భక్తి కథలు

కాశీ ఖండం.. 115

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండవిక్రమ, శిశుఘ్ని, పాపహంత్రి, కాలి, రుధిరపాయిని, వసాధయ, గర్భనభక్షిణ, అశనహస్త, అంత్రమాలిని, స్థూలకేశి, బృహత్కుక్షి, సర్పస్య, ప్రేత, దందశూకర, క్రౌంచి, మృగశీర్ష, వృషానన, వ్యాత్తాస, ధూమనిశ్వాస, వ్యోమైకచరణ, ఊర్థ్వదృశ, తాపని, శోషణి, వృకోదరి, స్థూలనాసిక, విద్యుత్ప్రభా, బలాకాస్య, మార్జారి, కటపూతన, అట్టాట్టహాస, కామాక్షి అనే నామాలు కల అరవై నలుగురు యోగినులను రావించి ‘‘మీరు వివిధ వేషాలతో చేష్టలతో, వేడబాలతో, కాశీనగరంలో పుణ్యస్ర్తిల పాతివ్రత్యాలు, పుణ్యపురుషుల ఆచారాలని చెడగొట్టవలసింది. వర్ణాశ్రమాలు ధర్మంగా- (అంటే తమ ధర్మాలని) ప్రవర్తించకుండా వుంటే దివోదాసు రాజ్య పదాన్ని పోగొట్టుకొంటాడు. అంతదాకా మాకు కాశీ సమాగమం- లేక కాశీలో ప్రవేశించటం సిద్ధించదు’’ అని చెప్పాడు. అప్పుడు ఆ యోగినులు మహాప్రసాదం అని శివాదేశం అమలుపరచడానికి కాశీ వచ్చారు.
కాశీనగరంలో ఒక యోగిని పువ్వులు కోసే పుష్పలావిక వేషం వేసింది, ఇంకో యోగిని మాయకత్తె రూపం తాల్చింది, మరో యోగిని గంధవాహిని అయింది. ఒక యోగిని వేశ్య అయింది. వేరొక యోగిని అరచేతుల్లోని, పాదాల్లోని రేఖలు పరిశీలించే జ్ఞానంలో చదురాలు అయింది. ఇంకొకతె జలస్తంభన అగ్నిస్తంభ వాక్‌స్తంభన, వయస్స్తంభన విద్యల్లో ప్రవీణురాలు అయింది. ఒక యోగిని సైరంధ్రిగా మారింది. ఇంకొకతె మాచకమ్మ, మరోకతె మంత్రకత్తె, వేరొకతె ముగ్గులు పెట్టడం, చిత్తరువులు వేయడంలో నిపుణ అయారు. మరొక యోగిని చదువను వ్రాయను పాటలు పాడను నాట్యమాడను, సరసాలు ఆడను, కథలు చెప్పను, నవ్వింపను, కన్నులు అల్లల్లార్పను, వీణ వాయింపను, కొనియాడను, పువ్వులు క్రుచ్చను, మరొక నియమ నిష్ఠలు గలది అయారు. ఈ రీతిగా నానా రూపములు కైకొని వారు వారణాసికి అరిగారు.
అనంతరం మన్మథవైరి శివుడు సిద్ధయోగినుల్ని పంపి, ఊరకుండలేక కాశీపుర వృత్తాంతం అరసి చూడడం కోసం తీక్ష కిరణుడైన సూర్యుడిని పంపాడు. కతుకం కాలయాపనని సహించి వుండనీదు.
త్రిపురాసుర వైరి సూర్యుణ్ణి కాశీనగరికి పంపే సమయంలో ఏకాంతంగా వుండి ఆరవితో ఈ గతి పలికాడు. ‘‘ఓ దినరాజా! దివోదాసుని యే చందంగానైనా- అతడు ధర్మాత్ముడు కనుక ధర్మ విముఖుణ్ణి కావించు. విడనాడకు. ధర్మమే ప్రధాన తత్పరతగా కల ఆ దివోదాసుడిని మనం ఆదరించకుంటే ఆ ధర్మం ఏ బాగున క్రమాభివృద్ధి పొందుతుంది? కనుక నయమార్గం తప్పకుండ ఏదో ఒక ఉపాయాన్ని మత్సరం చేత, అహంకారం చేత, కామం చేత, క్రోధ మోహాల చేతా పాపాన్ని నిరూపిస్తుంది. మందలిస్తుంది. ఏ దోషము నిరూపించక శిక్షించుట తగవు కాదు.
కర్మసాక్షీ! ఎంతకాలం వరకు మనస్సులో మిక్కిలి సుస్థిరంగా నిలిచి వుంటుందో అంతకాలం దాకా మనుష్యుడికి ఏ విధమైన ఆపదా సంభవించదు. ఈ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకో’’ అని వాకొన్నాడు.
సూర్యుడు ‘మహాప్రసాదం’ అని శివాజ్ఞని శిరసావహించి కాశీనగరానికి అరిగాడు. చని ఒక్కొక్క మాటు యాచకుడు, ఒక్కొక్కసారి దూత, మరొకమారు దాత, ఒక్కొక్క తూరి అతి దీనుడు, ఒక్కొక్కసారి కార్తాంతికుడు (దైవజ్ఞుడు), కంట చూసినదే తాను నమ్ముతాను అనేవాడు, ఒక్కొక్క పర్యాయం జటాధరుడు, ఇంకొక్కమాటు దిగంబరుడు, వేరొక్కసారి విషవైద్యుడు, మరొకమారు పాషాండుడు, ఒక్కొక్క మాటు బ్రహ్మచారి, గృహస్థు ఒక్కొక్కమారు, వానప్రస్థుడు మరొకసారి, ఒక్కొక్కతూరి సన్న్యాసి అయి నానా విధాలైన వేషాలు, భాషలు, చేష్టులు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, మాయలు- వీటి ప్రయోగించాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి