భక్తి కథలు

కాశీ ఖండం..23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ నిటలాంతం నుంచి అది అధోముఖం అయి వ్రేలాడుతూ వుంటుందని తదెజ్ఞులు- అనగా యోగవిద్యావేత్తలైన ఆర్వులు వచిస్తూ వుంటారు.
లోపాముద్రా! ఆ కుండలినీ నాడి చుట్టూ మన శరీరంలో డెబ్బది రెండు వేల నాడులు వుంటాయనీ, వాటిలో పధ్నాలుగు ధమనులు ముఖ్యమైనవనీ బుధులు వాకొంటారు. వామధమని లేక ఎడమ నాడిలో చంద్రుడు అధివసించి వుంటాడు. కనుక ఆ ఎడమ నాడి నుంచి- అంటే ఇడానాడి నుంచి శ్వాస వెలువడే కాలం రాత్రి, శ్వాస ప్రవేశించే కాలం పగలు అవుతాయి. ఇక కుడి ప్రక్క నాడి లేక పింగళానాడిలో సూర్యుడు నివశిస్తాడు. కనుక ఆ నాడినుంచి అంటే పింగళనాడినుంచి ఊపిరి ఉద్గమించే కాలం పగలు. శ్వాస నిర్గమించే కాలం రాత్రి, తూర్పు దిక్కయి నిలుచు మానవులకి కుడివంక పింగళానాడీ, ఎడమ ప్రక్క ఇడా నాడీ వుంటాయి. అందువల్ల మకర సంక్రమణ సమయంలో దక్షిణంలో వున్న రవి కర్కాట సంక్రమణ సమయం దాకా ఉత్తరపు దిశగా సంచరిస్తాడు. కనుక ఆ కాలం ఉత్తరాయణ కాలం అని వ్యవహరింపబడుతుంది. ఈ చందంగానే పింగళానాడిలో వున్న ప్రాణవాయువు ఎంతదాకా ఇడాధమనిలో ప్రవేశిస్తూ వుంటుందో అంతదాకా ఉత్తరాయణం. ఈ విధంగానే దక్షిణాయనాన్ని తెలిసికోవాలి. అంటే కర్కాటక సంక్రమణ సమయంలో ఉత్తరాన వున్న రవి- మరల మకర సంక్రమణ సమయందాకా దక్షిణపు దిక్కుగా సంచరిస్తాడు కనుక దక్షిణాయనం అని వ్యవహారం.
ఓ చంద్రాననా! సమాన గమనంతో ఒకే సమయంలో కలయికతో చంద్రుడు, సూర్యుడున్ను ‘ప్రాణ’ సంజ్ఞలు కల వాయువులు కూడ ఆ విధంగానే కూడి తీవ్ర గతితో పింగళానాడిలో తారసిల్లి క్రుంకుతూ ఉదయిస్తూ వుంటారో ఏ కాలంలో ఆ సమయం ‘అమావాస్య’ అనే నామాన్ని తాల్చుతుంది.
ఈ కుండలిని రాహువు. ప్రాణవాయువే చంద్రుడు. ఆ కుండలిని లేక రాహువు ప్రాణ పవనాన్ని లేక చంద్రుడిని నిశే్వషాంగకంగా గ్రసిస్తుందో లేక మ్రింగుతుందో ఆ సమయానే్న గ్రహణకాలం అని వ్యవహరిస్తారు.
ప్రాణమే ఆదిత్యుడు. ఆ ఆదిత్యుడే చంద్రుడు. ఆ ప్రాణ పవనం మూలాధార చక్రాన్ని ప్రవేశిస్తూనే ఉదయిస్తుంది. మూర్థ ప్రవేశం అనంతరం- అంటే బ్రహ్మరంథ్రమందు ప్రవేశిస్తూనే అస్తమిస్తుంది. మానవుల ఒక సంవత్సర కాలం దేవతలకి ఒక అహోరాత్రకాలం. ఈ రాత్రిందివాలు సమాన ప్రమాణాలు కల రోజుని ‘విషువం’ అని పిలుస్తారు. ఆ విధంగా సమానాలైన రేయింబవళ్ళ ప్రమాణాలు వున్న దినాలు లేక విషువాలు మనుష్యుల సంవత్సరకాలంలో రెండు పర్యాయాలు వస్తాయి. దేవతలకి మేష సంక్రమణంలో రవి ఉదయిస్తాడు. తులా సంక్రమణంలో అస్తంగతడు అవుతాడు. ప్రాణవాయువు యొక్క ఉదయాస్తమయ వేళలనే విషువము అంటారు.
ఇడానాడిలో పుట్టే శ్వాస వాయువులు తొలుత సుషుమ్నా నాడిలో ప్రవేశిస్తాయి. అనంతరం సుషుమ్నానాడిలో జనించిన శ్వాస పవనాలు ఇడానాడిలో ప్రవేశిస్తాయి. ఈ పగిదిని ఇడానాడి నుంచి సుషుమ్నా నాడికి సుషుమ్న నుంచి ఇడకిన్ని పర్యాయక్రమంగా ప్రవేశిస్తాయి. కనుక ఆ సమయాన్ని ఆగమాలతత్త్వం ఎరిగిన ఆర్యులు సంక్రమములని వాకొంటారు.
ఈ కరణి కాశీక్షేత్ర వియోగం వల్ల పుట్టిన దుఃఖంవల్ల మనస్సులోపల వున్న కాశీ క్షేత్రమహాత్మ్యాన్ని వివరించి చెప్పి, అగస్త్యుడు- వెనువెంటనే కలుగబోవు కాశీక్షేత్ర విరహంవల్ల ఇబ్బడి ముబ్బడి అవుతూ వున్న దుస్సహవేదా భారం భరింపలేక కాశీ పవిత్రక్షేత్రాన్ని ఉద్దేశించి ఈ విధంగా పలుకసాగాడు.

- ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి