భక్తి కథలు

కాశీ ఖండం..36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవంతి లేక ఉజ్జయిని, అయోధ్య, ఉత్తర మధుర అయిన శ్రీకృష్ణజన్మస్థలం, మీనాక్షీ సుందరేశ్వరుల నివాస స్థానం అయిన పాండ్యరాజులు దక్షిణ మధుర, ద్వారక, అంతర్వాహిని అయిన సరస్వతీ నది, కృష్ణా తరంగిణి పుట్టిన సహ్య పర్వతం, గంగా సాగర సంగమస్థలం, కాంచీపురం, గోదావరి పుట్టిన నాసికా త్య్రంబకం, సప్తగోదావరం అని ప్రసిద్ధి పొందిన దక్షారామం, కాలంజర తీర్థం, నరనారాయణులు తపస్సు ఒనర్చిన బదరికాశ్రమం అనబడే ప్రభాసతీర్థం, మహాలయ తీర్థం, నర్మదా తీరంలోని ఓంకారం, పూరీ జగన్నాథం లేక పురుషోత్తమ తీర్థం, దక్షిణ సముద్ర తీరంలోని గోకర్ణం, భృగుతీర్థం, పుష్కరం,, శ్రీశైలం- ఇవన్నీ మోక్షకారణాలైన మహాతీర్థాలు.
పరమేశ్వరానుగ్రహం కలగనిదే ఆత్మ తీర్థయాత్ర చేయడానికి సమ్మతింపదు. తీర్థాలలో మునుగవలెనన్న ఆసక్తి లేకుంటే విఘ్నరూపం అయిన పాపం తొలగిపోదు. ఈ ప్రతిబంధ రూపం అయిన దురితం పాసిపోకుంటే కాశీక్షేత్రాన్ని సందర్శించాలనే పూనికే జనింపదు. కాశీక్షేత్ర నివాసమే లేకుంటే విజ్ఞాన దీపం తన వెలుగుని విస్తరింపచెయ్యదు. ఓ లోపాముద్రా! విజ్ఞానం వల్లగాని ముక్తి సంభవించదు. జ్ఞానం ఉపనిషద్వాక్లావల్ల కలుగేది. దీనినే విజ్ఞానం అనిన్నీ అంటారు. ఈ సూక్ష్మాన్ని తెలిసికోవలసింది- ఓ చంద్రవదనా! ధారాతీర్థం అంటే కత్తివాదర అంచు. ఆ ధారాంచలంతో తెగిన వీరవరుడు మోక్ష సంపదని పొందుతాడు. ఓ తరుణీ! మానసాలైన తీర్థాలు మోక్షప్రదాలు- బాహ్యతీర్థాలకన్నా మానస తీర్థాలు ఉత్తమాలు. ఈ మానస తీర్థాల యెడ అశ్రద్ధ పూని నరులు బాహ్యతీర్థాలల్లో మునుగడం నిష్ప్రయోజనం. సత్యం తీర్థము. ఇంద్రియ జయం తీర్థం, అసూయలేకుండడం తీర్థం. దానం, సంతోషం, భూతదయ, బ్రహ్మచర్యం, ధైర్యం, యమం, సమత్వం, విజ్ఞానం, పుణ్యం, ఇవన్నీ తీర్థాలే. ఇవే మానస తీర్థాలు. బుద్ధి శుద్ధి పెంపొందినట్లు ఈ మానస తీర్థాలలో మునుగకుండా బాహ్య తీర్థాలలో ఎన్ని మునుకలు వేసినా అవి తీర్థ్ఫలాన్ని ఒసగవు. మానస తీర్థాల్లో మునిగిన వాళ్లకే బాహ్య తీర్థసేవనం ఫలవంతం అవుతుంది.ః ఓ పద్మదళాయతాక్షీ! నీళ్లలో మొసళ్లు, చేపలు, పీతలు, తాబేళ్లు మునిగి ఆడడం లేదా? ఈ జలచరాలకి అనుపమాన తీర్థ ఫలం సమకూరుతుందా? ఆ విధంగానే మానస తీర్థాల్లో మునుకలాడక బాహ్య తీర్థాలెన్ని ఆడినా నరులకు తీర్థస్నాన ఫలం దక్కదు. ఓ సుదతీ, అంతశ్శుద్ధిలేని బాహ్య శుద్ధి నిష్ఫలం. బాహ్యతీర్థాలెన్ని ఆడినా చిత్తశుద్ధి కలుగదు. వెయ్యి కడవల జలంతో కడిగినా కల్లుకుండ పవిత్రం ఎలా అవుతుంది? లోపాముద్రా! సత్య, శమ, అనుకంపాది మానస తీర్థాల్లో అవగాహనంవల్ల అనురాగ, ద్వేష సంజనితాలు అయిన చిత్తమాలిన్యాలు ప్రక్షాళితాలు అవుతాయి. బాహ్య తీర్థాల పంకాన్ని, ధూళిని మాత్రమే కడిగి వెయ్యడానికి సమర్థాలు. సందర్శించినంతనే నిర్నిబంధనమైన ప్రసన్నత పొందాలి, మనస్సు, కలుషితం కాని, దుర్గంధం అంటని నిర్మల జలం పుష్కలంగా లభించాలి. పుణ్యక్షేత్రాలు, పుణ్యశైవాలు, తపోవనాలు- వీటికి సమీపంలో వుండాలి. వ్రతములు పూనిన సూయమి ప్రవరులు పరిగ్రహించి వుండాలి. ఇటువంటి పుణ్యతీర్థాలలో మునిగితే తీర్థాలు ఆడినట్లు అవుతుంది. జలాలు వున్నంత మాత్రం చేత తీర్థం అవదు. శరీరంలోని అంగాలవలెనే భూమిలోని తీర్థాలకు కూడా తారతమ్యం వుంది సుమా!
హరిణనయన! దానాలు పట్టకుండా వుండడం, అహంకారం లేకుండడం, అహేతునిష్ఠ, సత్యసంధత, వ్యగ్రతాహిత్యం, శద్ధ్ధానత, క్షేత్రోపవాసం, పితృతర్పణం, బ్రాహ్మణ భోజనం, శిరోముండనం ఆదిగాగలవి సాంగోపాంగాలై తీర్థ్ఫలం ఇయ్యగల్గుతాయి. ఇటుపైన ఆ తీర్థాల తారతమ్యాన్ని వివరిస్తాను. ఆలకించు-

-ఇంకా ఉంది