భక్తి కథలు

కాశీ ఖండం..57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాదరక్షలు, గొడుగులు, వీవనలు, వస్త్రాలు, కంబళ్లు దానమిస్తాడు. రోగార్తులకి ఉపచర్యలు కావిస్తాడు. ఆపదలు ఎదురయే అడవి తోవలు దాటించడానికి బంటుల్ని తోడు పంపిస్తాడు. విశేషించి కాశీ పట్టణానికి ఏగు యాత్రికులకి సత్కారాలు మెండుగా చేస్తాడు.
ఇన్ని తెరగుల ఉపకృతులచేత, ఉపచారాల చేత సంతృప్తి పొంది తీర్థయాత్రలు సల్పు యాత్రికులు ప్రతిదినమున్ను హోమ విధులు ముగించుకొని జపములు పూర్తిచేసుకొని, భోజనానంతరమున్ను ఆ పింగలాక్షుణ్ణి నవనీత సమానమైన నిండు మనస్సుతో ఆశీర్వచిస్తూ వుంటారు.
ఈ విధంగా దక్షతతో పింగాక్షుడు తీర్థయాత్రికుల్ని సంతతం రక్షిస్తూ వున్న కారణంగా ఆ అడవి కొన్ని నాళ్లు నగరంవలె విలసిల్లింది.
అనంతరం ఒకనాడు ఆ పింగాక్షుడి పినతండ్రి తారాక్షుడు- తానున్ను బోయ అవడంవల్ల అడవి తెరువులు కొట్టి తీర్థయాత్రాపరులైన మాసిన వసనాలు తాల్చిన వైశ్యుల్ని నిలువునా దోచుకున్నాడు. అంత ఆ బాటసారులు కలత చెంది ఆర్తనాదాలు చేయ మొదలుపెట్టారు. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ప్రళయ కాల మాయా వరాహ రూపుడు విష్ణుదేవుడు ఒనర్చిన కంఠ ఘర్ఘర ధ్వనిని పోలిన ఆ దుఃఖారావాలు ఆలించి పింగాక్షుడు ఉచ్చైస్వరంతో ‘సార్థవాహులారా! వెరవవద్దు, నేనుండగా మీకు భయం ఎందుకు?’’ అని తన పేరు చెప్పి అర్జునుడు కురు సైన్యంపైన కవిసిన చందంగా ఆక్రమించి, పుంఖానుపుంఖంగా నిశిత విశిఖాల పరపించి, ఆ దారిదోపిడీ గాండ్రని పారద్రోలి, భీతి పొందకుండా సార్థవాహుల్ని అడవి దాటించి పంపించివేశాడు.
కాని శత్రువులైన శబరజాతి వీరభటుల శరాసనాలనించి వెలువడ్డ వాడి అమ్ములచే జల్లెడగా చేయబడి వీరస్వర్గం అలంకరించాడు. అయినా పరోపకార పుణ్యఫలంగా ఈ లోకపాలక పదవిని అధిష్ఠించి నిరృతి అయాడు. విప్రోత్తమా, ఇది నిరృతిలోక వృత్తాంతం.
వరుణలోక వృత్తాంతము
ఈ నిరృతి జగానికి ఉత్తర దిశగా వరుణదేవుడి లోకం వుంది. ఈ వరుణలోకంలో సప్త సంతానాలు నెలకొల్పిన పుణ్యాత్ములు వసిస్తారు. నూతులు త్రవ్వించినవారు, తటాకాలు నెలకొల్పినవారు, పద్మసరస్సులు, ఉద్యానవనాలు కల్పించిన పుణ్యాత్ములు ఈ వరుణ లోక వాసులు అవుతారు.
బాలచంద్ర కళాధరుణ్ణి నిరంతర ధారా కుంభం నియమవ్రతంగా నిల్పిన సజ్జనుడు వరుణలోక నివాసం పొందుతాడు. తియ్యని పంచదార పానకాలు విప్రపుంగవులకి పోసి తనిపి ఈ పుణ్యశాలి వరుణలోక వాసి అవుతాడు.
త్రాగునీరు లభించని తావుల చల్లని చలిపందిరులు లేక చలివేంద్రాలు నెలకొల్పి బాటసారుల దప్పిక తీర్చు భాగ్యవంతుడు వరుణలోక నివాసానికి నోచుకుంటాడు. తీర్థయాత్రాపరులకి జలకుంభాలు, పాదరక్షలు సమర్పించిన అదృష్టవంతుడు వరుణలోకంలో సుఖముంటాడు. నదీ, ప్రవాహాల్లో పడికొట్టుకొని పోతూవున్న ప్రాణులను కాపాడిన అనఘుడు వరుణలోక వాసి అయి సకల సుఖాలు వేడుకతో అనుభవిస్తాడు.
వరుణోత్పత్తి
ఈ వరుణలోక పాలకుడు వరుణుడు, ఇతను జలాశయాలకి అధీశ్వరుడు. జలచరాలకి రాజు. సర్వకర్మలకి సాక్షి. ఇతడి వ్యుత్పత్తిని శ్రద్ధగా విను. కర్దమ ప్రజాపతి నందనుడి పేరు శలచిష్మంతుడు. ధీరత్వ, మధురత్వ, విశారదత్వాది గుణ సంపపన్నుడు. ఆ శుచిష్మంతుడు చిరుతప్రాయంలో సంగడీండ్రతో కూడి అచ్చోదం అనే సరస్సులో జలక్రీడలాడుతూ ఒక పెను మొసలిచేత పట్టుపడ్డాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి