భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అమ్మా ఆకలి గొన్న ప్రాణి ఎవరైనా సరే భగవంతుడే. కనుక ఈ కుక్క ఇందాకటినుంచి ఆకలితో వెర్రిగా తిరుగుతోంది ఏమన్నా దొరుకుతుందేమోనని. నేను నీవు వస్తావని చెప్పాను. నీ రాక కోసం ఎదురుచూస్తోంది అందుకే పెట్టాను’’ అన్నాడు బాబా.
ఆమె ‘ఏమో బాబా నాకేమీ తెలియదు. నీవు ఏమి చెప్పితే అదే చేస్తాను’ అంది.
అదేనమ్మా. నీకై నీవు తెలుసుకోవాలి. లేకుంటే ఎవరైనా చెప్పితే వినాలి అన్నాడు బాబా. ఇక అప్పటినుంచి ప్రతిరోజూ లక్ష్మీబాయి షిండే రోజు వేడి వేడి రొట్టెలు తీసుకుని వచ్చేది. వాటిని బాబా అక్కడున్న అందరికీ పంచేవారు. కుక్కలు పిల్లలతోపాటుగా, ఒక్కోసారి ఆయన కూడా తినేవారు. బాబా చెప్పినట్టు వింటుందని బాబా లక్ష్మీబాయిని ఎంతో ప్రేమగా చూస్తారని అక్కడ ఉన్నవారంతా అనుకునేవారు.
మరోసారి హంసరాజ్ అనే అతను తనకు ఉబ్బసం వ్యాధి బాధపెడుతోందని వచ్చాడు. దాన్ని పోగొట్టమని చెప్పాడు. బాబా అతనికి పుల్ల పెరుగు తినవద్దని చెప్పారు. కాని ఆయనకు పెరుగు అంటే అమిత ఇష్టం. అందుకు బాబా పుల్ల పెరుగు కదా వద్దన్నారు. నేను తీయటి పెరుగు తింటానులే అనుకున్నాడు. దానికోసం పొద్దునే్న పాలు తోడు పెట్టేవాడు. కాని బాబా దర్శనం చేసుకుని మధ్యాహ్న హారతి చూచి వచ్చి అపుడు హంసరాజ్ అన్నం తినేవాడు. ఈ హంసరాజు బాబా దగ్గరకు వచ్చిన సమయంలో ఓ పిల్లి వచ్చి మొత్తం పెరుగు తినేసి వెళ్లిపోయేది. వచ్చి చూసుకునేసరికి ఆయనకు ఎంతో కోపం వచ్చేది.
ఇట్లా కాదనుకుని ఓ రోజు బాబా దర్శనానికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. పాపం ఆ పిల్లి రోజు మాదిరిగానే వచ్చింది. పెరుగు మూత తీయబోతుంటే హంసరాజు దానికోసమే చూస్తున్నాడు కదా. మంచి సమయం చిక్కిందనుకుని ఓ దుడ్డుకర్ర తీసుకుని బదా బదా బాదాడు. ఆ పిల్లి కుయ్యో మొర్రో అంటూ పరుగెత్తి వెళ్లిపోయింది. కాని కర్రవల్ల బాగా దెబ్బలు తగిలాయి.
ఆ తరువాత మామూలుగా పెరుగు దాచేసుకుని హంసరాజు బాబా దర్శనానికి వెళ్ళాడు. అక్కడ దెబ్బతిన్న పిల్లి బాబా దగ్గర సేద తీరుతోంది.
హంసరాజ్ వచ్చి బాబాకు నమస్కరించి బాబాను ఊది ప్రసాదం ఇమ్మని అడిగాడు.
బాబా ‘నీకు ఎందుకు ఊది, నీవు పెరుగు తింటే సరిపోతుంది కదా. పిల్లిని బాగా కొట్టి మరీ దాచుకుని వచ్చావు కదా. పోయి తిను. నీ రోగం పోతుందిలే, వెళ్లు వెళ్లు, ఊది లేదు గీది లేదు అని కసురుకున్నాడు.
తాను చేసిన పని బాబాకు ఎలా తెలిసిందా అని అనుకున్నాడు మనసులో. అక్కడే కూర్చున్నాడు. అతని మనసులో పరివర్తన కలిగింది. ‘‘బాబా నన్ను క్షమించు. నీవు నాకోసమే చెప్పావు కాని నేను జిహ్వ చాపల్యంతో ఈ పెరుగు తిన్నాను. నీవే ఈ పిల్లి రూపంలో వచ్చి పెరుగును నాకు అందకుండా చేశావని నాకు ఇప్పుడు తెలుస్తోంది. తెలియక చేసిన తప్పును క్షమించు బాబా’’ అని ప్రార్థించాడు. ‘‘ఇక ఎప్పుడూ ఏ ప్రాణిని కూడా నేను కొట్టను, పెరుగు కూడా నీవు తినమనేదాకా తినకుండా ఉంటాను’’ అని చెప్పాడు. బాబా చిరునవ్వు నవ్వాడు. హంసరాజ్ నేను ఏది చెప్పినా మీకోసమే చెబుతాను. వింటే మీకు బుద్ధి మారుతుంది. లేకుంటే ఏం చేస్తాము అని అన్నాడు.
అంతలో ప్రసాద్ అనే అతను వచ్చాడు. ఆయనతోపాటు మూర్తి అనే వారు కూడా వచ్చారు. మూర్తి వచ్చీ రాగానే బాబాకు నమస్కరించాడు. పది మాటల్లో తొమ్మిది మాటలు బాబా అనే అన్నాడు. ప్రసాద్ కూడా అట్లానే అంటున్నాడు. వీరిద్దరూ బాబా భక్తులుగా అక్కడివారికి పరిచయం చేసుకున్నారు. వారిద్దరూ కలిసి ‘‘బాబా మేము నీ దగ్గర నాల్గు రోజులు ఉంటాము మాకు అనుమతినివ్వు’’ అని అడిగారు. బాబా నవ్వుతూ ‘‘నాలుగు రోజులు ఉన్నా, నలభై రోజులు ఉన్నా ఒకటే. ఎన్ని రోజులు ఉన్నామని కాదు కావాల్సింది. ఇతరులను దోపిడీలు చేయకుండా ఇతరులమీద చాడీలు చెప్పకుండా ఉండాలి.
నేను ఏమని చెపుతున్నానో అర్థం చేసుకుని జీవితంలో వాటిని ఆచరించాలి, అదే ముఖ్యం’’ అన్నాడు. బాబా అట్లా ఎందుకు అన్నాడో తెలియక అక్కడివారు ఊరుకున్నారు. మహిల్సాపతి ఇంటికి మూర్తి ప్రసాదు ఇద్దరూ వెళ్లి నాలుగు రోజులు వారి దగ్గరే ఉంటామని బాబా ఇక్కడే ఉండమని చెప్పారని చెప్పి అక్కడే ఉన్నారు. ఒక రోజు మహిల్సాపతి దగ్గరకు నాసిక్ నుంచి ఒక గోవింద్‌రాజు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743