రంగారెడ్డి

హాకీ కర్రలతో హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25: కార్పొరేటర్ అనుచరుడు, టిఆర్‌ఎస్ నాయకుడిపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. సినీ ఫక్కీలో వెంబడించి హాకీ కర్రలతో దాడి చేయగా తల పగిలి, కాలు విరిగింది. ఈ హత్యాయత్నం వెనక ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు, రౌడీ షీటర్ల కుట్ర ఉందంటూ బాధితుడు ఫిర్యాదు చేయడంతో తెరాసలో దుమారం రేపింది. ఈ దాడి ఘటనకు సంబంధించి బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. మియాపూర్ కార్పొరేటర్ సమీప బంధువు అయిన చలసాని నాగ శ్రీనివాస్ (40) ఆయన అనుచరుడిగా టిఆర్‌ఎస్‌లో ఉన్నాడు. కాగా, సోమవారం రాత్రి 10గంటల సమయంలో మదీనగూడలోని వైన్ షాపు వద్దకు వెళ్ళిన శ్రీనివాస్ కారు దిగగానే గుర్తు తెలియని దుండగులు హాకీ స్టిక్‌లతో దాడి చేయగా తల పగిలి, కాలు విరిగింది. బాధితుడు గట్టిగా అరవడంతో జనం పోగవడంతో దుండగులు పారిపోయారు. ఈ హత్యాయత్నం వెనక అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు, ఇద్దరు మాజీ రౌడీ షీటర్లు, ఓ మహిళా నాయకురాలు హస్తం ఉందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.టిఆర్‌ఎస్‌లో తీవ్ర కలకలం రేపింది.

క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు
ఉప్పల్, ఏప్రిల్ 25: క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తెప్పించేందుకు కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. జిహెచ్‌ఎంసి నిర్వహిస్తున్న ఈస్ట్‌జోన్ వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలచారి, హైదరాబాద్ మహానగర డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్ధీన్, కార్పొరేటర్లు జి.సరస్వతి, ఎం.అనలారెడ్డి, జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణతో కలిసి ప్రారంభించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రీడామైదానాలుగా తీర్చిదిద్ది, ఇక్కడే మినీ స్టేడియాలు, ఇండోర్ స్టేడియాలనును నిర్మించడానికి విశేష కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మానసిక ఉల్లాసం, శరీర దారుఢ్యం కోసం క్రీడల ప్రోత్సాహానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను కేటాయిస్తూ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్‌ను పంపిణీ చేస్తుండటంతో ఎందరో క్రీడల పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారని వివరించారు. శిక్షణపొందిన ఎందరో క్రీడాకారులు ఉప్పల్ స్టేడియం వేదికగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటంతో గర్వంగా ఉందన్నారు. రామంతాపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మినీ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని, కాప్రా చర్లపల్లిలో 15 ఎకరాల స్థలాన్ని అప్పగిస్తే ఆధునిక పద్ధతిలో సకల సౌకర్యాలతో మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించడానికి కేంద్రం నుంచి భారీగా నిధులు తెప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
డిప్యూటీ మేయర్ ఫసియుద్ధీన్ మాట్లాడుతూ క్రీడా నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి జిహెచ్‌ఎంసి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రపంచ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తుందన్నారు.
ఆకట్టుకున్న క్రీడా విన్యాసాలు
ఈస్ట్‌జోన్ పరిధిలోని ఎల్‌బినగర్, ఉప్పల్, కాప్రా సర్కిల్ నుంచి పలు స్కూల్స్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ముందుగా చిన్నారులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్, క్రీడా విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాలు
వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన చిన్నారులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిభింబించేవిదంగా ఆటపాటలు అందర్ని ఆకర్శించాయి. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలను అతిథులు డాక్టర్ వేణుగోపాలచారి, ప్రభాకర్, బాబా ఫసియుద్ధీన్, జోనల్ కమిషనర్ రఘుప్రసాద్ అందజేశారు.

యువకుడి మృతితో బంధువుల ఆందోళన
గచ్చిబౌలి, ఏప్రిల్ 25: ఓ వైపు ముఖ్యమంత్రి పర్యటన.. మరో వైపు ఆసుపత్రి ముందు మృతుని బంధువులు ఆందోళన తీవ్ర ఉద్ధృక్తతకు దారితీసింది. అజీజ్‌నగర్ గ్రామ మాజీ సర్పంచ్ రాజేందర్ యాదవ్ కుటుంబ సభ్యులు వారం రోజుల కితం కారులో వెళ్తుండగా అప్పా జంక్స్ వద్ద లారీని ఢీకొట్టిన సంఘటనలో నాలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని కాంటినెంటల్ అసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో రాజేందర్ యాదవ్ భార్యతోపాటు కుమారుడు వరుణ్(18) చికిత్స పొందుతున్నారు. వరుణ్ కాలు విరగడంతో శస్తచ్రికిత్స చేశారు. వరుణ్‌ను సోమవారం డిచార్జి చేస్తామని డాక్టర్లు సూచించారు. తల్లిని మరో రెండు రోజులు ఉండాలని వైద్యులు సూచించారు. అందరం ఒకేసారి డిచార్జి అవుతామని తెలపడంతో ఆసుపత్రి వర్గాలు సమ్మతించాయి. ఉదయం బెడ్ సీట్లు మారుస్తుండగా వరుణ్ కింద పడిపోయాడు. సంఘటనలో అతని తలకు బలమైన గాయమైంది. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్.. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగర్ రావుని పరామర్శించేందుకు వస్తుండడంతో పోలీసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి పరామర్శ అనంతరం మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించడంతో మృతుని బంధువులు శాంతించారు. కెసిఆర్ వెళ్లిపోయిన తరువాత మరో మారు ఆసుపత్రి ముందు బైఠాయించి మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వర్గాలతో పోలీసులు మాట్లాడి నష్టపరిహారం ఇచ్చేందుకు సమ్మతించడంతో ఇరువర్గాలకు నచ్చచెప్పి సమస్యను పరిష్కరించారు.

1 నుంచి కండ్లకోయ పిటిసిలో శిక్షణా తరగతులు
మేడ్చల్, ఏప్రిల్ 25: మేడ్చల్ మండలంలోని కండ్లకోయ గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించిన పోలీసు శిక్షణా కేంద్రాన్ని మే 1న ప్రారంభించనున్నట్లు పోలీసు అకాడమీ ఐజి చారుసిన్హా పేర్కొన్నారు. మంగళవారం కండ్లకోయలో నూతనంగా నిర్మించిన పిటిసిని సందర్శించారు. పిటిసిలోని భవనాలను పరిశీలించారు. పిటిసిలో 230 మందికి శిక్షణ ఇచ్చే విధంగా గదులు, సామాగ్రి ఏర్పాటు చేసుకునే విధంగా శిక్షణ అందించే అధ్యాపకులు, రన్నింగ్ నిర్వహించే ప్రాంగణం, షూటింగ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 30వ తేదీన శిక్షణ తరగతులకు అభ్యర్థులు చేరుకుంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ రాధిక మాట్లాడుతూ ప్రస్తుతం అంబర్‌పేట్‌లో నిర్వహిస్తున్న పోలీసు శిక్షణా కేంద్రాన్ని పూర్తిగా కండ్లకోయ ప్రాంతానికి తరలించాలని భావించారని అన్నారు. కానీ, కొత్తగా కానిస్టేబుళ్ల నియామకాలకు ఇక్కడ సరిపడ వసతి ఏర్పాటు చేయకపోవడంతో అంబర్‌పేట్‌తోపాటు కండ్లకోయ పిటిసిలో శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కండ్లకోయలో పురుష అభ్యర్థులకు అంబర్‌పేట్‌లో పురుషులతో పాటు మహిళా అభ్యర్థులకు శిక్షణా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల పోలీసు అధికారులు, విద్యుత్ అధికారులు, స్థానిక ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక సౌరభంతోనే ఐక్యత సాధింపు
ఎల్‌బినగర్, ఏప్రిల్ 25: ‘్భరతదేశం ఐక్యమత్యంతో ఉంది అంటే అది కేవలం ఆధ్యాత్మిక సౌరభంతోనే జరిగిందని’ బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్ర్తీ పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ అల్కాపురి కాలనీ పార్కులో ఈనెల 24వ తేదీ నుండి మే 3వ తేదీ బుధవారం వరకు 10రోజుల పాటు నిర్వహించే దక్షిణామ్నయ పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలు సోమవారం సాయంత్రం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. శ్రీజగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం, నమిత ఫౌండేషన్ సంయుక్త్ధ్వార్యంలో ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథులుగా బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్ర్తి, ఆర్కెపురం డివిజన్ కార్పొరేటర్ వి.రాధధీరజ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ దేప సురేఖ భాస్కర్‌రెడ్డి, దేప ఫౌండేషన్ చైర్మన్ దేప భాస్కర్‌రెడ్డి విచ్చేశారు. కార్పొరేటర్ రాధధీరజ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ దేప సురేఖలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికతను పెంపొందించుకొని మానసిక ప్రశాంతత, అందరితో ఐక్యంగా ఉండాలని సూచించారు. బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్ర్తీ.. భక్తులను ఉద్దేశించి పలు ప్రవచనాలు చేశారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకలు బ్రహ్మశ్రీ పశర్లపాటి బంగారయ్యశర్మ, అధ్యక్షుడు తేలుకుంట్ల రమేష్‌గుప్త, డాక్టర్ మేడిచర్ల వెంకట జగన్నాథం, గంటి నగేష్, గట్ల రవీంద్ర పాల్గొన్నారు.

కూలీ పని పేరుతో అక్రమ వసూళ్లు

హయత్‌నగర్, ఏప్రిల్ 25: ప్రజల సమస్యలను పక్కనపెట్టి తెరాస కార్పొరేటర్లు, నాయకులు కూలీ పని పేరుతో లక్షల రూపాయలను అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. మంగళవారం చంపాపేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన పెడచెవిన పెడుతూ కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తుందని అన్నారు. ప్రజల సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఈనెల 28న తాండూరులో ప్రజాపోరు బహిరంగ సభను నిర్వహిస్తుందని తెలిపారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించడంతో పంటలు పూర్తిగా నష్టపోయారని అన్నారు. 2018-19 బడ్జెట్‌లో రైతులకు ఎరువులను ఉచితంగా ఇస్తామని చెప్పి.. ప్రచారం మాత్రం ఇప్పుడే ఇస్తున్నట్లు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీతో రైతులకు ఏమాత్రం లాభం చేకూరలేదని, లక్ష రూపాయలను నాలుగు దఫాలుగా మాఫీ చేయడంతో రూ.40వేల వరకు వడ్డీని రైతులే చెల్లించారని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతారనే తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అప్రజాస్వామికంగా అసెంబ్లీ నుండి బర్తరఫ్ చేశారని మండిపడ్డారు. తెరాస బహిరంగ సభకు అయ్యే ఖర్చులను ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. కూలీ పనిపేరుతో లక్షల రూపాయలను బెదిరించి వసూళ్లు చేస్తున్నారని అన్నారు. నాగోల్ బండ్లగూడలో ఇటీవల ఓ భవన నిర్మాణ మేస్ర్తిని బెదిరించి రూ.11వేలు వసూళ్లు చేశారని, వనస్థలిపురంలో స్వాగత్ హోటల్‌పై అధికారులతో దాడులు చేయిస్తామని బెదిరించి రూ.20వేలు కూలీ పని పేరుతో వసూళ్లు చేశారని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెరాస ప్రజాప్రతినిధులు.. ప్రజలపై పడి రాబందుల్లా పీక్కు తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్‌లో కార్పొరేటర్లు, ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్.. బిల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని తమకు మాముళ్లు ఇవ్వాలని బెదిరించడంపై ఆధారాలతో సహా తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజాపోరు యాత్రకు సొంత డబ్బులతో బహిరంగ సభకు వెళ్తున్నట్లు వివరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బహిరంగ సభకు హాజరుకావాలని కోరారు. సమావేశంలో తెదేపా నాయకులు కొప్పుల నర్సింహారెడ్డి, సామ ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, చింతల సురేందర్ యాదవ్, సత్యనారాయణ, గాంధీ, మాణిక్, మెట్టు సంజీవరెడ్డి, ధనుంజయ్య, జంగయ్య, కృష్ణ, శ్రీనివాస్, వెంకటేష్, ప్రకాష్ పాల్గొన్నారు.

మలేరియా నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25: మలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవంను పురస్కరించుకుని చందానగర్ సర్కిల్ 12 ఎంటమాలజీ విభాగం అధ్వర్యంలో పిజెఆర్ స్టేడియంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే గాంధీ, చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్తను బుట్టలలో వేయడం, పాత వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించడంతో మలేరియా రాకుండా నివారించవచ్చని వివరించారు. చందానగర్ సర్కిల్ 12 ఉప కమిషనర్ వి.మమత మాట్లాడుతూ మలేరియా సోకకుండా తరుచు దోమల మందు చల్లాలని ఎంటమాలజీ విభాగం సిబ్బందికి సూచించారు. దోమల నిర్మూలనకు వాడే మందులు, తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఏర్పాటు చేసిన వస్తువులను ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ నవతారెడ్డి, డిసి మమత పరిశీలించారు. సర్కిల్ 12 ప్రాజెక్టు అధికారి వత్సలాదేవి, ఎంటమాలజీ సూపర్‌వైజర్ నగేష్ టిఆర్‌ఎస్ నాయకులు పార్నంది శ్రీకాంత్, కృష్ణారెడ్డి, పోచయ్య, ఎం.ప్రసాద్, హరీశ్‌రెడ్డి, సులోచన, పర్వీన్ పాల్గొన్నారు.
కుషాయిగూడ: మలేరియా నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కాప్రా ఉప కమిషనర్ సరోజ సూచించారు. మలేరియ నివారణ దినోత్సవం సందర్భంగా కాప్రా సర్కిల్ కార్యాలయం నుండి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ కాప్రా సర్కిల్ పరిధి డివిజన్‌లో దోమల నివారణకు పక్క ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు. మలేరియా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి దోమల నివారణ లార్వాని నీటిలో వేయాలని సూచించారు. కాలనీలో దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఫాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమానికి ఎఎస్ రావునగర్ కార్పొరేటర్లు పావనిరెడ్డి, పన్నాల దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
వికారాబాద్: ప్రపంచ మలేరియా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం ర్యాలీ నిర్వహించారు. వికారాబాద్ ఏరియా ఆసుపత్రి నుండి బయలుదేరిన ర్యాలీ ఎంపిడివో కార్యాలయం వరకు సాగింది. అనంతరం రవీంద్ర మండపంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వికారాబాద్ ఎంపిపి ఎస్.్భగ్యలక్ష్మి, ఎంపిడివో ఎం.సత్తయ్య ప్రసంగించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి దశరథ్, డిప్యూటీ డిఎంహెచ్‌వో మనోహర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుధాకర్ షిండే, మాస్‌మీడియా అధికారి చంద్రయ్య, హెల్త్ సూపర్‌వైజర్ రవీందర్‌రెడ్డి, సబ్‌యూనిట్ అధికారి ఎండి మహమూద్ ఆలీ, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి సాయి చౌదరి పాల్గొన్నారు.