భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి అనుకోకుండా వాళ్ళ అత్తగారి గాజులు ఈమె తీసుకొందని అపవాదు వేశారు. దానితో ఆమె ఎంతో కృంగిపోయింది. సాయిబాబా నీవే దిక్కు. నాకీ అపవాదును పోగొట్టు అని పదే పదే సాయిబాబానే వేడుకుంది. అంతటి నింద వేసిన అత్తగారే కొద్దిసేపటికి ఈ కొత్త పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి ‘‘లక్ష్మీ నేనే నీ గాజులు తీసుకుని ఇక్కడ పెట్టాను. ఆ విషయం మర్చిపోయాను. ఇదిగో ఇక్కడే దోరికాయి, నిన్ను అనవసరంగా అన్నాను బాధపడకు’’ అని చెప్పింది. ఆ పెళ్లికూతురు నన్ను సాయినాథుడే రక్షించాడని పదే పదే దణ్ణం పెట్టింది. అలా సాయిబాబా ఆర్తిగా పిలిచినవారికి పలికే దైవం. ఆ సాయిలీలలను గూర్చి ఎంత చెప్పినా తక్కువే.
ఆనాడు శ్రీకృష్ణుడు ఆవులను తీసుకుని వెళ్లి అందరి స్నేహితులు చుట్టారా కూర్చుండబెట్టుకుని తాను మధ్యలో కూర్చుని సద్దిని తినేవాడట. అందరూ ఆ కృష్ణుని చూస్తూ నవ్వుతూ తుళ్లుతూ ఊరుగాయలు నంజుకుని తింటూ సద్దిని ఆరగించేవారట. అట్లానే ఈ సాయి కూడా మధ్యాహ్నం పూట భిక్షటాన చేస్తారు. తెచ్చినదాన్ని అక్కడున్న అందరికీ పెడతారు. ఆ తరువాత తాను తీసుకుంటారు. మాకు ఇది చూడటానికి సాయి, ఆ కృష్ణపరమాత్మ ఒకరే అనిపిస్తుంది అని చెప్పాడు.
నాకు అలానే అనిపించింది. భగవంతుడిని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీరు ఎంత అదృష్టవంతులో అన్నారాయన.
హంసరాజు సాయి దగ్గర సెలవు తీసకుని నాసిక్ వెళ్తానని చెప్పాడు. సాయిబాబా సరే అన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు హరిభావు అనే అతను వచ్చి హంసరాజ్ నాసిక్ వెళ్తున్నాడని తెలుసుకుని, అయ్యా నేను కూడా వస్తాను, నాకు అక్కడ చిన్న పని ఉంది అని చెప్పాడు.
బాబా హరీ నీ పని అక్కడ తప్పక జరుగుతుంది, వెళ్లిరా అన్నాడు. అతడు కూడా బాబాకు నమస్కారం చేసి నాసిక్ వెళ్లాడు.
నాసిక్‌లోని శివుని గుడికి వీరిద్దరూ వెళ్తున్నారు. అంతలో ఎక్కడ్నుంచో నరసింగ్ మహారాజు వచ్చి హంసరాజ్, నీ పని జరిగింది కదా ఇప్పుడు నీవు సంతోషంగా ఉన్నావుకదా అని అడిగారు.
అవును బాబా. నరసింగ్ బాబాకు హంసరాజు దణ్ణం పెట్టడు. ఇతను హరిభావు కదా, నాకు ఇతను ఒక రూపాయి ఇస్తానని అన్నాడు. కాని ఇవ్వనే లేదు. నా దగ్గరకువచ్చి కూడా ఇవ్వకుండా మనసులో రేపు ఇస్తాలే అనుకుంటే ఎలా? నాకిప్పుడు ఇవ్వు అని అన్నారు.
హరి చాలా సంతోషం ఆశ్చర్యం వేస్తుండగా జేబులోంచి రూపాయి తీసి నరసింగ్‌కు ఇచ్చారు.
నరసింగ్ మహారాజ్ మీకు మా సాయిబాబాకు తేడానే లేదు. నేనసలు బాబాకు రూపాయి ఇద్దామనుకుని మసీదు మెట్లు దిగి వచ్చేశాను కదా. మళ్లీ వెళ్లినపుడు ఇస్తాలే అనుకున్నాను. ఆ సంగతి ఇప్పుడు మీరు చెప్పి నా దగ్గర రూపాయి తీసుకున్నారు. దీని అర్థం నాకు ఏ పని పైనా అయినా శ్రద్ధ ఉండాలి అని బాబా చెప్తున్నట్లు నాకు అనిపిస్తోంది అన్నాడు హరిభావు.
నరసింగ్ ‘‘అవును నాయనా! ఇది నిజం! నీవు చేయాల్సిన పనిని సక్రమంగా చేస్తే చాలు. నాకు గాని ఆ సాయికిగాని డబ్బులు అక్కర్లేదు. కాని మీరంతా మేము చెప్పినట్లు నడుచుకుని ఆనందంగా ఉంటే మాకు అదే చాలు అంటూ అక్కడనుంచి వేగంగా వెళ్లిపోయారు.
హంసరాజ్ నేను ఇక్కడ నుంచి అక్కడకు వస్తే మీరు అక్కడ నుంచి ఇక్కడకు వచ్చారు. కాని అక్కడ ఇక్కడున్నది ఒక్కరే. మనకు ఇద్దరూగా కనిపించారు కాని సాయిబాబా అయినా నరసింగ్ మహారాజు అయినా ఒక్కరే. సకల దేవతా స్వరూపుడు అని మహిల్సాపతి చెప్పింది అదే కదా అని వారిద్దరూ మాట్లాడుకున్నారు.
పెళ్లి అయి పదేళ్లు గడుస్తున్నా తనకు పిల్లలు కలగలేదని ఒక షావుకారు చాలా బాధపడుతుండేవారు. అతడు ఒకనాడు దాసగణు దగ్గరకు వచ్చాడు. మాటల్లో షావుకారు బాధ దాసుగణుకు తెలిసి నీవు ఒకసారి శిరిడి సాయిని కలువు అని చెప్పాడు. దాసుగణు మాట ప్రకారం షావుకారు బాబాను దర్శనం చేసుకున్నాడు. బాబా ‘‘ఏమీ షావుకారువయ్యా నీవు. ఏదో ఒకనాడు నన్ను పిలిచి ఇంత అన్నం పెట్టితే సరిపోతుందా? కనీసం ఓ ఐదు రూపాయలన్నా నాకిచ్చావా?’’ అన్నాడు బాబా.
మొట్టమొదటిసారి చూస్తున్నాను కదా ఎందుకిలా మాట్లాడుతున్నారో అనుకుని జేబులోంచి 5 రూపాయలు తీసి బాబాకిచ్చాడు షావుకారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743