భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలా బాబా దగ్గర ఏదో ఒక వింత విషయం ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుండేది. ఇవన్నీ కూడా బాబాలోని సర్వజ్ఞతను సర్వవ్యాపకత్వాన్ని తెలియబరిచేవి.
అట్లానే ఓసారి ఓ లాయర్ వచ్చి బాబాను ప్రార్థించాడు. అతడు నమస్కారం చేసి బాబా నేను కోర్టులో కేసు వేశాను. ఎలాగైనా నేను గెలిచేట్టుగా చేయి అని అడిగాడు.
బాబా వెంటనే అది ఎలా కుదురుతుంది. నాకు నమస్కారం పెడితే కేసు గెలుస్తారా? నేనేమన్నా జడ్జినా అని అన్నాడు.
అతడు బాబా నన్ను క్షమించు నాకు మీ శక్తి తెలియక అలా మాట్లాడాను అన్నాడు.
అక్కడ చూస్తున్న వారికి ఆ లాయర్ ఇలా చెప్పాడు.
నా దగ్గరకు ఓ లాయర్ వచ్చి నేను ఈ కేసులో గెలుస్తానని నమ్మకం లేదు. కాని భగవంతుడైన సాయిని నమ్మాను. ఆయనే గెలుస్తాడు అని చెప్పి కోర్టులోకి వెళ్లాడు. నిజంగా అతడు గెలిచాడు. నేను నమ్మక ఇదంతా సాక్ష్యాల బలమే కాని సాయి చేసింది ఏముందని వానితో వాదించాను. కాని నేడు నాకు అలాంటి సందర్భమే వచ్చింది. అపుడు నాకు ఈ బాబా గుర్తువచ్చారు. కాని నేనప్పుడు వాదించిన విషయం ఇప్పుడు బాబా అంటున్నారు. మరి నన్ను బాబా కాపాడారా అని ఆయన వేదన చెందాడు. వారంతా ఆ విషయం విని బాబా అలా మాట్లాడుతారు కాని బాబా దగ్గరకు వచ్చిన వారెవరూ బాధపడరు. ఆయన అందరినీ కాపాడుతారు. ఆయన చెప్పే మాటలను విని వాటిని మనం ఆచరణలో పెట్టాలి అంతే అన్నారు.
నిజంగా కొన్నాళ్లకు ఆ లాయర్ కేసు గెలిచాడు. అప్పుడు తిరిగి శిరిడీ వచ్చి జరిగిన సంగతి బాబాకు నివేదన చేసి బాబా నాలో అజ్ఞానాన్ని రూపుమాపు నేను నీపై స్థిరమైన నమ్మకం కలిగేటు చేయి అని వేడుకున్నాడు.
బాబా చిరునవ్వు నవ్వి అన్నింటికి అల్లా మాలిక్ ఉన్నాడు కదా అన్నాడు.
చాలామంది విషయంలో ఇటువంటివి జరుగుతుండేవి. ఒకసారి ఒక ఆమె గోదావరిఖని నుంచి వచ్చింది. వస్తూనే మంచి పూల మాల తీసుకుని వచ్చి బాబాకు ఇవ్వబోయింది. ఆయన నాకు వద్దు అన్నారు. ఎందుకు అంటే నేను ఎప్పుడూ అబద్ధాలు చెపుతూ ఉంటాను. ఎవరు ఏది చెప్పినా నమ్మను. నేను పైకి కనిపించేవాడిని కాదు, నాలోపల మరో మనిషి ఉన్నాడు. వాడిని మీరు చూడరు కదా అన్నాడు.
అప్పుడు ఆ గోదావరిఖని ఆమె కన్నీళ్లు పెట్టుకుని బాబా దుఃఖంలో ఉన్నపుడు ఏమీ తోచక భయంతో అట్లా మాట్లాడాను. అంతేకాని మీ మీద నమ్మకం లేక కాదు. నా గురించి నీకు తెలియనిది ఏముంది? నాకు విచారం అనిపించినపుడల్లా నినే్న గుర్తుచేసుకుంటాను. కాని నేను అనుకున్నది నాకు దొరకకపోయేసరికి నీవు ఉన్నావా లేదా అని నేను అడుగుతుంటాను. నీవు నన్ను ఎల్లవేళలా కాపాడాలి. నాకు తెలుసు. నా పూర్వజన్మ కర్మవల్ల కొన్నిసార్లు కష్టాలు తప్పనిసరిగా పడాలి. ఆ కష్టాలు కూడా నీ దయతో బాధించకుండా ఉండాలని అనుకుంటాను. చేసిన పాపం అనుభవించాలి కదా. కాని మనసు ఊరుకోదు. ఏదేదో అనేస్తుంది అని బాబాతో చెప్పింది.
దానికి బాబా ‘నిజమే, మనం పూర్వజన్మలో చేసిన దానికి ఈ జన్మలో కర్మఫలం అనుభవించాల్సి వుంటుంది. అందుకే తెలిసి పనులు చేయమంటారు మన పెద్దలు’ అని చెప్పారు.
అలా వారిద్దరూ ఎంతసేపు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడి భక్తులంతా వారి సంభాషణను విన్నారు.
మీరంతా విన్నారు కదా. చేసేవాడు, చేయించేవాడు కూడా పరమాత్మనే అనుకోవాలి. భగవద్గీతలో భగవానుడు మీ కర్తవ్యాన్ని మీరు చేయండి, ఫలితం ఆశించి చేయకండి. మీకేమి ఫలితాలు కావాలో నాకు తెలుసు. వాటిని నేను మీరు కోరకుండానే ఇస్తాను అని చెప్పాడు కదా. మీకు ఇది తెలుసు కనుక మనకేది ప్రాప్తమో అది వద్దన్నా మన దగ్గరకు వస్తుంది. అట్లానే మనం అనుభవించాల్సిన కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే అని అన్నారు.
***
అట్లానే ఒకసారి హరిబావు అనే అతను రామేశ్వరం బయల్దేరి వెళ్లాలనుకున్నాడు. ఆయన ఒకసారి శిరిడీలో బాబాను దర్శిద్దామనుకుని వచ్చాడు.
బాబా అతని దగ్గర ఉన్న డబ్బు అంతా దక్షిణ అడిగి పుచ్చుకునేశాడు. మళ్లీ డబ్బు అడుగుతున్న బాబాను చూసి హరిబావు ‘‘బాబా దగ్గర ఇంక డబ్బు లేదు.
-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743