భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరెంత అదృష్టవంతులు. ఈ మారుమూల గ్రామంలో చింతామణి వంటి దివ్య పురుషుడిని పెట్టుకుని ఉన్నారు. నాలాంటివాని దగ్గర మంచిమాటలు వినడానికని వచ్చారు. కానీ మీ దగ్గరే మహావజ్రం ఉంది. దాని విలువ ఇప్పుడు మీకు తెలియడంలేదు. తెలిసినా అజ్ఞానంతో వజ్రాన్ని రాయి ముక్కగానే చూస్తున్నారు. కొంతకాలంలోనే ఈ దివ్యపురుషుని సమాధినే మాట్లాడుతుంది. అక్కడక్కడ కనిపించే జన సంచారం ఈ శిరిడీ ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోతుంది అని ఇంకా ఏదేదో చెబుతు ఉన్నారు. శిరిడీ వాసులంతా కొత్త విషయాలు వింటున్నట్టుగా ఆసక్తితో వింటున్నారు.
మాధవరావ్ దేశ్‌పాండ్ ‘‘ఇదిగో ఇదే శిరిడీ. అయినా స్వామీ మీరు ఇంతకుముందు ఈ శిరిడీని చూచి ఉండలేదా’’ అడిగాడు.
‘‘అవును నాయనా. నేను ఇంతకుముందు చూచి ఉన్నాను. కాని ఇక్కడ ఓ అద్భుతం ఉంది అని నాకు తెలిసింది. దాన్ని చూసి వెళ్దామని వచ్చాను’’ అన్నాడు ఆనందస్వామి యవలా.
‘‘ఏంటి మా శిరిడీలో మాకు తెలియకుండా అద్భుతం ఉందా’’ ఆశ్చర్యంగా అడిగాడు నందరామ్ మార్వాడీ.
‘‘స్వామీ మేము ఎన్నో ఏళ్లుగా అంటే మా తాతముత్తాల నుంచి కూడా ఇక్కడే నివసిస్తున్నాము. మేము మా పూర్వులు సందర్శించినట్లే అనేక పుణ్యక్షేత్రాలను అప్పుడప్పుడు సందర్శిస్తాము. మా తాతగారు నాకు కలలో కనపడి అక్కలకోటకు వెళ్లి అక్కడ ఉన్న శ్రీఆనందస్వామి యవలను దర్శనం చేసుకో’’ అని చెప్పారు. నేను దాన్ని మా శిరిడీ ఈమధ్య వచ్చిన స్వామి సాయినాథునితో చెప్పాను. అతడు పెద్దవాళ్లుచెప్పింది చేసి తీరాలి. వెళ్లి అక్కడ ఉన్న స్వామిని చూసిరా. అయినా ఆ స్వామిని చూసివచ్చినా నన్ను చూసినా ఒకటేలే అన్నారు’’ మాధవరావు అన్నాడు.
‘‘ఓహ్ ఈ స్వామిని దర్శించుకోవడానికే నీవు బాబాతో చెప్పావా?’’ నాకు అప్పుడు అర్ధం కాలేదు. నీతోపాటు నన్ను కూడా వెళ్లిరమ్మని బాబా అంటే నేను నీతో వచ్చాను. నీ దారిలో కూడా ఏమీ చెప్పలేదే’’ అన్నాడు నందరామ్.
‘‘నేను మాటల్లో మరిచాను. ఈ స్వామిని దర్శించుకోవడానికే వచ్చాను’’ అన్నాడు మాధవ్‌రావు.
‘చూడు మాధవ్‌రావు మనమేమో ఈ ఆనందస్వామిని దర్శనం చేసుకుని వస్తుంటే ఈ స్వామి చిన్నపిల్లవానిలాగా మనం గుర్రపు బగ్గీ ఎక్కిన తరువాత నేను మీతో వస్తాను అంటూ వచ్చారు కదా. ఇప్పుడేమో శిరిడీలోకి అడుగుపెట్టుతున్నాం అని అన్నప్పటినుంచి ఈయన కళ్లు అదేపనిగా నీళ్లు కారుతున్నాయి. ఈన ఏమో ఎక్కడో చూస్తున్నారు. నేను గమనిస్తూనే ఉన్నాను. కాని ఎంతో ఆనందంగా ఉన్నట్లు ఈ స్వామి ముఖం కనబడుతోంది కదా. మనకు తెలియకుండా ఇక్కడ అద్భుతం ఏమి ఉంది. ఈన ఎందుకు దాన్ని చూడడానికి ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు. కాని మరి ఆ కన్నీళ్ళు ఏమిటి?’ నాకు అంతా అయోమయంగా ఉంది అన్నాడు నంద్‌రామ్.
‘‘నిజమే నాకు అలానే ఉంది. మనం ఇన్ని మాటలు మాట్లాడుతూనే ఉన్నా స్వామి మన మాటలు విన్నట్టే లేదు. అయినా ఈ స్వాముల చేతలకు మనకు అర్థం తెలియడం కష్టమేనేమో’’ అన్నాడు. అంతలో శిరిడీ బాబా మసీదు దగ్గరకు గుర్రపు బగ్గీ వచ్చేసింది.
‘‘ఆహా ఇదే ఇదే కదా నేను చూడవలసింది. నా స్వామి ఎక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు. నన్ను చూడగానే ఏమంటారు. పదండి ముందు స్వామి దగ్గరకు పోదాం పదండి’’ అని గబగబా బగ్గీ దిగేసి ముందుకు నడిచాడు ఆనందస్వామి.
మాధవరావు నందరామ్ ఇద్దరూ వౌనంగా చూస్తూ ముందుకు వెళ్లారు.
అక్కడ సాయిబాబా బయటకు వచ్చారు. వీరి ముగ్గురిని చూశారు. బాబా అదేపనిగా అక్కల్‌కోట శ్రీఆనందస్వామిని చూచారు.
అక్కల్‌కోట స్వామి కూడా సాయిని తదేకంగా చూశారు. అంతే.
‘ఓ మాధవ్ వచ్చిన పని అయిపోయింది. నేను తిరిగి అక్కల్‌కోటకు వెళ్లాలి, సాయిరామ్’ అన్నాడు శ్రీఆనందస్వామి.
‘స్వామి ఇపుడే కదా వచ్చారు. ఆగండి. మా ఇంటికి వెళ్దాం. కాసేపు విశ్రాంతి తీసుకుని కనీసం పాలు పండ్లనైనా మీరు తీసుకున్న తరువాత వెళ్దురు’ అన్నాడు మాధవరావు.
సాయి ఇవేవి వినకుండానే లోపలికి వెళ్లిపోయారు.
‘అదేమీ వద్దు మాధవ్, మీరు వజ్రం లాంటి మహానుభావుణ్ణి ఇక్కడే పెట్టుకుని సరిగా ఆయన్ను అర్థం చేసుకోవడంలేదు. మీరంతా నిత్యం ఈన దర్శనం చేసుకుంటున్న అదృష్టవంతులు. మీకు సామాన్యమైన వ్యక్తిగా కనిపిస్తున్న ఈ సాయిబాబానే భగవంతుడు. మీరు త్వరలోనే ఈన శక్తి ఏమిటో తెలుస్తుంది’’ అన్నాడు ఆనందసాయి.

-ఇంకా ఉంది
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

- జంగం శ్రీనివాసులు 837 489 4743