భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్లందరూ ఇది ఏంటి నాలుగు రోజుల నుంచి పక్షపాతం వచ్చింది. ఇపుడు హాయిగా తిరుగుతోంది. ఇదంతా దేవుని మహిమనే అని చెప్పి వారు వెళ్లిపోయారు.
ఆ తరువాత జరిగినది తెలుసుకుని బాబా ఎందుకు నొప్పి అన్నారో నాలుగు రోజులు తగ్గుతుంది అన్నారో తెలిసి సర్వాంతర్యామి అని నమస్కారం చేశారు.
బాబాకు కేవలం మనుష్యుల గురించి కాదు ఆఖరికి బల్లుల గురించి కూడా తెలుసు.
ఒకసారి బాబా కూర్చున్న మసీదులో గోడమీద బల్లి శబ్దం చేసింది. బల్లి పలుకుతోంది. ఈ శకునం మంచిదో కాదో బాబా అని అక్కడున్న భక్తుల్లో ఒకరు అన్నారు.
వెంటనే బాబా ఇదేమి శకునం . అది ఇది కాదు. అన్నింటికీ మూఢ నమ్మకాలు ఎందుకు వెతుక్కుంటూ కూర్చుంటారు. ఈ బల్లి తన చెల్లి ఔరంగాబాదు నుంచి వస్తుందోనని తెలిసి నవ్వుకుంటోంది అంతే అన్నారు.
అక్కడున్నవారికి ఈ విషయం వింతగా అనిపించింది. ఏమిటి ఇది అనుకునేంతలో ఔరంగాబాదు నుంచి నూల్కర్ వచ్చాడు. వచ్చీ రాగానే మసీదు పక్కన వున్న చెట్టు కింద బండిని ఆపి గుర్రాన్ని చెట్టుకు కట్టేసి దానికి ఉలవలు పెడదామని గోతాం సంచి తీసి ఉలవలు కింద పోశాడు. అందులో నుంచి ఓ బల్లి బయటకు పరుగెత్తి వచ్చి గబగబా గోడమీదకు పాకింది. ఇందాకటి బల్లి, ఇపుడు వచ్చిన బల్లి కిచకిచలాడాయి. బాబా వెంటనే అదిగో చూడండి అన్నారు.
బాబాకు బల్లుల గురించి కూడా తెలుసా అని అందరూ గుసగుసలాడుకున్నారు.
ఒక రోజు రాత్రి హారతి తరువాత మహిల్సాపతి ఇంటికి వెళ్లడానికి బయలుదేరారు.
బాబా చూసుకుని వెళ్లు, ఈ లాంతరు తీసుకుని వెళ్లు. నీకు ఉపయోగపడుతుంది అన్నారు.
ఎందుకులే బాబా నేను వెళ్లిపోగలను అన్నారు.
నీవు వెళ్తావు కాని నీ దారిలో పాములు కూర్చుని ఉన్నాయి. వాటిమీద నీవు అడుగు వేస్తావు. అందుకే చెబుతున్నా అన్నారు.
బాబా మాట కాదనకూడదని మహిల్సాపతి లాంతరు తీసుకుని వెళ్లాడు. దారిలో ఒక నాగుపాము కనిపించింది.
బాబా మాట నిజమైంది అనుకున్నారు. కాని ఇంటికి వెళ్లి తలుపు తట్టబోయేసరికి కాలు పెట్టే చోట పెద్ద పాము పడుకుని ఉండి చప్పుడికి పడగ ఎత్తి చూసింది.
దాంతో మహిల్సాపతి బాబాకు నమస్కరించాడు.
కొద్దిసేపట్లోనే ఈ పాము వెనుతిరిగి వెళ్లిపోయింది. అమ్మో ఈ లాంతరు లేకపోతే ఆ పాము మీద కాలు వేసేవాడ్నే కదా అనుకున్నాడు.
అలా భూత భవిష్యత్తు వర్తమానాలను అందరినీ తెలిసినవాడు బాబా. అందుకే ఎవరు ఎలా పిలిచినా అలా పలుకుతాడు.

సదాశివ్ తార్కాడ్ అనే అతను మిల్లులో పనిచేసేవాడు. ఆ పదవికి రాజీనామా చేసి శిరిడీ వచ్చాడు. తిరిగి అతడు వెళ్లడానికి సాయిని అనుమతి అడిగాడు.
బాబా అప్పుడు నీవు పూనా మీదుగా వెళ్లు నీకు మంచి జరుగుతుంది అన్నాడు.
ఈ సంగతి అతని భార్యతో చెపితే ఇలా వెళ్లితే ఎక్కువ ఖర్చు అవుతుంది. మన్మాడ్‌మీదుగా వెళ్దాములే అంది.
సదాశివ్ మాత్రం ఏమీ వద్దు, ఖర్చు అయినా బాబా చెప్పినట్టే చేస్తాను. అది మనకు మంచిది అని పూనామీదుగా వెళ్లాడు. పూనాలో అనుకోకుండా ఆయనకు పాత మిత్రుడు కనిపించాడు. మాటల సందర్భంలో తాను ఉద్యోగానికి రాజీనామా చేసానని అన్నాడు. నేను నా మిల్లులో పనిచేయడానికి ఒక మేనేజరు కావాలని అనుకుంటున్నాను. ఇంతలో బాబా నీ దగ్గరకు ఒకరిని పంపిస్తాను, వారిని నీవు మిల్లు మేనేజరుగా పెట్టుకో, కలలో కనిపించి చెప్పారు. నేను కల కదా అనుకుంటున్నాను. బహుశా నా దగ్గరకు నినే్న బాబా పంపించాడేమో అన్నాడు. నీకే ఏమన్నా అలాంటి కల వచ్చిందా అని అడిగాడు ఆ పాత మిత్రుడు.
సదాశివ్ అప్పటిదాకా జరిగిన సంగతి చెప్పాడు అతని మిత్రునకు.
ఇద్దరూ బాబా సర్వాంతర్యామి అనుకుని బాబాకు నమస్కారం చేసుకుంటే చాలు మనకు కావాల్సినవన్నీ అయిపోతాయి అనుకుని సదాశివ్ నేను ఇక్కడే ఉండి నీ మిల్లులో పనిచేస్తాను అని అన్నాడు. చాలా సంతోషం బాబానే నిన్ను నన్ను చూసుకుంటారు.
-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743