భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.శ్రీనివాస్, బెల్లంపల్లి (తెలంగాణ)
ప్ర: గురువుగారూ! నేను ఆర్థికంగా చాలా బలహీనుణ్ణి. మాన్య ముఖ్యమంత్రి సహాయనిధి నుండి గ్రాంట్ కోసం ఎమ్.ఎల్.ఏ ద్వారా విజ్ఞప్తి మాన్యశ్రీ కె.సి.ఆర్‌గారికి పంపించాను. సహాయం అందుతుందా?
సమా: తప్పక అందుతుంది. అయితే దరఖాస్తు ముఖ్యమంత్రిగారికి అందటంలో జాప్యం కనిపిస్తోంది. ఆ విషయం నిర్థారణ చేసుకోండి. మీకు నిలువలు ఉండకపోవచ్చు! కానీ సమయానికి డబ్బు లభించే యోగం ఉంది. ముఖ్యమంత్రిగారు స్వభావ రీత్యా దయాహృదయుడు. పైగా మీకు ప్రభుత్వ సహాయ యోగం కూడా వుంది. తప్పక మీ ప్రయత్నం ఫలిస్తుంది.

దైవపు నాగబాబు, గంగలకుర్రు, ఆంధ్ర
ప్ర: కుమారుని మూగతనం- మెదడు స్తంభించటం- భవిష్యత్తు ఏమిటి?
సమా: విచారించకండి. అబ్బాయి యోగం బాగుంది. కర్నాటకలోని మూకాంబికా దేవాలయంలో పదకొండు రోజులు బాలునితో సహా ఉండండి. ప్రదక్షిణాలు చేయించండి. అదృష్ట జాతకుడే.

దత్తాత్రేయ, రాంనగర్ గుండు, హైదరాబాద్
ప్ర: మోసం చేసేవాడికన్నా మోసగింపబడేవాడే ధన్యుడు అంటారు. దీని అంతరార్థమేమిటి?
సమా: అంతరార్థమేమిటంటే, ఋణకర్మ మనం చేసే ప్రతి కర్మకూ ప్రతికర్మ ఉంటుంది. ఒకే జన్మలో ఒకడు మరొకరిని మోసం చేస్తే మరో జన్మలో అతడు మోసగింపబడినవాని ఇంట్లోదాస్యం చేయవలసి వస్తుంది ఋణవిమోచన కోసం- అందుకే శ్రీమద్రామాయణంలో సీతామాత ఆంజనేయస్వామితో చెపుతుంది- శ్రీరామచంద్రుడెప్పుడూ ఇతరుల ఉపకారాన్ని ఆశించటం లేదు కదా! ప్రత్యుపకారం చేస్తున్నాడు కదా! అని. అదే అంతరార్థం.

ఆళ్ళ ప్రవీణ కాత్యాయని, కూకట్‌పల్లి (హైదరాబాద్)
ప్ర: ఆదిభట్ల గ్రామంలో ఇంటి స్థలం కొన్నాము. అది వివాదాస్పదంగా మారింది. మాకు దక్కుతుందా? పరిష్కార మార్గమేమిటి?
సమా: కొంత నష్టపోతారు. ఆలస్యంగా పరిష్కారం- ఆగ్నేయ భాగంలో వాస్తుదోషం- నివారణకు కొన్ని తాంత్రిక మార్గాలున్నాయి. అవి పత్రికాముఖంగా వివరించలేను. వీలయితే వ్యక్తిగతంగా సంప్రదించండి.

పంచాంగం సుబ్రహ్మణ్యశాస్ర్తీ, తిరుపతి (చిత్తూరు)
ప్ర: మంత్ర విద్యలో బీజాక్షరాల గురించి చెప్పగలరా?
సమా: బీజాక్షరాలంటే మంత్రానికి మూలమైన శబ్దతరంగాల అక్షర రూపం- స్థూలంగా ప్రణవ బీజాక్షరాలు మూడు- శక్తి బీజాక్షరాలు- ఐదు- అవి ఏమిటి అనేది పత్రికాముఖంగా చెప్పటం సరికాదు- ఉపదేశార్హమైనవి మాత్రమే.

సి.చందన, భీమడోలు, ఆంధ్ర
ప్ర: ఉన్నత విద్యకు నాకు నల్లజర్ల యోగిస్తుందా?
సమా: భేషుగ్గా యోగిస్తుంది. అభివృద్ధినిస్తుంది. సందేహించకండి.

ఎక్బాల్ జాని, బోధన్ (తెలంగాణ)
ప్ర: ఒక పోలీస్ కేసులో సాక్షిగా మారాను. అది కూడా నేరమైనట్లు పోలీసులు
అనుమానిస్తూ అవమానిస్తున్నారు. సాక్ష్యం చెప్పటం నేరమా?
సమా: ప్రతి విషయాన్నీ అనుమానించటం పోలీసు వృత్త్ధిర్మం- పరిశోధనలో వారికి అది తప్పదు. అందుకే ఉర్దూలోనే ఒక సామెత ఉంది. ‘పౌజ్ దారీమే ముజ్రిమ్ ఔర్ గవహో, దోనో బరాబర్ హై’ అని- నిజాయితీ వుండండి. సమస్య పరిష్కారమవుతుంది.

కె.అనంతరామయ్య, నరసరావుపేట (ఆంధ్ర)
ప్ర: మీ సమాధానం అందింది- ధన్యవాదాలు. కుటుంబ విషయకంగా
ఎలా ఉంటుందో చెప్పండి?
సమా: కుటుంబ విషయాలలో మీరు కొంత పట్టుదల తగ్గించుకోండి. ‘ప్రాస్తుం షోడశ వర్ణాణిపుత్రం మిత్రవదా చరేత్’ అని పెద్దలు చెప్పిన నీతి-ఎదిగిన సంతానాన్ని శాసించటం తగదు.

చెరుకుపల్లి రాధాకుమార్, నూజీవీడు, ఆంధ్ర
ప్ర: నూతన గృహ యోగం?
సమా: మీరున్న ప్రాంతం నుండి ఆగ్నేయ భాగంలో పూర్వ నిర్మితమైన గృహాన్ని కొంటారు- వాస్తు విషయం జాగ్రత్తపడండి.
డి.సుబ్బారావు, బరంపురం, ఒడిశా స్టేట్
ప్ర: స్వంత ఇంటి యోగం?
సమా: కొన్ని మాసాలలోనే ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతాయి. వాయవ్య - ఈశాన్య దిశలు ప్రభావం చేస్తాయి.

వి.మహేశ్వరి, యాదాద్రి, బీబీనగర్ (తెలంగాణ)
ప్ర: మీరు లోగడ చెప్పినట్లు విద్యా విఘ్నాలు కలుగుతున్నాయి. అవి పోవాలంటే
ఏం చేయాలి?
సమా: స్థానికంగా వినాయక స్వామికి తేనెలో ముంచిన ఏడు కుడుములు నివేదన చేయండి. ప్రతి సోమవారం విద్యా విఘ్నాలు దూరమవుతాయి. నిర్మల్ జిల్లాలో బాసర సరస్వతీ దేవిని దర్శించండి.

ఎస్.్ధనలక్ష్మి, బరంపురం (ఒడిశా స్టేట్)
ప్ర: వివాహయోగం ఎప్పుడు- ఏ దిశ-
సమా: దక్షిణ దిశ - వ - న - క - ల - ర అక్షరాలు

సుదర్శనం రాకేశ్, సిరిసిల్ల (తెలంగాణ)
ప్ర: వివాహం- ప్రభుత్వోద్యోగం?
సమా: జూన్-జూలై నెలల తరువాత నుండి శుభం జరుగుతుంది. ప్రభుత్వోద్యోగం కంటే స్వతంత్ర వ్యాపారమే మీకు యోగించే అవకాశం ఉంది.

శ్రీనివాస భారతి - శ్రీకాకుళం (ఆంధ్ర)
ప్ర: రచయితగా నా స్థాయి ఎలా ఉండగలదు?
సమా: మీలో ఊహాశక్తి బలంగా ఉంది. క్రియాశక్తి తక్కువగా ఉంది. అంటే వ్రాయటానికి బద్ధకించటం. అది నివారణ చేసుకొంటే మంచి రచయిత కాగలరు.

ఉప్పు సత్యనారాయణ, తెనాలి (ఆంధ్ర)
ప్ర: స్వంత ఇంటి నిర్మాణంలో వాస్తు వివరణలు?
సమా: మీ ప్రశ్నకు సమాధానం సుదీర్ఘమైంది. ప్రశ్నలూ- ఉప ప్రశ్నలూ చెప్పటం ఈ కాలంలో సాధ్యంకాదు. వీలయితే వ్యక్తిగతంగా కలవండి. లేదంటే స్థానిక వాస్తు పండితులను సంప్రదించండి.

గరిమెళ్ల రమాకాంత్, వెల్లటూరు (ఆంధ్ర)
ప్ర: ఉద్యోగ యోగం- వివాహం?
సమా: ఆగస్ట్ తరువాత కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది.

బూదే రవిశంకర్, నర్సారావుపేట (గుంటూరు)
ప్ర: నా విద్యార్హత ఎమ్‌కామ్, నాలుగు సంస్థల్లో అకౌంటెంట్‌గా పనిచేశాను. నాకు
భవిష్యత్తు ఏమిటి?
సమా: మీలో అభిజాత్యము - చాంచల్యమూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా ట్రావెలింగ్ సంబంధ వ్యాపారం ఆలోచించండి.

పాకాల వైష్ణవీదేవి, చెన్నై (తమిళనాడు)
ప్ర: సంగీత విద్యలో ప్రావీణ్యము- ప్రసిద్ధి సంపాదించాలంటే ఏం చేయాలి?
సమా: ‘వీణాశ్యామలా’ మహామంత్రాన్ని ఉపదేశం పొందండి. ఉపాసించండి.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ