భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బాబా నా మేకలు మందలోనుంచి తప్పిపోయాయి. నాకు చాలా కంగారుగా ఉంది. నా మేకలను నేను ఎలా పట్టుకోవాలి. కాస్త నా మేకలు ఎటుపోయి ఉంటాయో చెప్పు బాబా. నేను వెళ్లి తెచ్చుకుంటాను’’ ఆయాసపడుతూ శివుడు వచ్చాడు.
‘బాగుంది వరుస. ఒకరేమే డబ్బు ఇవ్వమంటారు. మరొకరు మేకలు కావాలంటున్నారు. అసలు బాబా ఎవరు? ఆయన దగ్గర ఏమి అడగాలి. ఈ మాత్రం బుద్ధి లేకపోతే ఇక మనం బాగుపడేదెప్పుడు’ అన్నాడు అక్కడ జరిగేవన్నీ చూస్తున్న నానా. ఈ నానా ఎప్పుడూ ఏదో ఒక పుస్తకాన్ని తిరగేస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఏ భాగవతంలోనో భగవద్గీతలోనో సందేహాలను అడుగుతుంటాడు.
‘సరి సరి బాగుంది. నేమన్నా నీలాగా చదువుకున్నానా ఏంటి? పెద్ద పొత్తాలు పట్టుకుని సందేహాలు తీర్చడానికి ఇంట్లో నలుగురి పిల్లల ఆకలి ఎట్లా తీర్చాలి అన్నదే నాకు ఎక్కువ బాబూ’ అంది పార్వతి.
బాబా చిరునవ్వు నవ్వి, ‘పోనీలే పార్వతి ఇంద ఇవి తీసుకో. నీకు ఈరోజుటి ఖర్చు జరిగిపోతుంది. తీసుకుని వెళ్లి మీ పిల్లల ఆకలి తీర్చు’ అంటూ తన జోలెలో ఉన్న నాలుగు రూపాయలు తీసి పార్వతికి ఇచ్చాడు బాబా.
‘బాబా నా మేకలు గురించి చెప్పవా.. అవి చాలాదూరం వెళ్లితే నేను వెళ్లలేను’ అన్నాడు శివుడు.
‘మమయ్యా నీ మేకలేమన్నా బాబాకు చెప్పి వెళ్లాయా ఏంటి? అట్లా గదమాయించి అడుగుతున్నావు. పో పో వెతుక్కో, ఎక్కడో ఒక చోట కనపడతాయి అన్నాడు నానా.
శివుడు ఏడుపు మొహం పెట్టి బాబా అన్నాడు.
‘‘కంగారుపడకు శివయ్య. ఇందాకే మీ ఇంటికి నీ మేకలు వెళ్లిపోయాయి. నీవు ఇంటికి వెళ్లు. అవి నీకన్నా ముందే ఇంటికి చేరాయి. నీ భార్య వాటికి మేత వేస్తోంది చూడు పో. బాధపడకు’’ అన్నాడు బాబా.
‘బాబా!వీళ్లంతా ఏమిటి నీలాంటి మహాజ్ఞాని దగ్గర ఇలాంటి చిన్న చిన్న కోరికలు కోరుతూ వస్తారు. ఎలాంటి కోరికలు కోరాలో నీ దగ్గర ఏమి నేర్చుకోవాలో కూడా వీరికి తెలియదు’ అన్నాడు నానా.
బాబా చిరునవ్వు నవ్వి ‘‘నానా! భక్తులు ఏది కోరి నా దగ్గరకు వస్తారో వారి కోరికలు తీర్చడం నా బాధ్యత. అంతేకాదు, అసలు వారికేమి కావాలో వారు అడగకపోయినా నేనే వారికి ఇస్తాను. ఎవరికేమి ఇవ్వాలో నాకు తెలుసు కదా! నీవెందుకు ఆందోళన పడుతావు. నా దగ్గరకు రావాలనుకోగానే వారి మనస్సులో నిన్ను నిలుపుకున్నట్లే కదా. ఇక మెల్ల మెల్లగా వారు నాక్కావాల్సిన దోవలోకి వస్తారు’’ అన్నాడు.
అప్పుడు నానా తాను చదివిన భగవద్గీతలోని శ్లోకం
చతుర్విధా భుజనే్త మాం జనాః సుకృతినోర్జున
ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ
ఆపదలో ఉన్నవాడు, సంపద కోరువాడు, జ్ఞానమును వాంఛించువాడు, పరమాత్మ జ్ఞానము ననే్వషించువాడు అనే ఈ నాలుగు రకాలైన పుణ్యాత్ములు నాకు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఆహా నిజంగా ఈ బాబా కృష్ణపరమాత్మనే. ఆయన అర్జునునితో చెప్పింది కూడా ఇదే కదా. ఎవరేమి కావాలని కోరుకుంటారో వారికి దానిని ఇచ్చేవాడు భగవంతుడు కదా. గుర్తుకు వచ్చింది. బాబాను శ్రీకృష్ణునిగా భావించుకుంటూ ఉండిపోయాడు.
అంతలో-
మహిల్సాపతి బాబా సద్గురువు గురించి నాకు కాస్త చెప్పరా.. అడిగాడు.
బాబా ఎంతో గంభీరంగా మహిల్సాపతి వైపు చూశారు..
మహిల్సాపతీ! నా గురువు గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. అసలు నేను ఇలా ఉండడానికి కారణం గురువునే. కాని నేనేనాడు గురువును ఇది కావాలని కోరలేదు. నాకు గురువు నీకిదిస్తున్నాను అని చెప్పలేదు. తాబేలు పిల్లలు పొదిగినట్టు నేను ఎక్కడ ఉన్నా నాపై గురుదృష్టి ఉందని నేను అనుకుంటాను. నిజంగాకూడా మా గురువుగారివల్లనే నేనీనాడు ఈ దశకు చేరుకున్నాను అన్నాడు బాబా.
బాబా అన్నాడు మహిల్సాపతి.
అవును మహిల్సా.. నిజమే చెబుతున్నాను. మా గురువును నేను ఎప్పుడూ ప్రశాంతమైన వదనంతోను, ఓరిమిగల చూపులతోను, చిరునవ్వును ప్రదర్శించే పెదవులతోనూ చూచేవాడిని. ఆ గురువుగారిని చూడగానే నా మనసు నిర్మలమైపోయేది.

-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743