భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను అసలు రామేశ్వరం వెళ్లాలని అనుకుని తెచ్చుకున్నాను. దాన్ని కావాలంటే ఇచ్చాను. ఇప్పుడు..’’ అని సణిగాడు.
లేకపోతే నేను ఏం చేస్తాను. నీకు రామేశ్వరం భీమేశ్వరం ఎందుకు? ముందు నీ తల్లిని నీవు బాగా చూడు, రామేశ్వరం తర్వాత చూడవచ్చు. నా మాట విని త్వరగా ఇంటికి వెళ్లు లేకపోతే ప్రమాదం జరుగుతుంది అన్నారు.
దాంతో హరిబావు భయపడి వెంటనే ఇంటి ముఖం పట్టాడు.
అక్కడికి వెళ్లేసరికి వాళ్ల అమ్మ తన కొడుకు ఇంటికి తిరిగి రావాలని నిరాహారిగా ఉంది. పైగా బాబా నీవు నిజంగా దయ కలవానివైతే నా కొడుకు తిరిగి వచ్చేట్లు చేయి అని ప్రార్థిస్తూ వుంది.
బాబా చెప్పిన మాటలు తలచుకుని తాను చేసిన పొరపాటు చింతించాడు హరిబావు. అమ్మా ఇక నేను నీ అనుమతి లేకుండా, బాబా అనుమతి లేకుండా వాళ్ల అమ్మ అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు.
బాబాకు మసీదులో ఉన్నా అన్ని సంగతులూ తెలుస్తూనే వుంటాయి. కాని ఎప్పటికప్పుడు మాయ కమ్మినట్లుగా ఎవరూ దీన్ని గుర్తుపెట్టుకున్నట్లు కనిపించేవారు కారు.
ఒకసారి ఒక భక్తురాలు బాబా కోసం జొన్నరొట్టెలు తయారుచేస్తోంది. మడి కట్టుకుని పరిశుభ్రంగా చేసుకుని తీసుకుని బాబా దగ్గరకు వచ్చి వాటిని నివేదించాలని అనుకుంది. దానికోసమని రొట్టెలు తయారీ ఉండగా ఓ కుక్కవచ్చి పిండిని ముట్టుకోబోయింది. వెంటనే ఆమె ఛీ ఛీ అని అరుస్తూ ఒక కట్టెను తీసుకొని ఆ కుక్కపై విసిరింది. ఆ కర్ర దెబ్బ కుక్కకు తగిలి అది అయ్యో అని అరుస్తూ వెళ్లింది.
ఆ తరువాత స్వామి నివేదన కోసం రొట్టెలు తయారుచేసి బాబా దగ్గరకు తీసుకుని వెళ్లింది. ఆ సమయంలో అక్కడ హారతి జరుగుతూ ఉంది. బాబా తన ప్రక్కన ఉన్న మహిల్సాపతిని పిలిచి బయట ఇద్దరు ముసలివారు నా కోసం ఎదురుచూస్తున్నారు. లోపలికి తీసుకునిరా వారిని అని చెప్పి పంపించాడు. మహిల్సాపతి వెళ్లి చూసేసరికి ఒకరేమో రొట్టెలు పట్టుకుని ఉన్నారు. మరొకరు బిచ్చెకత్తెగా ఉన్నారు. ఈ రొట్టెలు తీసుకొచ్చిన ఆమెను లోపలికి తీసుకుని వచ్చి మహిల్సాపతి బాబా అక్కడ ఒకరే ఉన్నారని వారిని తీసుకుని వచ్చానని చెప్పారు.
బాబా వెంటనే ‘‘ఏమయ్యా భిక్షాటన చేసేవారు నీకు మనుషుల్లాగా కనిపించరా ఏమిటి? ఆ వృద్ధురాలై పాపమామె బిచ్చెకత్తెగా జీవనం చేస్తూ ఉంది కదా. ఆకలితో నకనకలాడే ఆమె నీకు కనిపించకపోవడమేమిటి?’’ అని అన్నారు.
వెంటనే తన తప్పును తెలుసుకుని మహిల్సాపతి ఆ వృద్ధురాలిని లోపలికి తీసుకుని వచ్చారు. అంతలో హారతి పూర్తి అయ్యింది. భగవంతునికి నివేదనలు అయ్యాయి. రొట్టెలు తెచ్చిన వృద్ధురాలి దగ్గర నుంచి రొట్టెలు బాబా తీసుకున్నారు. అందులోంచి ఒక రొట్టెను తీసుకుని అడుక్కునే అమ్మకు ఇచ్చారు. ఆమె ఎంతో ఆనందంగా ఆ రొట్టెను అందుకుని అక్కడే కూర్చుని తినడం ప్రారంభించింది.
అంతలో అక్కడికి ఓ కుక్కవచ్చింది. అది నాలుక చాపుతూ బాబా కాళ్ల దగ్గరకు వచ్చి నిల్చుంది. ఆశగా బాబాను చూస్తోంది. వచ్చావా.. దెబ్బలు కూడా తిన్నావు, ఇంద తీసుకో అంటూ దానికి బాబా ఒక రొట్టె తీసి తినిపించడం ప్రారంభించాడు. అవన్నీ అక్కడే నిల్చుని చూస్తున్న వృద్ధురాలికి చాలా ఆవేదన కలిగింది. తన్ను బాబా తక్కువ చేసి చూస్తున్నాడని అనుకుంది.
వెంటనే కన్నీరు కారుస్తూ ఓ మూలకు వెళ్లి కూచుంది. అంతా చూస్తూ కూడా బాబా ఊరుకున్నారు. అక్కడ ఉన్నవారికందరికీ ఏమీ అర్థం కాలేదు. ఆమె ఎందుకు ఏడుస్తోంది? బాబా ఆమె తెచ్చిన ప్రసాదాన్ని ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాలేదు.
బాబా కొద్దిసేపు తర్వాత ‘‘అమ్మా! నీ బాధ ఉపశమించిందా? ఇలా రా నీకు నేను ఒక విషయం చెబుతాను’’ అన్నాడు.
ఆమె దగ్గరకు వచ్చి ఏం చెప్తావు బాబా, నేను ఎంతో కష్టపడి నీకోసం తెస్తే, కుక్కలకు అడుక్కునేవారికి పెట్టావా అని నిష్ఠూరంగా అంది.
అమ్మా అందరి కడుపు నిండితే నా కడుపు నిండినట్లే. ఒకరు ఆకలి బాధతో ఉంటే నాకు ఎలా కడుపు నిండుతుంది. అందరిలోను పరమాత్మ ఉన్నాడు. ఎవరి ఆకలితో అలమటిస్తూ ఉంటారో వారికి నీవు అన్నం పెడితే ఆ ఫలం రాజసూయయాగం చేసిన ఫలాన్ని ఇస్తుంది. అమ్మా అది నీకు తెలియాలనే ఇలా చేసాను అని ఎంతో నిదానంగా చక్కగా చెప్పారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743