భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే ఆయన మూడు కిలోల మిఠాయిని కొని ముగ్గురూ కలసి మసీదు వెళ్లారు.
వీళ్లు వచ్చీ రాగానే ఆ గోవింద్‌రాజును బాబా పేరు పెట్టి పిలిచాడు. ఇదంతా ఆ ప్రశ్నల మహిమనే అనుకుని గోవింద్ సంతోషంతో బాబా దగ్గరకు వెళ్లాడు. ఓ ప్రసాద్ ఇలా రా.. ఇదిగో ఈ మూడు కిలోల స్వీట్లు నీవే తినేసేయ్, ఇంకా కావాలంటే ఆ మూర్తికి కూడా పెట్టు చాలు. ఇక ఎవరికీ ఏమీ ఇవ్వక్కర్లేదు అని అన్నాడు.
గోవిందరాజు ఆయనతో వచ్చినవారు, మసీదులో అంతకుముందు ఉన్నవారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. గోవిందరాజు బాబా నాకు అర్థం కావడంలేదు అని చెప్పాడు.
బాబా చిరునవ్వు నవ్వారు.
ఇక ఇలాంటివాళ్ళు చాలామంది బయలుదేరుతారు. ఇపుడే ఓ ముసలామె వచ్చింది. ఆమె పది రోజుల నుంచి నాకు మంత్రోపదేశం చేయమని నన్ను అడుగుతోంది. నాకే మంత్రాలు రావని చెప్పినా వినలేదు. అదుగో ఆమె కూడా వస్తోంది చూడండి అని బాబా అన్నారు.
అంతలో ఆ ముసలామె కూడా వచ్చింది. రాగానే బాబా ఈ రోజు అయినా నా కోరిక తీరుస్తావా లేదా అని అడిగింది.
బాబా వెంటనే కోపం తెచ్చుకున్నారు. ఏంటమ్మా నీ కోరిక తీర్చేది మామూలుగా చెప్తే అర్థం కావడంలేదా నీకు.
ఇదిగో ఇపుడే చెప్తున్నాను చూడండి. రాబోయే రోజులు అన్నీ కలితో నిండినవే. అదిగో పులి అంటే ఇదుగో తోక అనేవాళ్లే ఎక్కువగా ఉంటారు. వారు ఏది చెప్పినా నమ్మకండి. నేను ఎవరికీ ఏమీ చెప్పను. భవిష్యత్తు అసలే చెప్పను. మీరు మంచి పనులు చేస్తే మీకు అంతా శుభమే కలుగుతుంది. మీరు చెడు పనులు చేస్తే మీకు కష్టాలు తప్పవు. నేను ప్రశ్నలకు జవాబులు చెప్పను. భగవంతుడిని సంపూర్తిగా నమ్మితే మీకు ఏ కష్టాలు రానే రావు. మీ పూర్వజన్మ సంస్కారంవల్ల కష్టాలు వచ్చినా మీరు ఇపుడు చేసే మంచి పనులవల్ల ఆ కష్టాలు అంతగా మిమ్మల్ని నొప్పించవు. అంతేకాని ప్రశ్నావళులు పట్టుకుని తిరగవద్దు. అట్లాంటి వారు చెప్పేవి మీరు ఏమీ వినవద్దు అని గట్టిగా చెప్పారు.
నాకు నా గురుదేవుడు ఏ మంత్రమూ కూడా నాకు చెప్పలేదు. నేను మీకు చెప్పను. భగవంతుడి నామోచ్చారణననే పెద్ద మంత్రం. ఎవరికిష్టమొచ్చినా భగవంతుణ్ణి వారు పూజించుకోవచ్చు. ఆ నామాన్ని తలచుకోవచ్చు. జపించుకోవచ్చు. అంతేకాని నా పేరు చెప్పుకుని మీరు నానా యాగి చేయవద్దు. నిజమైన నా భక్తులు ఎప్పుడూ ఇట్లాంటి వ్యసనాలకు బానిసలు కారు. నన్ను నమ్ముకున్నవారు ఎంతటి ఆపదలో ఉన్నా వారిని నేను కాపాడుకుంటాను. కాని నాకు సహాయకులను ఎవరినీ నేను పెట్టను. నేను వెళ్లలేని ప్రదేశం లేదు. నేను చూడని అంశమూ లేదు. కనుక ఎక్కడ ఎవరు ఏమి చేసినా వాటినన్నింటినీ నేను చూడగలను.
ఇక్కడ నేను లేను కదా అని నా గురించి చెప్పి ఇతరులను నొప్పిస్తే అట్లాంటివారిని నేను చూస్తూ ఊరుకోను అని గట్టిగా చెప్పారు.
అక్కడే ఉన్న మూర్తి, ప్రసాద్‌లకు తమ తప్పు తెలిసింది. వారు వెంటనే వచ్చి ‘‘బాబా మమ్ము క్షమించు. ఇంక ఇలాంటి పనులు చేయము. బాధపడేవారికి కాస్త ఉపశమనం ఇద్దామని దీనిని మేము తయారుచేసాము’’ అని పరిపరివిధాల వేడుకున్నారు. సరే ఇది మీ మొదటి తప్పుగా భావిస్తున్నాను.
ఇకపై ఏ రకమైన తప్పు చేసినా నేను మిమ్ములను దండిస్తాను అని అన్నారు. అపుడు గోవిందురాజు వచ్చి బాబా నేను కూడా నీపై మొత్తం భారం వేసేశాను. ఏది చేసినా ఇక నీదే భారం. నన్ను పాలముంచినా నీట ముంచినా నీవే దిక్కు అని నమస్కారం చేశాడు.
నా భక్తులను ఎట్లా కాపాడుకోవాలో నాకు తెలుసు. కనుక నేను ఎప్పుడు ఎవరికి ఏమి చేయాలో దానిని వారు అడిగినా, అడగకపోయినా చేస్తాను అన్నారు.
అట్లా చెప్పేసి వెంటనే బాబా గద్దెపై వౌనంగా కూర్చున్నారు. గంభీర వాతావరణం చల్లబడింది.
సాయిబాబా తత్వం తెలుసుకొందామని చాలామంది శిరిడీ వస్తుండేవారు. సాయిని పరీక్షిస్తామని మరికొందరు శిరిడీ వస్తుండేవారు. మరికొంతమంది సాయికి ఎన్ని విద్యలు వచ్చో తెలుసుకొందామని వస్తుండేవారు.

-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743