భక్తి కథలు

కాశీ ఖండం.. 120

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు అశ్వవాలం నల్ల చేయ సమ్మతింపక కినుక పూనారు. మరికొందరు వాల మాత్ర సూక్ష్మరూపాలు తాల్చి వాలం నుంచి వ్రేలాడారు.
పందెంలో వినత ఓటమిచెంది కద్రువకి దాస్యం చేయసాగింది. మరి అయిదు వందల యేళ్ళకు మూడవ అండనుంచి గరుత్మంతుడు ఉదయించాడు. ఆ గరుత్మంతుడు అమృతం కొనిరావడంవలన దాస్యం నుంచి వినత విముక్తి పొందింది.
అగస్త్యమునీంద్రా! నువ్వు అడిగిన ప్రశ్నకి ఇది అంతా ప్రత్యుత్తరం.
పక్షి సామ్రాజ్యం అనే సంపత్పదవి నుంచి భ్రష్టుడైన గుడ్లగూబ పక్షిరాజు, నడుమునుంచి క్రింది భాగం ఏర్పడకుండా పుట్టిన పిచ్చుకుంటు, సవతికి అయిదు నూర్ల సంవత్సరాలు దాకా దాస్యం చేసి బక్కచిక్కిపోయిన వినత, సర్పాలని వీపుమీద చాలాకాలం మోసుకుంటూ తిరిగిన గరుత్మంతుడూ- నలుగురున్నూ కదలి కాశీ పుణ్యస్థలంలో శివుడి ప్రతినిధులయిన ఆదిత్యుల్ని సేవించి, శీఘ్రంగానే విఘ్నాలు లేక మనోభీష్టాలను పొందారు.
గరుడిడి పేర గరుడాదిత్యుడున్ను, గుడ్లగూబ పేర మయూఖాదిత్యుడున్ను, వినత పేర వర్షాదిత్యుడున్ను, అరుణుడి పేర అరుణాదిత్యుడున్ను అని ప్రసిద్ధికెక్కాడు. ఇంక వృద్ధాతిత్య కేశవాదిత్య విమలాదిత్య గంగాదిత్య యమాదిత్యుల మహాత్మ్యాలు చెపుతాను. ఆకర్షించవలసింది.
వృద్ధుడైన హరీతుడు ముదుసలితనం పాసి తరుణ వయస్కుడై సూర్యుణ్ణి సేవించి వరం పడశాడు. అది కేశవస్వామి తన సమీపంలో నిల్పుకొని రత్నమూర్తి అయిన శంభుణ్ణి వీక్షించేటట్లు చేశాడు. విమలుడు అనే ప్రభువు సూర్యుణ్ణి కొలిచి, అధికమైన కుష్ఠ వ్యాధిని పోగొట్టుకున్నాడు. పూర్వం గంగానదిని భగీరథుడు ధరణికి తెచ్చే వేళలో ఆ నదిని చూసి సూర్యుడు ప్రస్తుతించాడు.
యమధర్మరాజు యమతీర్థంలో తన తండ్రి అయిన రవిని కొలిచి, తపస్సు సల్పి ఆతడి కరుణ పొంది, సిద్ధి పొందాడు. ఇవియే గుర్తులుగా వాటి వాటి పేర్లతో ఆయా ఆదిత్యుల నామాలు ప్రసిద్ధి వహించాయి.
శివుడు బ్రహ్మను కాశీకి అనుంపుట
అంతేకాదు, కాశీవియోగ బాధని సైపలేక అంధకాసురాంతకుడు అయిన శూలపాణి ఆ కాశీ నగర వృత్తాంతం శ్రవణ ప్రవణంతో బ్రహ్మదేవుడిని మహాశ్మశానమని పేరుకాంచిన కాశీనగరానికి పంపించువాడయి ఆ విరించిని రావించి, ఈ విధంగా పలికాడు.
చతుర్ముఖా! కాశీకి వెడలిన యోగినీగణం పోయిన పోకనే పోయారు. ఒక్క యోగిని అయినా మరలి రాలేదు. అనంతరం చనిన సూర్యుడున్ను ఆలస్యం చేశాడు. తిరిగి రాలేదు. చెరువుని చూడడం కోసం ఏగి తామరవలె మరలి రాక వీరు అందరూ కాశీ లోపలనే ఉండిపోయారు. ఈమారు నువ్వు చనవలసింది. ఆ వెనుక కాశీ ఏగినవారి వలెనే కావద్దు సుమా!’’ అని ఆనతిచ్చాడు.
అప్పుడు ‘ప్రసాదం’ అని, శివుడు ఆన పాటించి ఆ నలువ వృద్ధ బ్రాహ్మణుడి వేషం తాల్చి, కాశీ నగరం చొచ్చి, నిండు కొలువు తీర్చివున్న దివోదాసుని ఆశీర్వదించి, ఈ విధంగా పలుకసాగాడు.
‘‘ఓ అనఘాత్మా! దివోదాస భూపాలా! ఈ ఆనందకాననం అనే కాశీనగరపు మధ్యభాగంలో యజ్ఞాలు ఒనరించుతాను. నీ అనుజ్ఞ ఇచ్చి, అనుమతించు. అంతేకాదు చెయ్యగల సాహాయ్యం చెయ్యవలసింది. రాజు నడిపించకుంటే ధర్మం ఏ విధంగా నడుస్తుంది.
ఓ రాజా! ఈ కాశీపురంలో విశే్వశ్వరుడు లేనందువల్ల అకట! అనాథ రీతిని వుంది. తక్కిన దేవతలు రాకపోతే రాకపోతారు. వామదేవున్ని మాత్రం రావించక తప్పదు సుమా!’’

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి