భక్తి కథలు

శ్రీ సాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా దగ్గరగా పాటిల్ సంతోషంతో కూర్చున్నాడు.
అంతలో బాబా తన చేతిలోని పొడుగాటి కమ్మి చిమ్టాను నేలపై గుచ్చాడు. బుస్‌మని నీరు పైకి ఉబికి వచ్చింది. ఆ నీటిలో చేతిలో ఉన్న గుడ్డను తడిపాడు. మట్టి గొట్టం ఒక చివరను చుట్టాడు. ఈసారి మళ్లీ ఆ చిమ్టాను భూమిపై కొట్టాడు. ఒక నిప్పుకణిక వచ్చింది. వెంటనే చిలుము వెలిగించాడు. పాటిల్‌కు ఇచ్చాడు.
అంతా చూస్తూ కూర్చున్న పాటిల్‌కు అర్థం అయింది ఇతడు సామాన్య ఫకీరు కాదని. అంతే బాబాను మా ఇంటికి రండని పిలిచాడు.
బాబా అతని మొహం చూచాడు.
మళ్లీ ‘‘బాబా మీరు మా ఇంట్లోనే ఉండండి. నాకెంతో ఆనందంగా ఉంటుంది’’ అన్నాడు.
ఫర్లేదు నేను రేపు వస్తాను. ఇక బయలుదేరు అని అన్నాడు బాబా.
పాటిల్ తనకు బాబా ఇచ్చిన చిలుము గుర్తుచేసుకుంటూ వీరికి బాబా పండ్లు ఇస్తున్నాడు. నిజమే దైవం ఎవరికేది ఇవ్వాలో దానే్న ఇస్తుంటాడు. ఎవరికేది ఎప్పుడు ఇవ్వాలో దాన్ని ఇస్తాడు. మరలా మరలా అనుకుని బాబా దగ్గరకు వెళ్ళాడు. బాబాకు నమస్కరించి అక్కడే కూర్చున్నాడు. వారంతా కలిసి బాబాతో చాలాసేపు మాట్లాడుకున్నారు.
అలా ప్రతిరోజు బాబా దర్శనంకోసం రావడం వారంతా జరిగినదాన్ని జరగబోయేదాన్ని గురించి మాట్లడుకోవడం అలవాటుగా చేసుకున్నారు.
బయాజీబాయి రోజు బాబాకు భోజనం పెట్టనిదే తాను తినేది కాదు.
ఒక రోజు
బాబా దర్శనం కోసం నానా చోప్దార్ వచ్చాడు. అప్పటికే అక్కడ సాయి భక్తులు సమావేశమయి కూర్చొని ఉన్నారు.
ఎవరెవరికి ఏమేమి బాబా విషయంలో ఆశ్చర్యాలు కలిగియో చెప్తున్నారు.
నానా అవి వింటూ తాను చెప్పడం ఆరంభించారు.
నాకు మా అమ్మ చెప్పిన వివరం చెప్తాను వినండి.
ఒకసారి అంటే సుమారుగా 1854 అనుకుంటా..
అపుడు వేప చెట్టు కింద ఒక 16 ఏళ్ళ బాలుడు కూర్చుని ఉండేవాడట. అతడు ఎక్కడినుంచి వచ్చాడో ఎప్పుడైనా ఎటు వెళ్తాడో కూడా ఎవరికీ తెలిసేది కాదట. ఆ బాలుడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ వౌనంగా కూర్చుని ఉండేవాడట. ఎవరు పిలిచినా పలికేవాడు కాడట. అన్నమూ నీళ్ళు లేకుండా అక్కడే కూర్చుని ఉండేవాడట. రాత్రి ఎక్కడికి వెళ్ళేవాడో ఎవరికీ తెలిసేది కాదట. మళ్లీ పొద్దునే్న చూస్తే అక్కడే కనిపించేవాడట.
ఇట్లాంటి ఈ బాలుని గూర్చి తెలుసుకోవాలని మన ఖండోబా ఎవరి మీదనో పూనినప్పుడు ఊరి పెద్దలంతా ఈ బాలుని గురించి అడిగారట. అప్పడు ఖండోబా ఈ వేపచెట్టు దగ్గర తవ్వి చూడమని అన్నాడట.
అక్కడ తవ్వి చూసేలోపల పెద్ద చీకటి గుహ ఉందట. అందులో నాలుగు వెలిగే దీపాలు కూడా ఉన్నాయి. తిని వదిలేసిన పండ్లముక్కలు, తొక్కలు కనిపించాయట. పూజ చేసుకునే వస్తువులు కూడా వారికి ఆ గుహలో కనిపించాయట. దాన్ని చూపిస్తూ ఖండోబా పూనినతడు ఈ బాలుడు ఇక్కడే 12 ఏళ్ళు తపస్సు చేసుకున్నాడు అని చెప్పాడట. అప్పుడు ఆ బాలుడు అక్కడికి వచ్చి అయ్యో ఇదంతా మా గురువుగారి స్థానం. దీన్ని మూసివేయండి అని చెప్పి మూసివేయించారట.
ఆ తరువాత కూడా ఇక్కడ ఆడుకునే పిల్లలు ఇక్కడ ఒక బండను తొలగించి చూసినపుడు వారికి లోపల పెద్ద గుహ అందులోకి వెళ్లడానికి మెట్లు లోపల పెద్ద వెలుగు కూడా కనిపించాయట.
ఆ బాలుడే మళ్లీ కొన్నాళ్లు ఎక్కడికో వెళ్లిపోయాడట. ఎవరికీ కనిపించలేదట. ఆ బాలుడే ఈ బాబా అని మా అమ్మ అంటోంది అని చెప్పాడు. అవును నాకు ఎప్పటినుంచో బాగా పరిచయం ఉన్నట్లు ఎంతో సన్నిహితంగా మేము మెలిగినట్లు నాకు అన్పిస్తూనే ఉంటుంది అని మహిల్సాపతి చెప్పాడు.
నిజంగానే నిన్న మొన్న ఈ వేప చెట్టు దగ్గర ఉన్న ఈ భవన నిర్మాణానికి మరమ్మతులు చేయిస్తుంటే ఈ వేప చెట్టు అడుగున పెద్ద తొర్ర కనిపించిందట. అక్కడ వారికి ఓ సమాధి కూడా కనిపించిందట. అప్పుడు ఈ బాబాను వారు వచ్చి ఇలా ఉందని చెప్తే దాన్ని మూసివేయండి త్వరగా. అది మా గురుస్థానం అని చెప్పారట.
చూశారా! ఆ బాలుడే ఈ సాయినాథుడు అని అంతా అన్నారు.
నిజమే నిజమే
***
ఒక రోజు
‘‘బాబా! అసలు నీవు ఎవరో మాకు తెలీదు. ఒక్కొక్కరు ఒక్కో సంగతి చెప్తారు. వారి అనుభవం అంటారు. అసలు నీవు ఎవరు బాబా? మాకు నీ వివరం అంతా చెప్పవచ్చు కదా’’ అడిగాడు చోప్దార్.
అక్కడే హేమాదిపంత్ లాంటి భక్తబృందం అంతా కూర్చుని ఇపుడు సాయిబాబా ఎవరో ఏమిటో అంతా చెప్పేస్తారు అని వినడానికి చెవులు రిక్కించి కూర్చున్నారు.
**
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

- జంగం శ్రీనివాసులు 837 489 4743