భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ బాబా ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు కదా. ఆ రోజు పెళ్లివారితో వచ్చినప్పటినుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ ఈ నీమ్‌గావ్, ఈద్‌గా తప్పితే ఎప్పుడూ బాబా ఎక్కడికి వెళ్లినట్లే మనం చూడలేదు.
ఇప్పుడేమిటి నేను పర్వత కనుమను దాటానని అంటారు. దున్నపోతు నెక్కానని చెప్తున్నారు. ఏమిటో అనుకొని ఒకరినొకరు వారిద్దరూ చూసుకొన్నారు.
బాబా వీరిని చూచి చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వుకు అర్థం ఏమిటో వారికి అంతుబట్టలేదు. వచ్చినతను ఎంతో ఆశ్చర్యంగా బాబా వైపు చూస్తున్నాడు. ఆయను కన్నుల నుంచి నీరు ధారాపాతంగా కారిపోతున్నాయి.
ఇప్పుడు ఏమి చేయాలో వారిద్దరికీ అర్థం కాలేదు. వెంటనే వారిద్దరూ ఒక్కసారిగా బాబా అన్నారు.
బాబా చిరునవ్వు చెదరనివ్వకుండా నేను చెప్పింది అర్థం కావాల్సిన వారికి అర్థం అయింది. మీరేమీ కంగారుపడకండి అన్నారు.
అప్పుడు హేమాదిపంతు మెల్లగా ‘ఓహో ఈ వచ్చినతని గురించి ఏదన్నా బాబా చెప్పుతున్నారేమో. ఇందులో ఏదో గూడార్థమున్నట్టు ఉంది’ అన్నాడు.
మహిల్సాపతి కూడా అవును అన్నాడు.
అంతలో-
బాబా ‘ఏమిటి మీరిలానే కూర్చుంటారా ఏమిటి? ఎవరైనా అతిథి వస్తే అన్నపానీయాలు చూడాల్సిన బాధ్యత మీకేదీ లేదా?’ అన్నారు.
వారిద్దరూ బాబా అన్నారు.
‘సరే మీకిష్టమొచ్చింది చేయండి’ అని బాబా ఎక్కడికో వడివడిగా లేచి వెళ్లిపోయారు.
అంతలో వచ్చినతను ‘ఏమండీ, ఇతనిని మీరు బాబా అని పిలుస్తారా? నేను నానాఘాట్ అనే ప్రదేశం నుంచి వచ్చాను’ అని చెప్పాడు.
మహిల్సాపతి, హేమాదిపంతు ఆశ్చర్యంగా వచ్చినతనిని చూశారు.
‘నా పేరు ఠాకూర్! నేను నా ఉద్యోగంలో ఒడిదుడుకుల నుంచి తప్పించుకోవడానికి నన్ను నా కుటుంబాన్ని కాపాడమని మా గురువుగారు ‘అప్పా’ను వేడుకున్నాను. అప్పుడు-
మా గురువుగారు నన్ను ‘‘నీవు నీ ఉద్యోగార్థం ఉత్తర దిశకు వెళ్లినపుడు నీకు అక్కడ ఒక మహానుభావుడు కనిపిస్తాడు. అతడిని నీవు సేవించు’’ అని చెప్పారు. నేను ఈమధ్యనే ఇక్కడికి దగ్గరలో వున్న కళ్యాణ్ దగ్గరలోకి నా ఉద్యోగార్థం వచ్చాను.
అపుడు మళ్లీ నా స్వప్నంలో మా గురువుగారు కనిపించి నేను చేయమన్న పనిని నీవు చేయలేదేమి అని అడిగారు.
ఈ కార్యాలయంలో నేను పనిచేస్తున్నపుడు నా దగ్గరకు వచ్చిన వారిలో కొంతమంది శిరిడీ గురించి ఈ బాబా గురించి చెప్పారు. అందుకోసమే నేను ఈ రోజు ఈ శిరిడీ వచ్చాను. నాకు మీ బాబా గురించి కాస్త చెప్పండి’’ అని అడిగాడు.
హేమాదిపంతు ‘‘ముందు మీరు మా ఇంటికి రండి. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. కాస్త ఏదైనా తిని సేదతీరిన తర్వాత మనం మాట్లాడుకుందాం’’ అని అన్నాడు.
అట్లాగేనని హేమాదిపంతుతో కలిసి ఠాకూర్ భోజనానికి వెళ్లాడు.
భోజనాదులు ముగించుకుని మసీదుకు అందరూ వచ్చారు. అపుడు ధుని దగ్గర బాబా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు.
ఠాకూర్ వచ్చిన వెంటనే బాబాకు నమస్కరించి ‘‘బాబా! నీవే నన్ను కాపాడాలి. నాకు మంచి మార్గం చూపాలి’’ అని వేడుకున్నాడు.
బాబా చిరునవ్వు నవ్వి ‘‘్ఠకూర్! నీవు మీ గురువుగారు చెప్పిన గ్రంథమే చదవలేదు. మరి నీకు ఎలా మంచి మార్గం కనిపిస్తుంది’’ అన్నారు.
‘‘బాబా! నేను చదవాలనే అనుకొంటున్నాను. కాని నా ఉద్యోగరీత్యా కుదరడంలేదు’’ అని ఠాకూర్ అన్నాడు.
‘‘కేవలం గురువుగారు చెప్పారని, వాళ్లు వీళ్లు చెప్పారని పదిసార్లు ఒక పుస్తకాన్ని చదివినంత మాత్రాన ప్రయోజనం ఏమీ ఉండదు. పారాయణ సంఖ్య ప్రాముఖ్యాన్ని సంతరించుకోదు. కేవలం అందులో వున్న నీతిని, మంచిని నీవు ఆచరించిన రోజే నీకు మంచి జరుగుతుంది. సత్యంగం నీకు మంచిని బోధిస్తుంది. బోధనలు నీవు విన్నంత మాత్రాన ఫలితాన్ని ఇవ్వవు. కాని నీవు ఆ బోధనలను నీ జీవితంలో ఆచరించినరోజు మాత్రమే మంచి సద్గతులు వస్తాయి’’ అన్నారు బాబా.
ఠాకూర్ వెంటనే ‘‘బాబా నీవు చెప్పినట్లే నేను చేస్తాను. నా చేత చేయించాల్సిన బాధ్యత కూడా నీదే సుమా’’ అన్నాడు.
-ఇంకాఉంది

జంగం శ్రీనివాసులు 837 489 4743