భక్తి కథలు

కాశీ ఖండం.. 168

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనఘాత్మా! కాశీలో శివలింగాలు కోట్లు కల్గనీ! విశే్వశ్వర లింగమే లింగం. శాశ్వతుడు. కాశిలో తీర్థాలు కోట్లకొలది వుండనీ! మణికర్ణికయే తీర్థం అని తెలుసుకో!
కాశీతీర్థంలో విశే్వశ్వరుడు సేవింపదగిన దైవం. మణికర్ణికాతీర్థ పావన జలం స్నానమాడ తగినది. శంభు కథాకథనాలైన దివ్య పురాణాలే వినదగినవి.
యావజ్జీవం అనురాగ పరాయణత్వంతో కాశీ పట్టణంలో నివసించాలి. సంకల్ప పురస్సరంగా చక్రతీర్థంలో (మణికర్ణికా తీర్థానికే మరొక పేరు చక్రపుష్కరిణి) స్నానం ఆచరించాలి. సకలానికీ, పతి అయిన మహేశ్వరుణ్ణి గంథాక్షలతోను, పుష్ప ఫల పత్రాలతోను అర్చించాలి.
నెరసు దొరలకుండ శమదమాది ఆత్మదర్మాలనీ, వర్ణ ధర్మాలనీ మరవకుండా అవలంభించాలి. పురాణార్థాలు తెలిసిన పెద్దల వల్ల తీర్థస్నాన మహిమలు భక్తితాత్పర్యాలతో ఆకర్ణించాలి. తన యథాశక్తి దానం చెయ్యాలి. ఇన్ని సమకూడితేకాని కాశిలో ముక్తి దుర్లభం.
కాశీ యాత్రని విద్యుక్త సరణిలో చెయ్యాలి. పరివార దేవతల్ని క్షేత్ర దేవతల్ని సేవించాలి. అబద్దం ఆడరాదు. జీవహింస సలుపవద్దు. ప్రాణుల పయి అలుక పూనవద్దు. పరుల రహస్యాలని నవ్వులాటకైనా చెప్పకూడదు. కాశీపురంలో ప్రాణం నిలుస్తుందో నిలువదో అనే సందేహం కలిగే సందర్భంలో అసత్యాలు ఆడి అయినా పరుణ్ణి రక్షింపదలచడం అత్యంతమూ పరమ ధర్మం.
మృత్యుంజయుడు అయిన శివుడి రాజధానీ నగరంలో చీమని కాపాడడం సయితం ఈ ముజ్జగాలనీ కాపాడడమే. శివధర్మ సూక్ష్మాలను పోల్చి మదిని తెలుసుకోవాలి.కాశీతీర్థంలో సన్న్యసించిన వారయి నిర్వికార చిత్తంతో కాశీలో నివసించే వృద్ధుల్ని గౌరవించడం అత్యధిక ధర్మం.
దానివల్ల బహు విధముక్తుల్ని సంధానించే విశే్వశ్వరుడు ఆహ్లాదాన్ని పొందుతాడు.
కాశీ పవిత్ర క్షేత్రంలో కాపురం వుండే మనుష్యుడు ఇంద్రియ వ్యాపారాన్ని ప్రయత్నించి ప్రయత్నించి కుదించుకోవాలి. మనస్సు యొక్క చంచల స్వభావాన్ని మాన్చుకోవాలి. మదిలో మోక్ష కాంక్షను వదలిపెట్టాలి. (కోరినంత మాత్రం చేత మోక్షం సిద్ధించదు కనుక)- ప్రాణభయం వదలిపెట్టాలి.
వ్రతాలు, దానాలు, ధర్మాలు, కొనసాగడం కోసం తన శరీరాన్ని సంరక్షించుకోవాలి. ఆ సమయానికి భుజించడానికి సరిపడే ధాన్యం మాత్రమే సంగ్రహించి సమకూర్చుకోవాలి. దంభగుణాన్ని అణచుకోవాలి.
ఈర్ష్య ఉజ్జగించాలి. రాగద్వేషాలు, లోభం, గర్వం పుట్టకుండా అణచుకోవాలి. శాంతి, దాంతి, సహనం, అక్రూర స్వభావం, సత్యం- వీటియందు ప్రవణత కలవాడు కావాలి.
అన్యతీర్థాలలో నూరు సంవత్సరాలు వసించడంవల్ల కలిగే ప్రయోజన లాభం ఆనంద కాననంలో లేక కాశిలో ఒక్కరోజు నివసిస్తే సర్వదా సిద్ధిస్తుంది.
కాశీలో నియమంతో ఒక్క ప్రాణాయామంవల్ల మానవుడు పొందే ఫల సంపద మరొక క్షేత్రంలో అష్టాంగ యోగ మార్గంవల్ల కూడా పొందలేరు.
చక్రవాళ పర్వతం లేక లోకాలోక పర్వతం చేత చుట్టబడిన సమస్త భూమండలంలోనూ వున్న పరమ తీర్థాలలో కాశీ క్షేత్రం పెరువ (దొడ్డది). కాశీ నగరానికి సంబంధించిన అయదు కోసుల నడుమగల తీర్థ సమూహానికి జాహ్నవి లేక గంగానది సారభూతమైనది. జాహ్నవికి సంబంధించిన తీర్థ సముదాయంలో మణికర్ణిక మిక్కిలి పెద్ద గొప్పది. మణికర్ణికా తీర్థస్నాన ఫలంకన్నా విశే్వశ్వరుడి దర్శన ఫలం అధికం.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి