భక్తి కథలు

కాశీ ఖండం..20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరికొన్ని ఎండలతో, ఇంకా కొన్ని భరింపనలవికాని చలిగాలులతో చేతనం కోల్పోయి వున్నాయి. జగాలకి అకాండ ప్రళయం ఆవిర్భవించింది. ఈ కాశీక్షేత్రం కల్పాంతకాలంలో అయినా కసుగందక వుంటుంది కనుక ఆ ఉత్పాతం ఇక్కడ కనపడదు. మేము అందరం ఈ మహోపద్రవాన్ని ఉపశమనం కోరి అబ్రహ్మణ్యం చేస్తూ పద్మ సంభవుడిని శరణుచొచ్చాం. ఆ బ్రహ్మదేవుడు మాపై కరుణించి, ఈ ఉత్పాతాన్ని తొలగింపగల సమర్థుడు మైత్రావరుణుడు ఒక్కడే. ఆ మహర్షి కాశీ క్షేత్రంలో వున్నాడు. ఆ మహర్షిని ప్రార్థించండి’’ అని నీ వున్న తావు చెప్పి పంపగా మేము ఇక్కడికి చనుదెంచాము. ఇకమీద జరుగతగిన కృత్యానికి ఒక్క హుంకృతిలో స్వర్గ సింహాసనస్థుడయిన నహుషుడిని పుడమిపై పడగొట్టిన మహానుభావుడివి నువ్వే ప్రమాణం.
ఎవడు స్వభావ కఠినుడో, ఎవడు సన్మార్గరోధి (నక్షత్రాలని అడ్డగిస్తాడో- అని కూడా అర్థం) ఎవడు ఈర్ష్యాళువై తన కంటే అధికుడితో కలహానికి కాలుత్రవ్వుతాడో అట్టివాడి వున్నతులు అశాశ్వతాలు. నిలుకడ లేనివి అని పలికిన బృహస్పతి పలుకులు ఆకర్షించి ఆ మునివతంసుడు ఈ విధంగా వాకొన్నాడు. ‘‘ఈ కార్యం చక్కబెట్టడానికి యత్నిస్తాను. మీరు మీ మీ నివాస స్థలానికి ప్రీతితో వెళ్లండి. ఇడుగో వున్నాడు కదా- పార్వతి, తాను కాశీ భర్త! మన పాలిటి కల్పతరువు!’’ అని చెప్పగా ఆ దేవతలూ మునులూ ‘‘మహాప్రసాదం’’ అని గంటూ అగస్త్య మహర్షిని ఉచిత రీతిని వీడ్కొని తమ తమ నివాసాలకి ఏగారు. వారు చనిన పిమ్మట అగస్త్యుడు లోపాముద్రని కని, ఈ కరణి వచించాడు.
అగస్త్యుడు కాశీ వియోగానికి పరితపించుట
‘‘దేవీ! మనుజుడొకటి తలిస్తే దైవం వేరొకటి సంకల్పిస్తాడు. ఈ మాట తథ్యం. నేను కాశిని విడిచిపెట్టనని సంకల్పించుకోగా శివుడు నన్ను కాశిని వదలివెడలునట్లు చేస్తున్నాడు
ఆ సమయానికి కాదనలేక అంగీకరించాను కానీ, ఇంతింత పెద్ద పనులు రుషులు చేయుట కనువైనవా? ఆబోతూ ఆబోతూ క్రుమ్ములాడుకుంటూ వుంటే- ఆ రెంటి నడుమ చిక్కుకొన్న లేగదూడ పరిస్థితి నాకు దాపురించింది!
విమర్శించి చూడ ఆశ్చర్యకరంగా వున్నదే! ఇంద్రుడి కొండలకి భీతిల్లుతాడా? యుగాంతంలో ఉర్రూతలూగింపజాల పవనుడు గిరులని దమింపచాలడా? సమస్త ప్రాణుల్ని శాసించ సమర్థుడైన యమధర్మరాజు శక్తి శైలాన్ని శిక్షింపలేడా? అగ్నిదేవుడి దాహకత్వం కొండని స్తంభింపచెయ్యడానికి శక్తి చాలవాడా? ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, మరుద్గణాలు, తుషితులు, ఈ దేవతలొక్కొక్కరు ముజ్జగాలని మ్రింగి ఉమియచాలుతారు. అంతటి వారందరు వింధ్యగిరి గర్ప సంరంభాన్ని అణచలేకపోయారా? కామధేనువుని తన పెరటిలో కట్టినవాడు, తన ఉద్యానవనంలో కల్పతరువులు కల సర్వసమర్థుడు దేవేంద్రుడు ప్రార్థించాడట? నేను ఈ మాత్రము కార్యానికి సమ్మతింపకుండటం ఎలా?
పూర్వం ఏకార్ణవం కాగా మధుకైటభులు తమ మాటకి కట్టుబడి హరి చేత మరణించారు? గరుడి మొగమాటమివల్లనే కదా విష్ణుదేవుడిని వీపు ఎక్కించుకొన్నది. సామోపాయంవల్లనే కదా విష్ణువు అణగత్రొక్కగా బలి చక్రవర్తి పాతాళనిలయంలో అణిగి వున్నది? విశ్వాసంవల్లనే కదా వృత్రాసురుడు సముద్రం వారు ఇంద్రుడి చేత సంహరింపబడినది? చొరవతో ఉపకారం చేస్తే మేలైనా వస్తుంది. కీడైనా వస్తుంది. మనస్సులో దేనికీ జంకకూడదు. వాడు ఒనర్చి ధర్మమే వాడిని కాపాడుతుంది. కేవలం కీర్తి ఒక్కటే చాలదా? మనం కాశీనగరంలో పురాణాల ముఖంగా నిరంతరం ఏవో అంతరాయాలు సంభవిస్తూ వుంటాయి అని వింటున్నాము.
-ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి