భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేమాదిపంతు మరింత ఆశ్చర్యపోతూ బాబా ఎక్కడికి వెళ్లలేదు. కాని నీకు ఉరుములు మెరుపులు దారిలో ఎదురవుతాయని నాతో అన్నారు అని ఇక్కడ జరిగిన విషయం రాసి పంపాడు. దీనినంతా బాబాతో చర్చించాడు హేమాదిపంతు.
బాబా హేమాదిపంతు చెప్పిందంతా విని నీవే కదా ఇమాంబాయిని కాపాడాలి అన్నావు. కాపాడాను కదా. ఇంకేమి మళ్లీ సందేహం అంటూ నవ్వారు.
***
మరో రోజు
మోరేశ్వర్ ప్రధాన్ శిరిడీ వచ్చాడు. కాని ఎవరితో ఏమీ మాట్లాడలేదు. మసీదుకు వచ్చి దూరంగా కూర్చున్నాడు. ఆ సమయంలో బాబా మసీదులో లేరు. కన్నీళ్లు తుడుచుకుంటూ కూర్చున్నాడు.
అక్కడే ఉన్న కాకాసాహెబ్ ప్రధాన్‌ను చూసి కొద్దిసేపు వౌనం వహించాడు.
‘అయ్యా! మీరెవరు? ఎందుకోసం వచ్చారు. ఇక్కడకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారేమి?’ అని అడిగాడు కాకాసాహెబ్.
‘ఏం చెప్పను? నన్ను ప్రధాన్ అని పిలుస్తారందరూ. నా కొడుకును నేను పోగొట్టుకున్నాను. ఏడు సంవత్సరాలు పెంచుకున్న కొడుకు దూరం అయితే బాధగా ఉంటుంది కదా’ అన్నాడు.
‘అవును నిజమే కాని ఇక్కడకు వచ్చారేమి. ఈ ఊర్లో ఏదైనా పని ఉండి వచ్చారా మీరు’ అడిగాడు కాకాసాహెబ్.
‘పని ఏమీ లేదు. నిన్న నా దగ్గరకు మా మిత్రులు వచ్చి శిరిడీ వెళ్లు, అక్కడ బాబా నిన్ను అనుగ్రహిస్తారు’ అని చెప్పారు. సరేలే అనుకొన్నాను.
కాని నిన్నరాత్రి కలలో ఏడుగురు సాధువులు కనిపించారు. వారిని నేను మీరంతా ఎవరు? మీలో శిరిడీ సాయి ఎవరు అని అడిగాను. ఇదిగో ఇతనే శిరిడీ సాయి అని చూపారు. నేను ఆయన వైపు చూశాను. ఆయన చిరునవ్వుతో చూస్తున్నారు. నేను ఏమి నా కొడుకు పోతే నీకు నవ్వులాటగా ఉందా అని అడిగాను. దానికి ఆయన సమాధానం ఏమీ చెప్పలేదు. అంతలో నాకు నిద్ర మెలకువ వచ్చేసింది అని చెబుతూ ఉన్నాడు. అంతలో బాబా లోపలికి వచ్చాడు. వస్తూనే
‘‘ప్రధాన్‌ను ఎందుకు లోపలికి రానిచ్చారు. అయినా నన్ను తిట్టేవాళ్ళు నా దగ్గరకు ఎందుకు రావడం’’ అన్నారు బాబా.
హేమాదిపంతుతోపాటు కాకాసాహెబ్, ప్రధాన్ అందరూ ఆశ్చర్యంగా బాబావైపు చూశారు.
‘నినే్న అడిగేది నేను నవ్వాను అంటావు. నేను నిన్ను అడిగి నవ్వాలా ఏమిటి? అయినా ఒక్క కొడుకు పోతే ఇలా ఏడిస్తే ఎలా? పోయారు పోయారు అంటే ఎక్కడికి పోయాడు. నా దగ్గరే కదా వచ్చింది. మళ్లా నేను కావాలంటే కొడుకును ఇవ్వనా ఏమిటి? వచ్చే సంవత్సరానికల్లా నవ్వుతూ కొడుకును తీసుకొని భార్యను వెంటపెట్టుకుని రావా ఏమిటి?’’ గబగబా అన్నారు బాబా.
అంతే అక్కడే కన్నీళ్లు కారుస్తూ కూర్చున్న ప్రధాన్ వెంటనే లేచి బాబా పాదాలపై పడి బాబా నీవే నా కలలో కనిపించావు నీవే నన్ను కాపాడాలి అంటూ నమస్కరించాడు.
ఈ విషయాన్నంతా అక్కడివారు ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నారు.
ప్రధాన్ అక్కడివారికంతా ఆయన సంగతి చెప్పుకుంటూ కాలం గడిపాడు.
***
ఒక రోజు
మాధవ్ భట్ అనే ఒక అతను శిరిడీ వచ్చాడు. అతడు రాగానే ఇక్కడ మసీదులో ఉన్న బాబా హిందువునా ముస్లిమునా అని శిరిడీ వాసులను అడిగాడు.
వారంతా మాకు తెలీదు, మేము మాత్రం సాయి అని పిలుస్తాము. మా కష్టం సుఖం అన్నీ ఆయనతో చెప్పుకుంటాము అని చెప్పారు. అంతా విని మసీదులోకి మాధవ్ భట్ వెళ్లాడు.
అప్పుడు సాయంత్రం అవుతూ వుంది. బాబా ప్రమిదల్లో నూనె పోస్తూ వెలిగించడానికి వత్తులు అవీ వేస్తున్నాడు.
మాధవ్ భట్ కూడా వచ్చి ఆ పనుల్లో తాను కూడా చేరాడు. ఏమీ మాట్లాడకుండా వత్తులు సరిచేస్తూ ఒకవైపున వత్తులను వెలిగిస్తూ వచ్చాడు. మసీదులోపల బయట దీపాలు వెలిగించడం పూర్తి అయింది. బాబా ఎప్పటిలా వచ్చి లోపల కూర్చున్నాడు. మాధవ్ భట్ కూడా లోపలికి వచ్చి బాబా దగ్గరగా కూర్చున్నాడు.
అక్కడే వున్న మహిల్సాపతి బాబా మాకు ఏదైనా పురాణం చెప్పండి అని అడిగాడు.
‘నాకేమొచ్చు మహిల్సా.. ఇదిగో ఇతడిని అడుగు, దత్తాత్రేయులవారి గురించి బాగా చెప్తారు.
-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743