భక్తి కథలు

కాశీ ఖండం.. 113

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విధంగా రిపుంజయుడు ప్రజాపరిపాలనం పరమ ధర్మబద్ధంగా ప్రభు, మంత్ర, ఉత్సాహశక్తి త్రయంతో సామదాన భేద దండ చతురుపాయాలతో, సంధి, విగ్రహం, యాన, ఆసన, సంశ్రయ, ద్వైదీభావం అనే షడ్గుణాలనీ కాలం ఎరిగి ప్రవర్తింపజేస్తూ పెద్దకాలం రాజ్యాన్ని పాలించాడు. చాతుర్వర్ణ్యాలు, నాలుగు ఆశ్రమాలున్ను తమ తమ ధర్మాలు వీడక ప్రవర్తించాయి.
అప్పుడు దేవతలు ధరావియోగ వేదనవల్ల బాధింపబడుతున్న మానసులై దేవ గురువైన బృహస్పతిని ముందు వుంచుకొని, మంత్రాలోచన చేసి, ఆ దివోదాసుకి రాజపదం పోగొట్టడం ఏ విధంగా కావింతుమో అని కార్యాలోచన చేయసాగారు. అప్పుడు కార్యాన్ని లేక కర్తవ్యాన్ని నిర్థరించి, బృహస్పతి ఇంద్రాది దేవతలతో ఈ భంగి వచించాడు.
ప్రాణపాన వ్యానోదాన సమానాలు అనే ప్రాణాలు అయిదున్నూ తృప్తిపొందేటట్లు చేయగలిగేది అన్నం. ప్రాణం, అన్నం అనేవి పర్యాయపదాలు- అగ్ని మనలో ఒక దేవత అవునా? కాదా? వాయుదేవుడు మనం చెప్పినట్లు చెయ్యడా? వరుణదేవుడు ఎవరివాడు? (మనవాడే అనడం)- ఈ అగ్ని, వాయువు, జలాధిదేవత అయిన వరుణుడు- ఈ ముగ్గురు లేక అన్నం ఏ విధంగా మానవులకి లభిస్తుంది?
వరుణుడు, వాయువు, అగ్ని, ముగ్గురూ తమ తమ శక్తుల్ని ఉపహరించితే వంట కుండలో పచనక్రియ సాగదు. పచన క్రియ సాగనప్పుడు అన్నం వుడకదు. అన్నం ఉడకనప్పుడు వైశ్వదేవ బలిహరణాది క్రియలు కుంటుపడిపోతాయి. హవ్యకవ్య క్రియలు లేని భూసురులు రాజుల యెడ విరక్తులవుతారు. వారి మనస్సులు విరిగిపోతాయి. విప్రులు విరక్తులయితే తక్కిన వర్ణాలవారున్ను వైరాగ్యాన్ని పూనుతారు. రాజు ప్రజారంజకుడు కావాలి కదా! కశం, దుర్గం మొదలైన సప్తాంగాలు క్షీణించినపుడు ధర్మార్థకామాలు అనే త్రివర్గం నశిస్తుంది. త్రివర్గం నశిస్తే ఉభయ లోకాలకి కల లంకె తెగిపోతుంది.
మొట్టమొదట కాశీ దేశంలో అగ్నిదేవుడు తన దాహశక్తిని ఉపసంహరించాలి. అగ్ని లేనపుడు అన్నం ఉడుకదు. అన్నం ఉడుకకపోవడవంల్ల రాజు, ప్రజలు ఎట్లు బ్రతుకుతారో చూద్దాము.
ఆ భూరమణుడు తీక్షణకిరణుడైన సూర్యుడి అన్వయాంబుధిలో ఉదయించిన చంద్రుడు బండరాయి గుండెవాడు. అసంఖ్యాకులైన దేవతల సమూహాలు ధాత్రిని ఉండనీక కాశీనగరంలో ఒక్కడూ అద్వితీయుడై రాజ్యం పరిపాలించడం ఏ విధంగా సాధ్యం అవుతుంది? ఈ గుండె ధైర్యానికి మెచ్చాము. పరాక్రమం లేనివాడు రాజేనా?’’ అని పలికిన గురువు బృహస్పతి వాక్కుల్ని ఆదరించి, ఇంద్రుడు పంపగా అగ్నిదేవుడు భూమికి వచ్చి మొదట కాశీపురానికి నిర్బంధంగా అన్ని ఇండ్లలోనూ తన మూర్తిని ఉపసంహరించాడు. పరమాశ్చర్యకరంగా ప్రతి గృహంలోను కట్టెలలో అగ్నిదేవర శూన్యమై అణగిపోగా- కాశీపుర స్ర్తిలు అందరూ వంటల హడావుడి లేక తీరికగా కూర్చున్నారు. యజ్ఞశీలుర భవనాలనుంచి పురోడాశం వండడానికి కొనిపోతున్న వరిబియ్యం హవిర్గృహానికి ముందున్న సభా గృహం మధ్యలో ఒలికిపోయాయి. అందువల్ల పితృదేవ, దేవ హవిర్దానాల్లో వినియోగింపబడే స్వధా, స్వాహా, వషట్‌కార ధ్వనులు వినరావడంలేదు. కాశీనగరంలోని విప్ర వతంసులు నియంత్రిత భక్త్భిరిత భావంతో అగ్నిని ప్రజ్వలింపజేసే సామిధేని ఋఙ్మంత్రాలు ఉచ్చరిస్తూ ఇంతకి పూర్వంకన్నా సమగ్రమైన అరణిమంథనం అనే క్రియా తంత్రాన్ని ఆచరించి (జమ్మి కట్టెతో తయారుచేసిన నిప్పుని పుట్టించే సాధనం- అరణి) ఎంత చలం వహించి పిలిచినా అగ్నిదేవుడిని అమంత్రింపలేకపోయారు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి