భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమిటి ఇలా బాబా వౌనంగా కూర్చున్నారని అక్కడ ఉన్న మహిల్సాపతి, కాకాభట్ చర్చించుకున్నారు. వారిద్దరూ కలిసి బాబా లిండికి బయలుదేరుదామా అని అడిగారు.
బాబా కనులు తుడుచుకుంటూ ‘‘ఏమని చెప్పను. ఈ రోజు నా సోదరుడు గజానన్ మహారాజ్ పరమాత్మ దగ్గరకు వెళ్లిపోయాడు. ఆయన చేసే పని అయిపోయిందంటూ వెళ్లిపోయారు’’ అన్నాడు. ఏం జరిగిందో తెలిసినా తెలియనట్లు అనిపించింది వారిద్దరికీ. దాంతో ఏం చేయాలో తోచలేదు. కాని కొద్దిసేపట్లోనే ఎవరో వచ్చి గజానన్ మహారాజ్‌గారు పరమపదించారన్న విషయం చెప్పారు. అపుడు బాబా వైపు చూస్తున్న భక్తులతో నేను ఇందాకే చెప్పాను కదా మీకు అన్నట్లు బాబా చూశారు.
ఇలా ఎక్కడో జరిగిన విషయాలు కూడా బాబా చెప్పడంతో బాబాను అందరూ సర్వాంతర్యామి అని పిలిచేవారు.
శిరిడీకి ఒకసారి చోల్కర్ అనే భక్తుడు వచ్చాడు. అతడు అందరికీ కలకండ పంచుతున్నాడు. అక్కడే దాసగణు కూర్చుని ఉన్నాడు. బాబా దాసగణుని చూచి ‘‘ఓ దాసుగణు ఈ చోల్కర్‌ని మీ ఇంటికి తీసుకుని వెళ్లి కాస్త చక్కెర ఎక్కువగా వేసి చాయి తాగించు’’ అన్నారు.
విషయమేమిటో అర్థంకాక దాసగణు చూస్తున్నాడు. చోల్కర్ ఆ మాటలు విని చిన్నగా నవ్వుతూ బాబాకు నమస్కరించాడు.
మళ్లీ ఏమయ్యా చోల్కర్ నీవు చాయ్ తాగేటప్పుడు చేదుగా అనిపించలేదా. నీకు ఉన్నంత దానం చేస్తే చాలు నాయనా భగవంతుడు ఇచ్చేవాడే కానీ తీసుకునే వాడు కాదుసుమా అన్నాడు. దాసగణు మరింత ఆశ్చర్యంగా వారిద్దరినీ చూస్తున్నాడు.
అపుడు చోల్కర్ అసలు విషయం చెప్పాడు. నేను పరీక్షలో పాసు అయితే శిరిడీలో కలకండ పంచుతానని దణ్ణం పెట్టుకున్నాను. దానికోసం నేను చాయ్‌లో చక్కెర లేకుండా తాగాను. ఆ చక్కెర కొనే డబ్బులతో కలకండ కొని ఇక్కడకు తెచ్చాను. అందుకే ఇలా బాబా చమత్కరిస్తున్నారు అన్నాడు.
దాసగణు కూడా బాబాకు నమస్కరించి బాబా నీవే మమ్మల్నందరినీ కాపాడేవాడవు. ఎవరికి ఏమి కావాలో నీకు తెలుసు అంటూ చోల్కర్‌ను చాయ్ తాగడానికి ఆహ్వానించాడు.
ఒకసారి హరిద్వార్ నుండి ఓ సాధువు దేశాటనం చేస్తూ దారిలో ఎవరో చెప్పారని శిరిడీ బయలుదేరాడు. అతడు శిరిడీ సమీపిస్తుండగా మసీదుపైన ఎగిరే జెండాలు చూశాడు. పక్కనున్నవారిని ఆ జెండాలు ఏమిటని అడిగాడు. వారు ఆ జెండాలు మసీదుపైన ఎగురుతున్నాయని అక్కడే బాబా ఉంటారని అన్నారు. దానికి ఆయన కోపం తెచ్చుకున్నాడు. వారితో ఇంత ఖ్యాతి పైన ఆశ ఉన్నవారు బాబాలు ఎలా అవుతారు? జెండాలు ఎగురవేసి తన ప్రశస్తిని తానే చెప్పుకుంటున్నాడు. నేను ఆ బాబాను చూడవలసిన అవసరం లేదు. ప్రచారం చేసుకునేవారు నిజమైన బాబాలు కాదు. కనుక నేను వెనుతిరిగి వెళ్లిపోతాను అన్నారు.
అక్కడున్నవారంతా కాదు కాదు బాబా ఎటువంటి ప్రచారం చేసుకోరు. బాబా ఎప్పుడూ అట్లా చేయమని కూడా చెప్పరు. అవి ఎవరో భక్తులు కట్టి ఉండి ఉంటారు అన్నారు.
వారి బలవంతంమీద ఆ సాధువు శిరిడీలోని బాబా దగ్గరకు వచ్చారు. అతడిని చూడగానే బాబా బాగా కోపం తెచ్చుకుని ప్రచారం చేసుకునేవారి దగ్గరకు ఎవరో చెప్పారని రావడమేనా? ఏమీ అక్కర్లేదు. ఇక్కడ్నుంచి వెళ్లిపో.. నీ కోసం ఎవరూ చూడడంలేదు. వెళ్లు ఇక్కడ్నుంచి అని అరిచారు.
ఆ వచ్చిన వారంతా చాలా ఆశ్చర్యపోయారు. ఏమిటి మనం మాట్లాడుకున్నదంతా ఈ బాబాకు ఎలా తెలిసింది అనుకున్నారు.
సాధువు బాబాలోని సర్వజ్ఞత తెలిసి వచ్చింది. అతడు బాబాను పరి పరివిధాలుగా తన్ను క్షమించమని అడిగాడు.
అపుడు బాబా వౌనంగా కూర్చున్నారు. సాధువు లోపలికి వచ్చి బాబాకు నమస్కారం చేసి మరలా తన తప్పును కాయమన్నాడు.
బాబా చిరునవ్వుతో నేను ఎవరిని నీ తప్పు కాయడానికి. అందరినీ కాపాడే వాడు భగవంతుడు ఒక్కడే అని అక్కడ ఉన్న తీపి పదార్థాలను ఆయన చేతికిచ్చాడు. అతడు ఎంతో భక్తిగా వాటిని తీసుకుని కళ్లకద్దుకున్నాడు.
బాబా వెంటనే అవి తిను బాగున్నాయి అన్నారు. మహాప్రసాదం అని వాటిని ఆ సాధువు తిన్నాడు. ఆయనకు ఎంతో ప్రశాంతత చిక్కినట్లు అనిపించింది. -ఇంకాఉంది

జంగం శ్రీనివాసులు 837 489 4743