భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదేంటి నాకు ఇలా కనిపిస్తోంది. ప్రక్కనే ఉన్న మహిల్సాపతిని అడిగాడు.
మహిల్సాపతి ఏముంది? మీరు మీ మనసులో ఘోలప్ స్వామిని దర్శించాలని అనుకున్నావు కదా. అందుకే ఈ రూపంలో సాయి నీకు కనిపించాడు. అంతే మనమేది అనుకుంటే ఆయన ఆ రూపంలో కనిపిస్తాడు అని మహిల్సాపతి శాస్ర్తీకి చెప్పాడు.
అదంతా వింటున్న బూటీ బాబా అజ్ఞానంతో మనమేదైనా తప్పులు చేస్తే ఊరుకుంటాడు. మనకు తెలిసేలా పనులు చేస్తారు. కాని మీకు తెలియనివన్నీ ఏమీ లేదని రాదని వాదులాడడం బాబాకు ఇష్టం ఉండదు. పైగా బాబా ఎవరు ఏమి కోరుకుంటారో వారికి ఏ రూపమే కనిపిస్తుంది. దానివల్లనే నీకు ఘోలప్ స్వామిగా నీకు కనిపించారు అని దాసగుణు అబ్బాయికి వివరం చెప్పాడు. నీవు అదృష్టం పండిన వాడివి. నీకు ఏది కావాలంటే అది చేస్తారు బాబా అని చెప్పారు. నువ్వు కూడా అర్థం చేసుకోకుంటే ఎలా అని ఎంతో అమాయకంగా బాబా అడిగారు. అంతలో పండిట్ కాకా మహరాజ్ కాకా మహారాజ్ అని అరుస్తూ ముందుకు వెనక్కు తిరుగుతూ ఇప్పుడే కదా ఇక్కడ కాకా ఉన్నారు. ఇపుడు ఈ బాబా ఉన్నారేమిటి అని అక్కడివారిని అడిగారు. అపుడు బాబా చెప్పిన సంగతి ఇపుడు ఈ పండిట్ చేస్తున్న చర్య అర్థమయి వారంతా ఇక్కడ ఉండేది బాబానే. నీకు మాత్రం కాకా మహారాజ్‌గా కనిపించారు అని చెప్పారు. ఆశ్చర్యపోయిన పండిట్ ఆనాటినుంచి బాబా భక్తుడయ్యాడు.
ఒకసారి సగుణ మేయర్ నాయక్ అనేవాడు నర్సోబావాడి అనే క్షేత్రం వెళ్లాడు. అక్కడ అతనికి శ్రీవాసుదేవానంద సరస్వతి కనిపించాడు. అనుకోకుండానే అతడికి చేతులెత్తి నమస్కరించాడు సగుణ మేయర్. వాసుదేవానంద సరస్వతి నీకేమి అయ్యా నీవొక మహానుభావుని దర్బారుకు చెందినవాడివి కదా. ఇక నీకు కావాల్సినది ఏముంది? అన్నాడు. వాసుదేవానంద భారతి మాటలు సగుణ్‌కు ఏమీ అర్థం కాలేదు. తన స్నేహితులతో వచ్చాడు కనుక ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్లిపోయాడు. కాని కాలేజీకి వెళ్లినా అక్కడి అతని నాస్తిక స్నేహితులు భగవంతుడనే వాడే లేడు అని చెప్పేవారు. వారు దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ ఏవో ఒక ఆధారం చూపేవారు. అది హేతుబద్ధంగానే అనిపించేది. కాని సగుణ్‌కు మనసులో భగవంతునిపైన నమ్మకం ఉండేది. వీరు చెప్పగానే ఆ నమ్మకం సడలినట్టు అనిపించేది. కాసేపు భగవంతుడు ఉన్నాడా లేడా అన్న సందేహం కొట్టుమిట్టాడేవాడు. కాసేపు భగవంతుడు ఉన్నాడని తన మనసు చెప్పే మాటలు నిజమని అనుకుంటూ భగవంతుని నన్ను కాపాడమని చెప్పేవాడు.
మరి కొద్దిసేపట్లోనే తన స్నేహితులు హేతువాదులు భగవంతుడు లేడని అంటే తాను గట్టిగా, తాను అనుకున్నదాన్ని చెప్పలేకపోయేవాడు. తరచు వాళ్ళు తండ్రి దగ్గరకు అన్యమనస్తకమైన మనసుతో బాధపడుతూ ఉండేవాడు. తరచు వాళ్ల తండ్రి దగ్గరకు వచ్చి భగవంతుడు ఉన్నాడా? ఉంటే తనకు ఎందుకు కనిపించడు. నా స్నేహితులు ఎందుకిలా మాట్లాడుతున్నారు అంటూ అడిగేవాడు. ఆ తండ్రి ఎంత చెప్పినా వీనికి స్థిరమైన నమ్మకం కలుగలేదు. దాంతో ఆయన నీవు ఒకసారి శిరిడీ వెళ్లు, అక్కడ బాబా ఉన్నారు. ఆయన అయితే నా సందేహాలను పటాపంచలు చేసేస్తారు వెళ్ళు అని చెప్పారు.
తండ్రి చెప్పినట్లు సగుణ్ బాబా దగ్గరకు వెళ్ళాడు. బాబా చూసి చూడగానే
‘‘సగుణ్ ఎందుకు నీకు అంత అనుమానం. తప్పక భగవంతుడు ఉన్నాడు. అదే నిజం. అయినా నీకు అనుమానం ఎందుకు కలుగుతుంది. మనం ఇంతకుముందు కలుసుకున్నపుడు నేను చెప్పాను కదా. అప్పుడే నా దగ్గరకు వస్తావా అని అడిగాను. నీవు తర్వాత వస్తానని అన్నావు కదా. మరి ఇన్ని రోజులకు వస్తావా నా దగ్గరకు నీవు? అయినా నీ స్నేహితులు ఏదో అంటే అదే పట్టుకుని సందేహం ఎందుకు? అసలు నీవు జీవిస్తున్నావు అంటే ఏమిటి?
భగవంతుడు నీలో ఉన్నట్టే కదా’’ అని గబగబా మాట్లాడేసాడు.
మొట్టమొదటిసారిగా చూస్తున్నానని అనుకుంటున్న సగుణ్‌కు ఇంతకుముందు ఎక్కడ కనిపించాను. నేను తర్వాత వస్తానని ఎప్పుడు చెప్పానా అని ఆలోచన మొదలైంది. అంతేకాక బాబాను చూస్తున్నపుడు ఎన్నో ఏళ్ళనుంచి పరిచయం ఉన్నట్లుగా అనిపించింది.
-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743