భక్తి కథలు

కాశీ ఖండం.. 83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వజ్ఞుడు అయిన మా తండ్రి ఆ జగన్మాతకి ఆనతిచ్చిన ప్రకారం నీకు చెపుతాను, ఏకాగ్రమతివై ఆకర్ణించు.
వారణస్వాది నామ నిర్వచనము
బ్రహ్మదేవుడి ఆయుర్దాయవసాన కాలంలో సమస్త లోకాలను మ్రింగి ‘మాయ’ వికల్పాలు లేనిదై తన్ను ఆశ్రయించింది. అంత పరమాత్మ అలలు లేని సముద్రమై అన్ని హద్దులు కలదై ప్రాణుల కర్మలు పండే కాలం ప్రాప్తించేదాకా మిన్నక వుంది.
ఆ సమయంలో బ్రహ్మ సృష్టి ఆకాశం ఒక్కటీ తప్ప మిగిలిన భూతాలు కరగిపోయాయి. చీకటి మాత్రం దట్టంగా క్రమ్మివేసింది. ఆ అంధకారంలో సత్తు, అసత్తు, సదసత్తును శూన్యమై ఏమీ తెలియరాదయ్యెను. ఏమి చెప్పేది?
సూర్యచంద్ర గ్రహ నక్షత్రతారకలు లేని దీన్ని, రేయింబవళ్ల విభాగం లేనిదిన్నీ, నిప్పు, నీరు, గాలి లేనిదిన్నీ, ప్రకృతి లేనిదిన్నీ, శబ్ద స్పర్శగంధ రూపరహితం అయినదిన్నీ, దిశాముఖాలు లేనిదిన్నీ, అంధకారం మాత్రమే మిగిలినదన్నీ అయి వుండగా బ్రహ్మాండం శూన్యం అయిపోయి కేవల భావాన్ని పొంది వుంది.
నామరూప వర్ణములు లేనిదిన్నీ స్థూలం కానిదిన్నీ, కృశంకానిదీ, హ్రస్వం కానిది, దీర్ఘంకానిదిన్నీ, లఘువు కానిదిన్ని, చిక్కులు లేనిదిన్ని, బలియడం లేనిదీ, ఆవాజ్మానసగోచరమున్ను, సచ్చిదానంద రూపమున్ను, అప్రమేయమున్ను, ఆధారరహితమున్ను, నిర్గుణమున్ను, నిర్వికల్పమున్ను, నిరాలంబమును మాయారహితమున్ను, ఉపద్రవాలు లేనిదిన్నీ అయిన పరబ్రహ్మ ఉదాసీనత్వం పొంది నిష్కళమై విహరిస్తుంది.
లీలా విశిష్ట కేవల భావంతో అలోక వ్యవస్థని ఆదరించి, నిజ శరీరంలో ఒక శక్తిని కల్పించాడు. ఆ శక్తి ప్రకృతి స్వరూపవు అయిన నువ్వే. ఆ పరబ్రహ్మం పురుష రూపుడైన నేను. కళ్యాణీ ఆ ఆదికాలంలో-
ఓ ఉత్పలలోచనా! ఉండడానికి తావు ఎక్కడా లేక మనం ఇద్దరం అవిముక్త మండలం చేరుకొన్నాం. ఆనాడు ఆదిగా నేడున్నూ కాశికాపురంలో ఆ అవిముక్త స్థానంలో ఉన్నాం.
ముగ్థనేత్రా! సంతతం మనం దీనిని విడిచి పెట్టకపోవడంవల్ల ఇది అవిముక్తం అయింది. మనకు ఆనందప్రదం కనుక ఆనందకాననం అని పేరు వచ్చింది.
మహాశ్మశానాల్లో నివసిస్తాను కావున నేనుండటంవల్ల మహాశ్మశానం అను పేరు కలిగింది. ఓరంత ప్రొద్దు రుద్రుణ్ణి అయిన నేను నివసిస్తాను కనుక రుద్రావాసం అనే నామం కలిగింది.
అసినదీ వరణానది సంగమిస్తాయి. ఆ రెండు నదుల వర్ణాల చేరికలో అర్థసమత్వం వల్ల వారణాసి అనే సంజ్ఞ ఏర్పడింది. ‘కాశ్యదీప్తా’ అనగా ‘కాశ్య’ అనేది దీప్తా- దీప్తియందు వర్తిస్తుంది అనే విఖ్యాత ధాతువు చేత, ధరణీస్థలిలో కాశి అయింది.
కల్పాంతవేళల్లో కూడ ప్రకాశిస్తుంది కనుక కాశి (కాశతే ఇతి కాశీ) నక్షత్రాలు, గ్రహాలు, తారకలు, అడవులు, నదులు, సముద్రాలు, సమస్త పర్వతాలు, దిక్కులతో కూడిన భూమీ చక్రం కాలవశం చేత నశించిపోయిన తరిని మనం సుఖముండడానికి ఈ కాశీ క్షేత్రం శాశ్వతం అయి లభించింది.
శివభక్తుడు, పరమశాంతుడు, శ్రద్ధాళువు, ఆస్తికుడికి, పాపవాసనలు సోకని వ్యక్తికి, ముముక్షువుకి తప్ప ఈ రహస్యాన్ని ఎవ్వరికిని చెప్పవద్దు అని భవుండు భవానికి ఆనపెట్టాడు. ఇకపైన మణికర్ణికా మహాత్మ్యం వినవలసింది.
మణికర్ణికా మహాత్మ్యము
నిండు హృదయంతో హిమశైల కన్యా, తాను కాశీనగరంలో కాపురం వుండి, కుటుంబ భారం పరాకాష్ఠ పొందింది.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి