భక్తి కథలు

కాశీ ఖండం..31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లేశాన్ని, సౌఖ్యాన్ని, శీఘ్రంగా అగస్త్యముని కాశీ వియోగమూ దక్షిణ కాశీ సమాగమం క్రమంగా కలిగిన కారణంగా తెలుసుకొన్నాడు.
పరోపకార పరాయణుడికి సంపదలు పుంఖానుపుంఖంగా సంభవిస్తాయి. పుణ్యతీర్థ స్నానం, దానాలు, మంత్రజపాలు, హోమాలు, దేవతలని అర్చించడం మున్నయినవి పరోపకారం ఒనర్చడంతో సాటిరావు. పరోపకారాన్ని మించిన ధర్మం లేదు.
లోకోపకారపరుడైన వాతాపిని శిక్షించిన అగస్త్య మహర్షికి ఇంతలేసి లాభములు సమకూరకుండ వుంటాయా? ఈ విధంగా భోగమోక్షాలకి నెలవైన దక్షారామక్షేత్రంలో కొలది దినములు వుండి, అనంతరం శ్రీమహాలక్ష్మిని సందర్శించే అభిలాష కలిగి కొల్లాపురం పోవతలచి మిత్రావరుణుల కుమారుడైన అగస్త్య మునీంద్రుడు ఏ ధరణీ ధరం చెంత అంతర్వాహిని అయి ‘తల్లిబావి’ ఆవిర్భవించిందో, ఏ శైలం పాద మూలాలలోపల కల్లేరుతో కలిసి వృద్ధ గంగాజలం ప్రవహించిందో, ఏ గిరి ఉత్తర దిక్తల గర్భంలో సప్తగోదావరం ఉదయించిందో, ఏ మహీధరం దక్షిణ దిశను క్షార జలధిపత్ని అయిన కణ్వ తరంగిణి జనించిందో, ఏ శైలం కమలాద్రి తోబుట్టువో, ఏ అద్రికి పంచలింగి (అయిదు లింగాల సమాహారం) బలిసివుంటుందో అటువంటి వీరభద్రాద్రి లేక పట్టిస పవిత్ర క్షేత్రానికి అరుగుదెంచాడు. ఈ గతి అరుదెంచి లోపాముద్రతో ఈ కరణి వచించాడు.
‘‘దక్షిణానందకాననం అయిన దక్షిణ కాశిలో దక్షాధ్వరధ్వంసన సమయంలో దేవతల్ని ఖండించి, వీరభద్రేశ్వరస్వామి ఈ కొండమీద నిలిచి, తన తరవారిని గౌతమీ వారిలో కడిగాడు. ఆంధ్రభూమికి కమలాద్రిన్ని, వీరభద్రస్థానం అయిన పట్టిసాచలమున్ను వక్షోజద్వయం. భువన నయనాలకి కరంభం. (పెరుగుతో కలిసిన పేలపిండి ముద్ద) అయిన గౌతమీ గంగ కంఠమందు తాల్చిన ముత్యాల హారం. ఎవడు తన డాచేతి వాడి నఖంతో వాణి యొక్క చిగురు ముక్కుని చిదిమివేశాడో, ఏ వీరుడు అలవోకగా పూషార్కుడి ధవళ దంతాలను బంగారు మొల నూలులో గ్రుచ్చి వస్త్రంపైన కట్టినాడో, ఎవడు తన చరణాంగుష్టతో చంద్రుడి పొట్ట గుజ్జు వెలికి వచ్చు రీతిగా నొక్కి పెట్టాడో, ఎవడు కత్తివాదర ధారతో అగ్నిదేవుడి సప్త జిహ్వలని అంటబట్టుకొని తరిగివేశాడో, ఎవడు వెరపుతో పరువులు వారుతున్న త్రింశత్కోటి దేవతలను వెన్నంటి తరిమి తరిమి కొట్టినాడో అటువంటి వీరభద్రేశ్వరస్వామి ఈ పట్టిసాచలం మీద భద్రకాళితో కూడి వుండి భక్తుల అర్చలు అందుకొంటూ వుంటాడు.
బ్రహ్మసంవేద్యం ఆదిగా పట్టిస క్షేత్రాంతం వరకు గోదావరీ నదీ హారానికి పంచలింగాశ్రయం అయిన వీరభద్రాద్రి లేక పట్టిసాచలం నాయకరత్నమై అందగిస్తుంది అని పలికి దిన దిన ప్రయాణాలు సలిపి, క్షీరా రామక్షేత్రం, కుమారా రామక్షేత్రం (సామర్లకోట), అమరా రామక్షేత్రం- ఈ ఆరామాల్లో వెలసిన చంద్ర చూడామణి అయిన పరమశివుణ్ణి తన పత్ని లోపాముద్రయున్ను, తానున్ను ఆరాధించాడు.
పిమ్మట ఆ ముని సింహము కృష్ణానదిలో స్నానమాడి, అటనుంచి కదలి పశ్చిమ సముద్ర తీరంలో వున్న సౌరాష్ట్ర దేశంలోని సోమనాథేశ్వరుడి శిరశ్చంద్ర చంద్రికా పేశీల రశ్మిచే ధవళితములయిన సౌధశిఖరాలతో నింగిని ఒరసుకొనే అష్టాదశ శక్తి పీఠాల్లో సుప్రసిద్ధం అయిన కొల్లాపురానికి అరిగి అక్కడ శే్వత వరాహ కల్పంలో విష్ణుమూర్తి వరాహావతారం ధరించి తన దంష్ట్రాగ్రభాగాన భూదేవిని తాల్చి వుండడంవల్ల ఆయనపై ప్రణయ కలహం పూని ఈ మహాలక్ష్మీ దేవి కొల్లాపురం వచ్చిందేమో అని అంటారు.

-ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి