భక్తి కథలు

కాశీ ఖండం.. 175

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చళ్లు, కిచ్చడులు (చిత్రాన్నాలు),వడియాలు, కడియపు అట్టులు, కాయాలు, సుగంధి జలాలు, ఉండ్రాళ్లు, నానప్రాలు (పేలాలు), అనుములు, మినుములు, పుణుకులు, చలిమిడి, అటుకులు, ఇలిమిడి, ద్రెబ్బడ, వడలు, ఉక్కెరలు (పంచదార కలిపి వేసిన పిళ్లు), నేతులు, తేనెతొలలు, పిట్టు లేక పిండి, కుట్టు, తోపలు (వండిన రాగి పిండి వంటివి), పూసలు, మోదకాలు, బెల్లంపానకాలు, కూరలు, చెరకుపాకాలు, రాజనాల బియ్యపు అన్నం, షాడబాలు (పానీయాలు), తిమ్మనాలు (చల్ల పునుగులు), పెరుగు గడ్డలు, మీగడలు, మజ్జిగలు, ఊరుగాయలు, జావలు, రసావళులు, భుగ భుగమనె పోపు వాసనలతో ప్రతిఘటించే- పోటీవచ్చే- ఇంగువ వాసనలతో మంతనం ఆడే మెంతుల కమ్మని వాసనలతో సరసం ఆడే జీలకర్ర సువాసనలు, ఆ జీలకర్ర సౌరభాలతో పరిహాసం ఆడుతున్న లేత కొతిమీర వాసనలు, ఆ కొతిమీర వాసనలతో మేలమాడే కరివేపాకు పరిమళం, కరివేపాకు పరిమళాన్ని అథఃకరించే కసిందాకు గంధాలు, ఆ కసింధకు గంధాలను తలదనే్న ఏలకికాయల సౌరభాలు, ఏలకుల సువాసనలతో లీనమయే నల్లఅగరు, కస్తూరి, పచ్చకర్పూరం, మంచి గంధం, పన్నీటి ద్రవం వాసనలు, ఆ కాలాగురు ఆది ద్రవ్య సువాసనలతో కలహం ఆడే మహి సాక్షి, గుగ్గులు, ధూపాల కమ్మదనం, భోజన శాల కిటికీలనుంచి వెడలి పౌర జనుల ముక్కు పుటాలకి వాస్తవాలుగా, మిరియాల ఘాటు, పసపు అందమూ, శొంఠి సొబగు, ఆవఠేవ, సైంధవ లవణపు చేవ, లవంగ కోమలత, పిప్పళ్ల ఒప్పు, అల్లం సాంద్రత, చింతపండు అతిశయమూ, పేలపిండి సమృద్ధి, ఇప్ప పువ్వుల విజృంభణ, వెన్న పెను నాటకాలు, పుట్టి ఒక్కొక్కసారిగా తనకు తాను కవోష్టమైన అధికమైన ఆవిరితో ఆవిర్భవించాయి. తరుణా శోకవృక్షపు చిగురు రంగుతో ప్రకాశించే జడలని జూటంగా ముడిచికొన్నాడు. బంగారు రుద్రాక్ష దండలు రెండు చెవులలో సవరించుకొన్నాడు. అందంగా జారిన బొజ్జ మీద నాభి బిలం నుంచి నీరు కావి పంచె ధరించాడు. నఖశిఖ పర్యంతం అన్ని అవయవాలపై విభూతి చల్లుకొన్నాడు. పాశుపత నియమం రూపం తాల్చినట్లు శాంత స్వభావం పురుషరూపం దాల్చిన సౌష్ఠవంతో భోజన పంక్తి మధ్యకి ఏతెంచి ఇంటి యజమాని మునులకి భక్తితో అన్నం ధారపోశాడు.
మునిగణము మనసు కోరిక తీరేటట్లు చతుర్విధ ఆహారాలనీ కడుపార ఆరగించింది. గృహమేథి కూడా వారి బంతిని కూర్చుండి ధర్మగృహిణి వీవన విసురుతూ వుండగా ఆహారాన్ని ఆరగించాడు. భోజనానంతరం ఆస్థాన మంటపంలో సుఖంగా ఉపవిష్టుడు అయి ధర్మపత్నీ, తానూ వ్యాస మునిని రావించి కూర్చుండ నియమించారు. పిమ్మట పెద్ద ముత్తయిదువకి కనుసైగ కావించి విశాలాక్షితో వ్యాసులతో ఆడవలసిన మాటల్ని చెప్పుమని పలికాడు.
-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి