భక్తి కథలు

కాశీ ఖండం..27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారు శిఖరాగ్ర భాగాల శృంగాటకాల చేత బ్రహ్మాండ కర్పరాన్ని- లేక కటాహాన్ని (కప్పుని) చొచ్చుకొని పోతున్న తన ఔన్నత్యాన్ని నేలతో సరి సమానంగా వంచి వింధ్య పర్వతం ఆ మహానుభావుడైన అగస్త్య మహర్షికి ఎదురుగా అరిగింది. అంత సూర్యరథం చక్కగా, సరాసరిగా సాగింది. సప్త వాయుస్కంధాల నిర్బంధం తొలగిపోయింది. చంద్రుడు వెనె్నలలు చిందించసాగాడు. కుజ, బుధ, బృహస్పతి (గురుడు) శుక్ర, శని, రాహు కేతు గ్రహాలు తమ తమ స్థానాలు తప్పిపోకుండా సంచరించసాగాయి. సమస్త ప్రపంచమున్ను క్రమంగా యథాపూర్వకంగా ప్రవర్తింపనారంభించింది. కాల విభాగాలు స్పష్టముగా తెలియవచ్చాయి. అనంతరం ఆ వింధ్యాచలం కొన్ని అంగలు వేసి ఎదురువెళ్లింది.
ప్రణవం, శివపంచాక్షరి, సర్వ ఉపనిషత్తులు తుట్ట తుదిదాకా తెలిసిన బుద్ధిశాలి, రాక్షసులైన వాతాపిని ఇల్వలుడితో సహా తన జఠరాగ్నిలో హోమం చేసిన యజ్ఞకర్త, ఆగ్రహించి ఒక్క హుంకారంతో నహుషుడిని అజగరంగా శపించిన భీకర తేజుడు, వానకారులో వండ్రు మట్టి పట్టి బురద పట్టిన నదుల నీటి కాలుష్యాన్ని పోగొట్టి స్వచ్ఛంగా తేటపరచే కత కఫలమూ (ఇండుప గింజ లేక చిల్లగింజ) ధవళ భస్మపు త్రిపుండాలు చిహ్నితం అయిన ఫాలభాగుడా, శుభంకరాలైన రుద్రాక్ష మాలలు కంఠాన తాల్చిన శైవుడూ- భార్య అయిన లోపామద్రతో సహా ఏతెంచే అగస్త్య మహర్షిని వింధ్యాచలం కాంచింది.
కాశీక్షేత్ర వియోగ సంభవమయిన క్రోధాగ్ని జ్వాలలలో దశదిశలు, ఆకాశం, భూవలయం త్రుటిలో కాల్పగల మహోగ్ర రూపుడిని అగస్త్యుణ్ణి వింధ్యగిరి కనుగొంది. కనుగొని ఆ మహీధరం ఆ మహామునీశ్వరుడిని అతిథి సత్కార గౌరవ విశేషాలతో సంతోషపెట్టి, హస్త పద్మాలు ముకుళించి ‘‘ఓ మహానుభావా! మహర్షీ! నీ ఆజ్ఞానుగ్రహంతో నన్ను కృతార్థుణ్ణి చెయ్యవలసింది’’ అని విన్నవించింది.
ఆ విధంగా విన్నవించుకొన్న ఆ గిరిరాజాన్ని కని ఆ మహర్షి ‘‘మహీధర వంశవతంసా! వింధ్యాచలేంద్రా! నా భర్యా లోపాముద్ర దేవితో కూడి నేను దక్షిణాపథంలో వున్న తీర్థాలలో క్రుంకులాడగోరి అరుగుతున్నాను. ప్రాయం కైవ్రాలిన పెరువని (వృద్ధుడిని) సుమా! జరాక్లేశంవల్ల అశక్తుడిని అయాను. బలం చాలదు. సమున్నతాలైన నీ శృంగ శిఖరాలలు ఎక్కేవేళా దిగేతరినీ ఈ విధంగానే చిన్నవిగా నేల సపాటంగా చేసి నేను క్రమ్మరి వచ్చేటంతవరకు నువ్వు ధరిత్రిలో ఒదిగి ఉండాలి సుమా! నా ఆశ పాటించు. నీకు లెస్స అవుతుంది. నా ఆజ్ఞ అతిక్రమిస్తే కలిగే ఫలితాన్ని తెలుసుకొంటావు గాక! వ్యర్థాలాపాలు ఆడడం ఎందుకు?’’ అని ఆన పెట్టాడు.
అంత వింధ్యశిఖరి ‘‘అగస్త్య మహర్షీ! ఈ చరాచర జగత్తులో నీ ఆన పాటించనివారు వున్నారా? నీవు మరలి ఏతెంచుదాకా ఈ విధంగానే నేలలో ఒదిగి వుంటావు’’ అని వినయంగా పలికింది. అపుడు కలశసూతి ఆ కొండని దీవించే తన పవిత్ర పాద విన్యాసాల చేత సమస్త భూమినీ భాగ్యవంతం కావిస్తూ దక్షిణ దిజ్ముఖుండయి అరిగాడు అని సూత మహర్షి వచించాడు. నైమిశారణ్య మహర్షులు ‘‘ఆ పయి ఏమి జరిగింది? చెప్పవలసింది’’ అని కుతూహలంతో సూతుడిని ప్రశ్నించారు.
ద్వితీయాశ్వాసం సమాప్తం

తృతీయాశ్వాసం

అనంతరం కథకుడైన సూత మహర్షి శౌనకాది మహామునులతో ఈ విధంగా వచించాడు.
‘‘ఆ వింధ్య మహీధరం జరిగినదానికి మనస్సులో ఎంతో సంతోషం పడింది.
- ఇంకా ఉంది