులకి అభీష్టదానములిచ్చిన పుణ్యాత్ములు సుమా!
ఉభయతోముఖ గోవుల్ని కాని, కపిల ధేనువుల్ని కాని సూర్య చంద్రగ్రహ పర్వదినాల్లో దానం ఒనర్చిన సత్యవ్రతులు అని వచించి పద్మ సంభవుడు విప్రుల ప్రభావమూ, గోవుల మాహాత్మ్యాన్ని కొంచెము వర్ణించే తలపుతో ఈ గతి పలికాడు. నాకును, శంకరుడికి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రాలైన వస్తువులు రెండు వున్నాయి. అవి విత్రులు, గోవులు. మొదట ఒక్కటియే కులం- ఇవి రెండు విధాలైన ప్రకారాలు పొంది వుంటాయి.
ఐహికాముష్మిక రూప సమస్త ఫలాల్ని వర్షించే జంగమ తీర్థాలు ధరణీసుతులు. అట్లుకానినాడు వారి పలుకులే అనే జలముల చేత, ఆ జలాల్ని సేవించిన వారికి జన్మజన్మానుగతాలైన ఆయా మహాపాప సమూహాలు ఏ విధంగా సంఘటిల్లుతాయి? సమాహిత మనస్సులతో వినవలసింది. గోవులు ఎల్లవేళల పవిత్రాలు. మంగళప్రదాలు. ఆ గోవుల ఖురటంకాగ్రఘట్టిత విధూత పరాగ పటలం పావనత్వంవల్ల పరమ శివుడి జటాట వీనపద్గంగా జలప్రవాహాన్ని పరిహసిస్తూ ఉంటుంది.

-ఇంకా ఉంది