భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతకాలానికి అతడి దగ్గర ఉన్న ఊది అయిపోయింది. ఈసారి బాబా దగ్గరకు వెళ్లి ఊది తెచ్చుకోవాలని అనుకున్నాడు అతడు. కాని అతడు అనుకోకుండా వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది.
అక్కడ అతని దూరపు బంధువుకు చాలా జ్వరం వచ్చి నీరసించిపోయాడు. అతనికి మందులేమన్నా ఇమ్మని బాబా ఊదినిమ్మని వారు ఫనే్సని అడిగారు. ఫనే్స దగ్గర మందులు లేవు. బాబా ఊది కూడా అయిపోయింది. దాంతో ఫనే్స చాలా కంగారు పడ్డాడు. రేపు పొద్దున్న బాబాను ప్రార్థిద్దాములే అని వారికి నచ్చచెప్పాడు.
దాంతో వారంతా కలిసి బాబా ఫొటో పెట్టుకుని పనే్సనే బాబాకు పూజ చేయమని అడిగారు. వారు కోరుకుంటున్నట్టే బాబా పూజ చేశాడు. మనసులో అతనికి వ్యాధి తగ్గే మార్గం చూపమని కూడా పదే పదే వేడుకున్నాడు.
రాత్రంతా బాబాను ప్రార్థిస్తూ ఫనే్స నిద్రపోయాడు. నిద్రలో అతనికి బాబా ఊది ఇస్తున్నట్లు కల వచ్చింది. అయ్యో నా దగ్గర ఉన్న డబ్బాలో ఊది అయిపో యింది. కలలోనేమో బాబా ఊది ఇచ్చారు. ఇది నిజం కాదు కదా అనుకుంటూ తెల్లారి ఊది డబ్బా తీసి చూసాడు. ఆశ్చర్యం, డబ్బానిండా ఊది ఉంది. ఇదంతా బాబా మహాత్మ్యమే అనుకుని బాబాకు నమస్కరించి ఆ రోగికి బాబా ఊదినిచ్చాడు. తన మనసున బాబా సూచించిన మందులను కూడా వాడమని వారికి చెప్పాడు. వారు ఫనే్స చెప్పినట్లే చేశారు. కొద్దిరోజుల్లో ఆ రోగికి రోగం దూరమైంది. ఇదంతా బాబా మహిమనే అని ఫనే్స అతని బంధువులు కూడా అనుకుని ప్రతిరోజు బాబాను పూజించడం ప్రారంభించారు.
మరోసారి ఓ విచిత్రం జరిగింది. భూమి కొనుగోలు విషయంలో కాకా సాహెబ్ దీక్షిత్ లక్ష్మణ్ భట్ మధ్య భూమి ధరలో వాదోపవాదాలు జరిగాయి. ఒకరు 200 రూపాయలు అంటే మరొకరు 150 అన్నారు. ఎంతకీ వారి వాదం ఒక కొలిక్కి రాలేదు. ఎప్పటిలాగే లక్ష్మణ్ భట్ బాబా దగ్గరకు వచ్చి తాను చేసింది బాబాకు నివేదించాడు. దాన్నంతా విన్న బాబా ఎందుకు వాదులాట సాహెబ్, నీవు అయినా వినవచ్చు కదా, మీరిద్దరికి మధ్యలో నేనో మాట చెప్తాను. దాన్ని పాటించండి ఇద్దరూ. 175 రూపాయలు తీసుకో, వ్యవహారం సద్దుమణుగుతుంది అని చెప్పారు. సరే అని చెప్పి భట్ వెళ్లాడు కాని అక్కడ ఎదుటివానికి బాబా చెప్పిన సంగతి చెప్పలేదు. చివరకు 150కు ఒప్పుకుని డబ్బులు తీసుకని ఇంటికి వచ్చాడు. తీరా లెక్క చూచుకునేసరికి 175 రూపాయలు ఉన్నాయి. అతడికి చాలా ఆశ్చర్యం వేసింది. కాకా ఇచ్చింది 150 అయినా తన దగ్గర 175 రూపాయలు ఉన్నాయి. ఇదంతా బాబా మహత్మ్యం అని బాబా కు నమస్కరించాడు. ఇలాంటివెన్నో సాయిబాబా భక్తులకు అనుభవంలోకి వచ్చేవి.
***
బాబా తన దగ్గరకు వచ్చే భక్తులకే కాక దూరంగా ఉన్న భక్తులకు కూడా మహిమలు చూపేవారు. వారు ఎక్కడ ఉన్నా బాబా దయ వారికి అందుతూ ఉండేది. ఒకసారి బాబా చేతిలో వున్న సట్కాతో తన పక్కనున్న నీటి కుండను తట్టుతున్నారు. నీరు ఒలుకుతుందేమోనని అక్క కూర్చున్న బాబా భక్తులు భయపడుతూ చూస్తున్నారు. బాబా చేతలకు అర్థం చెప్పేవారు అర్థం చేసుకునేవారు ఎవరు ఉంటారు? కంగారు పడుతున్నవారిని చూచి బాబా ‘‘ఏమర్రా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు. అక్కడ నాగపూర్ తాజుద్దీన్ ఇల్లు తగలబడిపోతోంది. మరి నేను ఆర్పకపోతే ఎవరు ఆర్పుతారు?’’ అన్నాడు.
అక్కడ వారికి ఏం అర్థం కాలేదు. కాని కొన్నాళ్ల తరువాత ఆ తాజుద్దీన్ అక్కడికి వచ్చారు. బాబా మీరు సమయానికి వచ్చి నా కుటీరాన్ని కాపాడారు బాబా. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని నమస్కారం చేశారు. అపుడు అక్కడున్న భక్తులు ఈ సంగతి మనకు ఆనాడు చెప్పారు. కాని బాబా ఎక్కడికీ వెళ్లలేదు కదా. కాని నాగపూర్‌లో కుటీరాన్ని రక్షించారు అంటున్నారు. అయినా బాబా సర్వజ్ఞుడు కదా ఎక్కడ ఆయన లేడు? ఆయన తలచుకుంటే ఏది కావాలంటే దాన్ని చేయడానికి సమయం కాని ప్రదేశం కాని ఎందుకు అడ్డు వస్తాయి అని అనుకున్నారంతా. అట్లానే మరోసారి బాబా చేసే దైనందిన కార్యక్రమాలు చేయకుండా వౌనంగా ఆ రోజు కూర్చుని ఉన్నారు. లిండీకి వెళ్ళే సమయం కావచ్చింది. బాబా వౌనంగా కూర్చున్న చోటే పడుకున్నారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743