భక్తి కథలు

కాశీ ఖండం..28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అగస్త్యుడు కోపనుడు. ఆ మహర్షి యిప్పుడు కోపోదగ్రుడై శాప విషం ప్రయోగించి చంపదలిస్తే నాకు ఎవరు అడ్డం వస్తారు? మేరు మహామహీధరం ప్రస్తుతానికి శంకలేక నిశ్చింతగా వుండుగాక!’’ అని అగస్త్యుడిని మరలి రాకని కోరుకుంటూ వింధ్యాచలం పెరుగుదల లేనిదై నాటినుంచి నేటివరకు ఆ విధంగానే భూమిలో అణిగి వుండిపోయింది.
ముని, జడదారి, శివభాగవతుడు, పుణ్యాత్ముడు- వీరిలో ఏ ఒక్కడు ఏతెంచినా అగస్త్య మునియేమో అన్న కోరిక కొనసాగగా అర్రుచాచి చూస్తూనే వుంటాడు వింధ్యాచలం! కాని ఆ మహర్షి ఏలాగు మరలివస్తాడు? తొలుత కల వున్నతి సైతము పోయి అగస్త్యుడి కనుదోయి కెంపు వనె్న కనవచ్చినంతనే వింధ్యాద్రి ధరణిలో ముడుచుకొని పోయింది. ఇతరుడి ఐశ్వర్యానికి ఈసు వహించి తపించే ఖలుడికి ఈ విధంగా జరగడం- అరసి చూడగా- పెద్ద విశేషమే కాదు. అన్యుల అభ్యుదయాన్ని కనుగొని ఎవడి బుద్ధిని అసూయాగ్రహము పొంగుతుందో అటువంటి వ్యక్తి ఈప్సితలు సిద్ధించవు. ఒకవేళ సిద్ధించినా పద పడి నశించిపోతాయి. అసూయాగ్రస్తుడైన నీచుడి ఐశ్వర్యం విధవ స్తనాలలాగు అప్రయోజనం అవుతుంది. అభివృద్ధితో అతిశయిస్తుందే కానీ సత్ఫలం కలుగదు. అకటకటా! ఏ ప్రయోజనం కలుగకుండానే కాలాంతరంలో అణగారిపోతుంది. ఆ తరిని ఇంద్రుడు, అగ్ని, యమధర్మరాజు, మాంసభుక్కు లేక నిరురుతి, వరుణదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు అనే అష్టదిక్పాలురు పరమ హర్షాతిరేకులై అగస్త్య మహర్షిని ప్రస్తుతించారు. సూర్యుడు మేరు పర్వత శిఖరాగ్రములపైన గల ఆకాశ మార్గాన ఏ ఆటంకం లేకుండా సంచరింపసాగాడు.
మేరు పర్వత ప్రయాణ వీధిని వాయువేగం వంటి వేగం కల రవి రథ తురంగాలు స్ఫటికమణులు కల భూముల్లో తమ ప్రతిబింబాలను కాంచి ఇతరాశ్వములు అదే తలంపుతో సకిలింపసాగాయి. పద్మరాగ మణిమయ సానుభాగాల్లో సాయంసధ్య అనే శంకతో పెండ్లి నడకలు నడువజొచ్చాయి. ఆకుపచ్చని మరకతమణుల వనె్నలో సూర్యశ్యాల హరితవర్ణం కలిసిపోయి కనిపించీ కనిపించక ప్రయాణించే వేళ అనూరుడిని చిక్కుపెడుతున్నాయి. వైఢూర్య మణిమయ ప్రదేశాల ప్రయాణిస్తూ ఆ వైడూర్యమణుల కాంతులు జలములని బ్రమసి క్రోలగోరి తలలు వంచుతున్నాయి. మేర మీరిన కామ వికారంతో సూర్య రథాశ్వాలు కిన్నర స్ర్తిలను వీక్షించి ఆ స్ర్తిలపైకి లంఘించపోతున్నాయి.
వింధ్య మహీధరం అడ్డు తొలగిపోయిన వెంటనే రవి రథ హయాల ఆకుపచ్చ రంగు ఇరువంకల ప్రసరించి మేఘాలు కూడా హరిత వర్ణాలు కలిగి చిలుకల రెక్కలట్లు ఊగుతున్నాయి. కళ్లెములవల్ల తెగిన సెలవులనుంచి స్రవిస్తున్న క్రొనె్నత్తురులు ఆ అశ్వముల ముఖాలికి ఎర్రవనె్న పూయిస్తున్నాయి. నక్షత్రమార్గంలో ఆలంబం లేని అంబరంలో గమన వేగంవల్ల గమన ధార ఏర్పడి కానవస్తున్నది. జాతియొక్క మచ్చిక కారణంగానే వెన్నుదన్ని ఏతెంచుతున్న శుకాది పక్షి సమూహం వలెనే శుకముఖ ద్విజశ్రేణి అనుసరించి వస్తున్నది. శుకాలు ఉద్యానవనాల్లో చరించురీతిగానే ఈ హయాలు మేరుగిరి శిఖరాలమీద వున్న కల్పతరువాటికల్లో అడ్డమాకలేక తిరుగాడుతున్నాయి. ఆకాశగంగలోని ఇసుక తినె్నలలో ఉలులవంటి గిట్టలు కొనలు దిగబడి హయాలు పరుగెత్తలేకున్నాయి. మేరు పర్వత సానువుల నిమ్నోన్నత స్థలులలో ఎదురుదెబ్బలు తగిలి రథ చక్రాలు దొరలడం లేదు. ప్రణామాలు కావించే అమరుల కిరీటాల్లో పొదిగిన మరకతమణుల కాంతుల్నిచూసి గరికపోచలని హయాలు మోహం చెందుతున్నాయి.

-ఇంకా ఉంది