భక్తి కథలు

కాశీ ఖండం..22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంసార సాగరం తరించే సాధనం కనుక ‘తీర్థం’ అయింది. ఆభ్యంతరం అయిన ఈ అవిముక్త తీర్థం- కాశీతీర్థం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఉపలబ్ధి స్థానం అయినందువల్ల ఆ త్రిమూర్తులకి సాధారణమే అయినా మహేశ్వరుడికి ప్రధాన స్థానం అయి వుంటుంది.
నేను ఆత్మని ఏ రీతిగా తెలుసుకొంటాను? అని పూర్వం యాజ్ఞవల్క్యుడిని అత్రి మహాముని ప్రశ్నించాడు. కాశీ క్షేత్రంలో ఆత్మ ఉపాస్యం అని ఆ యాజ్ఞవల్క్య ముని అత్రికి ఆనతిచ్చాడు. ఆ అవిముక్తం ఎక్కడ ఆశ్రయించుకొని వుంటుంది? అని అత్రి మళ్లీ యాజ్ఞవల్క్యుని అడిగాడు. వరుణలోను అసిలోను అది నిండువారి వుంటుందని అత్రి మహర్షికి తెలియచెప్పాడు. కనుబొమ్మల నడిమి ప్రదేశమే అది, వరుణ సంసార దోష నివారణము నాశి ఇంద్రియ దోష వినాశమూ చేస్తాయి కనుక ఈ విధంగా నిర్వచింపబడినది. లోపలిదైన అవిముక్త క్షేత్ర దర్శనం సుషమ్నా నాడిలోని ప్రాణవాయువుని జయిస్తే కాని సిద్ధింపదు.
ప్రకృతి రూపిణి అయిన కుండలినీ శక్తికి మహత్తత్వం, బుద్ధితత్వం మొదలైన వికృతులు అనే చుట్టలు ఏడు. సర్పాకారం కల ఆ కుండలిని నోరు విప్పి సుషమ్నానాడి మూలంలో వున్న రంధ్రాన్ని కప్పి, వెనె్నముకని పెనవేసికొని పైకి ప్రాకి తన తోక చివరి భాగంతో బ్రహ్మరంధ్రాన్ని కప్పి వుంటుంది. ఈ విధంగా సుషమ్నానాడి మూలరంధ్రాన్ని, పై రంధ్రాన్ని కుండలిని తలచేత, తోక చేత కప్పి వుంచడంవల్ల- ప్రాణవాయువు నేరుగా సుషుమ్నానాడిలో ప్రవేశించడానికి వీలుచిక్కదు. సుషమ్నా నాడి యొక్క కుడి ఎడమ ప్రక్కలందు వున్న ఇడా, పింగళి నాడుల్లోకి క్రమంగా ప్రవేశిస్తూ వెలుపలకి వస్తూ వుంటుంది. సుషుమ్నాకి ఎడమ వంక ఇడానాడి వుంటుంది. కుడి వైపు పింగళనాడి వుంటుంది. కనుక యోగ సాధకుడు పై రెండు నాడుల ద్వారాలూ మూసివేసి నడుమ వున్న సుషమ్మా నాడి వాకిలిని తెరవటం ఎప్పుడు నేర్వగల్గుతాడో అప్పటికి కాని అతడికి ప్రాణవాయువుని వశం చేసుకోవడం సాధ్యం అవదు.
ఓ చంద్రబింబవదనా! ఇడానాడి ఎడమ నాడి. ఇది సుషుమ్నానాడికి ఎడమ భాగమందు వుంటుంది. పింగళ అనే నాడి దక్షిణనాడి. అంటే కుడి నాడి, ఇది సుషమ్నకి కుడి పార్శ్వంలో వుంటుంది. ఈ ఇడాపింగళనాడుల రెంటికీ మధ్య సుషుమ్నా నాడి వుంటుంది. ఈ మూడు నాడులకీ త్రిమూర్తులు దైవతాలు. ఓ పద్మదలాక్షీ! లోపాముద్రా! విష్ణుమూర్తి ఇడానాడికి దైవతం. పింగళకి బ్రహ్మదైవతం సుషమ్నా నాడికి చంద్రాకళాధరుడు- అంటే శివుడు అధిపతులు అని పెద్దలు వక్కాణించారు. ఇక ప్రాణులు పీల్చే ప్రాణవాయువుకి సుషమ్నా నాడిలో ప్రవేశించడం లక్షణంగా కల యోగ విద్య వివరిస్తాను. ఏకాగ్ర చిత్తంతో వినవలసింది. బ్రహ్మ నివసించే లోకం అయిన సత్యలోకాన్ని ప్రవేశించే వాకిలి అవడంవల్ల సుషమ్మానాడి ‘బ్రహ్మనాడి’ అనే నామంతో వ్యవహరింపబడుతుంది. తొంభై ఆరు అంగుళాల ప్రయాణం కల శరీరంలో నట్టనడుమ త్రికోణా ఆకారం కలది అయిన కోడిగ్రుడ్డు చందంగా వుండేది ‘కందస్థానం’ అనబడుతుంది. నాభి కేంద్రానికి (బొడ్డు దుంపకి) క్రిందట కుండలినీ శక్తి అధిపతి వుండే నెలవు. కుండలినీ శక్తి అంటే సర్పాకారంగా వుండేప్రథమధమని లేక మొదటి నాడి. ఆ కుండలీ శక్తి మూలభూతం అయిన ప్రకృతి. మహత్తు, అహంకారం- ఆదిగా కల ప్రకృతి పరిణామాలు ఏడున్నూ ఆ కుండలీ శక్తి శరీర వలయాలు. ఆ సర్పాకృతి అయిన కుండలీ శక్తి బ్రహ్మనాడి లేక సుషుమ్నాధమనిని పెనవేసుకొని వుంటుంది. ఆ కుండలీ శక్తి తన ఎనిమిది వలయాలతో గిటగిటలాడుతూ ఫాలప్రదేశం వరకూ ప్రాకుతుంది.
-ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి