భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా కరుణ నాకు చాలా అవసరం అనుకున్నాడు. అనుకున్నట్లుగా నూల్కర్ వచ్చాడు బాబాను దర్శనం చేసుకున్నాడు. ఎంతో ఆనందం కలిగింది. దానితో అతడు తన దగ్గర ఉన్న బంగారు నాణేన్ని తీసి బాబాకు ఇచ్చాడు.
బాబా ఆ నాణేన్ని తీసుకుని అటు ఇటూ తిప్పి చూసి నూల్కర్ ఇది ఎంత విలువ కలది అని అడిగారు. అతడు నవ్వుతూ బాబా అది బంగారు నాంము కదా అని అన్నాడు. అవును నిజమే కాని దీని విలువ ఎంత?అని మళ్లీ అడిగారు. అప్పుడతడు అది 15 రూపాయల విలువ చేస్తుందని అన్నాడు. బాబా వెంటనే ఇది నువ్వు తీసుకుని నాకు రూపాయలనే ఇవ్వు అన్నారు. నూల్కర్ విస్తుపోయి తన జేబులోనుంచి 15 రూపాయలు తీసి బాబాకు ఇచ్చాడు.
అదేంటి నీవు 20 రూపాయలు ఇస్తానని అన్నావు కదా. మరి ఇప్పుడు ఈ పదిహేను రూపాయలే ఇస్తున్నావేమి. అన్నమాటను నిలబెట్టుకోవా అని అడిగారు.
నూల్కర్ ఆ మాటలకు ఆశ్చర్యపోయి పదే పదే నమస్కారం చేస్తూ ఇరవై రూపాయలు తీసి ఇచ్చాడు. అక్కడున్న వారు ఈ నూల్కర్ ఇపుడే ప్రథమంగా రావడం కదా. ఇది ఎలా జరిగింది అని అనుకుంటూ ఉంటే నూల్కర్ జరిగిన విషయం చెప్పాడు. నేను ఇక్కడకు రాకముందు బాబాను దర్శనం 20 రూపాయలు ఇద్దామని అనుకున్నాను. దాన్ని బాబా చెప్పారు. బాబా సర్వాంతర్యామి అని మళ్లీ నమస్కారం చేశాడు.
ఇది జరిగిన కొన్నాళ్లకు బాబా భక్తులలో శ్యామా అనుననతడికి బాబా నిజంగా సర్వాంతర్యామి అవునా కాదా అన్న సందేశం వచ్చింది. అతడు ఆ విషయమే ఆలోచిస్తుండగా బాబా ఎవరో భక్తుడు పోస్టులో రెండు రూపాయలు పంపించాడు. ఆ సమయంలో బాబా భిక్షాటనకు వెళ్లాడు. అది మంచి సమయం. బాబాకు సంగతి తెలుస్తుందా లేదా చూడాలి అనుకుని ఆ రెండు రూపాయలను మసీదులోనే ఒక చోట పాతి పెట్టాడు. కొద్దిసేపటికి బాబా వచ్చాడు. మామూలుగా పనులన్నీ జరిగిపోతున్నాయి. ఈ విషయం అడుగుతాడేమోనని శ్యామా రెండు రోజులు ఎదురుచూసాడు. కాని బాబా ఈ విషయం తెలియనట్టే ఉండిపోయారు. కొన్ని రోజులకు శ్యామా కూడా మరిచిపోయాడు.
ఆరు నెలల తరువాత ఒక రోజు శ్యామా జీతం తీసుకుని ఇంటికి వచ్చి పెట్టెలో పెట్టడు. తాను తన వారు బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చి వారినందరినీ తీసుకుని వారింటికి తీసుకుని వెళ్ళాడు. రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఆ తరువాత ఇంటికి వచ్చారు. తాను దాచిన జీతం తీసుకుని జమాఖర్చులు చూడాలని ఇవ్వవలసిన వారికి ఇవ్వాలనుకున్నాడు శ్యామా. వెంటనే తన పెట్టెలో పెట్టిన డబ్బును వెలికి తీయడానికి వెళితే అక్కడ ఉత్త పెట్టె ఉంది.
అందులో దాచిన బట్టలు కానీ, డబ్బులు కాని లేవు.
అయ్యో నేను లేని సమయం చూచి ఎవరో దొంగలు వచ్చి నా డబ్బును తీసుకుని వెళ్ళారు అని చాలా బాధపడ్డాను. వెంటనే ఈ విషయం బాబాకు చెబితే తన డబ్బును తనకు దొరుకుతుందని వెంటనే బబా దగ్గరకు పరుగెత్తి వెళ్లి విషయం అంతా చెప్పాడు.
బాబా వౌనంగా కొద్దిసేపు ఉండి తరువాత ఏం చేద్దాం నీవు డబ్బులు పోతే కాసేపు ఏడుస్తావు. నాకు పదిమందితో చెప్తావు. పనికిమాలిన వారు డబ్బును కాజేస్తుంటారు ఈమధ్య అంటే ఆరు నెలల క్రితం నా డబ్బు కూడా పోయింది. నేను ఎవరికన్నా చెప్పానా చూడు, బరాయించు ఏం చేద్దాం అని అన్నాడు.
శ్యామా వెంటనే అదేంటి బాబా మీ డబ్బు ఎవరు తీసుకుంటారు. నేనే మిమ్మల్ని పరీక్షించాలని ఆ బ్బును ఇక్కడే పాతి పెట్టాను’’ అని అన్నాడు.
బాబా ఏమీ తెలియనట్టే అవునా అది ఎప్పుడు జరిగింది, నాకు తెలియదే. నేను భక్తుడు ఎంత ప్రేమతో ఇచ్చాడు, దాన్ని నేను పోగొట్టుకున్నానే అనుకున్నాను. ఎందుకలా చేశావు? ఇప్పుడు చూశావా భగవంతుడు నీ జీతాన్ని పోగొట్టాడు అని బాబా అన్నాడు.
‘‘అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్షా ఏమిటి? అయినా నేను కావాలని దొంగతనం చేసానా ఏమిటి? మిమ్మల్ని పరీక్షించడానికి నేను అలా చేశాను’’ అన్నాడు శ్యామా.
‘‘నేను కూడా పరీక్షించాలని అనుకున్నాను. మరి నీవు నాకు రెండు రూపాయలు నీ మొత్తం జీతంతో సమానం కదా, నీవే పెద్ద ఆఫీసరువి. నేను పేద ఫకీరును’’ అని బాబా అన్నాడు.
శ్యామా తన తప్పు తెలుసుకున్నాడు. బాబా నన్ను క్షమించు. ఇక ఎప్పుడూ ఇలాంటి పనులు చేయను. నన్ను కాపాడు అని మరలా దణ్ణం పెట్టాడు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743